అన్వేషించండి

Podharillu Serial Today December10th: కూతురు అబద్ధాలు చెబుతోందని తెలుసుకున్న ప్రతాప్‌ ఏం చేస్తాడు..? మహా ఇప్పుడప్పుడే పెళ్లి ఎందుకు వద్దంటుంది..?

Podharilu Serial Today Episode December10th: మహా బైక్‌పై వెళ్లడం గమనించిన తండ్రి ప్రతాప్‌...ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే అబద్ధం చెబుతుంది. దీంతో భయపడి వెంటనే తనకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటాడు.

Podharillu Serial Today Episode: రోడ్డుమీద మహి, కిరణ్‌ను చూసిన ప్రతాప్‌ వాళ్ల బైక్‌ను ఫాలో అవుతూ వస్తాడు. ఉదయం తాను రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తున్నానని డ్రాప్‌ చేస్తానని చెబితే మహి వద్దులే నా ప్రెండ్‌ జ్యోతి డ్రాప్‌ చేస్తుందని చెప్పిన అబద్ధం ప్రతాప్‌కు గుర్తుకు వస్తుంది. ఓ సందులోకి వెళ్లిన తర్వాత వాళ్లిద్దరూ మాయమవుతారు. దీంతో చలపతి చెప్పిన మాటలు  ప్రతాప్‌ చెవిలో మారుమోగుతుంటాయి. నా ప్రెండ్‌ చెప్పినట్లే  మహి కూడా నాకు అబద్ధాలు చెప్పి ఎవరితోనో తిరుగుతోందా  అని అనుకుంటాడు..
 

           రాత్రి అయ్యేసరికి అన్నదమ్ములు శాంతిస్తారు. మాధవ్‌ తమ్ముడు కేశవ్‌పై కోప్పడతాడు. ఎవరిమీదో ఉన్న కోపం ఇంట్లో చూపించడమేంటని  చక్రికూడా నిలదీస్తాడు. ఇప్పటికే  మనకు బంధువులు, స్నేహితులు అందరూ దూరమయ్యారని...ఇప్పుడు మనలో మనం కూడా తన్నుకుని దూరమవుదామా అని పెద్దన్నయ్య మాధవ్‌ కేశ‌వ్‌ను నిలదీస్తాడు. ఊళ్లో ఎందుకు పనికి రాని వాళ్లు కూడా మన ఇంటి గురించి తక్కు చేసి మాట్లాడుతున్నారని కేశవ్ బాధపడిపోతాడు. మన పెద్దనాన్న  కూడా మనకు పెళ్లిళ్లు కావని హేళన చేస్తున్నారంటాడు. కోర్టు కేసు వల్ల మనం ఇంటిని కూడా మనం రిపేర్‌ చేయించుకోలేకపోతున్నామంటాడు. చిన్న తమ్ముడు కన్నా కూడా చాలా బాధపడుతుంటాడు.ఇంట్లోనుంచి ఎటైనా పారిపోవాలని అనిపిస్తుందంటాడు. దీంతో మాధవ్‌ అతనికి ధైర్యం చెబుతాడు. ఈఇంటిని బాగుచేయడానికి ఖచ్చితంగా ఓ అమ్మ వస్తుందని అభయమిస్తాడు.

           తన ప్రాజెక్ట్‌ ప్రజెంటేషన్‌ను  కార్పొరేట్ సంస్థ వాళ్లకు నచ్చిందని ఇంట్లో వదినతో చెప్పి మహా ఎంతో సంతోషపడుతుంది.ఆమె ఇప్పటికైనా మీ నాన్నకు విషయం చెబుదామా అంటే....లేదు వాళ్లు ప్రాజెక్ట్‌ ఓకే చేసిన వెంటనే  నాన్నకే మొదట చెబుదామంటుంది. అప్పుడే ప్రతాప్‌ ఇంటికి వచ్చి మహా సంతోషంగా  ఉండటాన్ని చూస్తాడు.  అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు. అప్పుడు తండ్రి మహాను ప్రశ్నిస్తాడు.మార్నింగ్ నువ్వు సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి  వెళ్తున్నాను అన్నావు కదా..తెచ్చుకున్నావా అని అడుగుతాడు. కాలేజీ క్లర్క్‌  లేడని...తర్వాత రమ్మని చెప్పారని మళ్లీ అబద్ధం చెబుతుంది. ఇంటికి  ఎలా వచ్చావమ్మా
అని అడగ్గా..జ్యోతి స్కూటీపై వచ్చానని అంటుంది.  నా కూతురు కూడా  ఇంత తేలిగ్గా అబద్ధాలు చెబుతుందా అని ప్రతాప్‌ బాధపడతాడు. ఇక లాభం లేదనుకుని తనకు పెళ్లి చేసేయ్యాలని భావిస్తాడు. వెంటనే పెళ్లి సంబంధాలు చూసే అతనికి ఫోన్ చేసి మాట్లాడతాడు. రేపు పెళ్లిచూపులకు ఏర్పాట్లు చేయమని కోరతాడు. పొద్దునేమో ఇప్పుడే  సంబంధాలు చూడటం ఎందుకని అన్నారు...ఇప్పుడేమో పెళ్లి చూపులకు రమ్మంటున్నారు. ఇంతలో మీ నిర్ణయం ఎందుకు మారిందని భార్య లలిత అడుగుతుంది. దీనికి ప్రతాప్‌ భయం అని సమాధానమిస్తాడు. మహా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టిందని....సర్టిఫికేట్లు తెచ్చుకోవడానికి చెప్పి స్నేహితుడితో  బండిపై వెళ్లడం చూశానని భార్యకు చెబుతాడు. అంటే మీరు దాన్ని అనుమానిస్తున్నారా  అని నిలదీస్తుంది. లేదు  ఆ అబ్బాయి గురించి ఆల్రెడీ  ఎంక్వయిరీ చేశానని...వాళ్లిద్దరూ కేవలం ప్రెండ్స్‌ మాత్రమేనని చెబుతాడు. అయితే మీ భయం ఎందుకని భార్య అడుగుతుంది. చలపతి కూతురు  ప్రేమంచిన  వాడితో లేచిపోయిందని... ఈ వయసులో ఆడపిల్లలను నమ్మలేమని ఇవాళే అర్థమైందని అంటాడు. మన అమ్మాయిని తప్పుబట్టడం లేదని...కానీ ఆ వయసు అలాంటిదని అంటాడు. పొరపాటున తప్పటడుగు పడితే  పరువుపోయి తలెత్తుకోలేమంటాడు. అందుకే తొందరగా పెళ్లి చేసి పంపించేయాలంటాడు. దీనికి భార్య లలిత కూడా సపోర్ట్ చేస్తుంది.

                   మాధవ్‌ తమ్ముళ్లందరినీ అన్నానికి పిలుస్తాడు. అప్పుడు తండ్రి నారాయణ కూడా వచ్చి అన్నం తింటుంటాడు. దీంతో మిగిలిన వాళ్లందరూ ఆయన్న గట్టిగా తిడతారు. మనం పెళ్లిచూపులకు వెళ్లలేదన్న ఆలోచన కూడా ఈ మనిషికి లేదని కోప్పడతారు. నువ్వు సరిగ్గా ఉంటే మాకు ఇలా బాధపడాల్సిన పనిలేదంటారు. ఇంతలో బ్రోకర్‌ ఫోన్ చేసి పెళ్లి చూపులకు ఎందుకు రాలేదని నిలదీస్తాడు. ఇంతలో చక్రి ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు.అయితే పెళ్లిచూపులకు రేపు వస్తారని ఆడపెళ్లి వాళ్లకు చెబుతానంటే  వారంతా సరేనంటారు. ఇక అందరూ కలిసి భోజనం చేసి రేపటి ఏర్పాట్లు గురించి చర్చించుకుంటారు.
                           

                    ఉదయం నిద్రలేచి కిందకు వచ్చేసరికి ఇంట్లో హడావుడి చూసి మహా ఆశ్చర్యపోతుంటుంది. ఏంటి ఏర్పాట్లని ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఈ హడావుడి ఏంటని వాళ్ల వదినను అడగ్గా..తనకూ ఏం తెలియదని చెబుతుంది. అప్పుడు  మహా వాళ్లను అడుగుతుంది. ఇంతలో వచ్చిన బంధువులు ఇవాళ మహాలక్ష్మీ పెళ్లిచూపులు కదా అని చెబుతారు. నాకు ఎందుకు చెప్పలేదని మహా వాళ్ల అమ్మపై కోప్పడుతుంది.అసలు నాకు చెప్పకుండా నా పెళ్లిచూపులు ఎవరు అరెంజ్‌  చేయమన్నారు అని అంటుంది. రాత్రి నువ్వు నిద్రపోయాక వాళ్లు ఫోన్ చేసి అడిగారని...మంచి సంబంధం కాబట్టి వెంటనే ఓకే చెప్పానని తండ్రి ప్రతాప్ బదులిస్తాడు. నాకు ఇప్పుడే పెళ్లివద్దని...నాకు కూడా లైఫ్‌లో గోల్‌ ఉంటుంది కదా...అది రీచ్‌ అవ్వకుండా పెళ్లి ఎలా చేసుకోనని నిలదీస్తుంది.

వాళ్లంతా ఒప్పించే ప్రయత్నం చేయగా...ఇప్పుడే  వస్తానని చెప్పి తాను పైకి పరుగెడుతుంది. తాను ఇంజినీరింగ్ గోల్డ్‌ మెడలిస్టునని చెప్పి మెడల్స్‌ మొత్తం చూపిస్తుంది. ఇవన్నీ సాధించింది..పెళ్లిచేసుకుని  వెళ్లిపోవడానికా అని ప్రశ్నిస్తుంది. ఇంత చదువు చదివి ఇంత పేరు తెచ్చుకుని ఇప్పుడు ఎవరినో కట్టుకుని విదేశాలకు వెళ్లిపొమ్మంటావా అని అడుగుతుంది. నీ కూతుర్ని గొప్ప పొజిషన్‌లో చూడాలని నీకు లేదా అని నిలదీస్తుంది. అన్నీ విన్న తర్వాత తండ్రి మాత్రం వాళ్ల ఆల్రెడీ వచ్చేసుంటారు...నువ్వు లోపలికివెళ్లి రెడీ అయి రా అంటూ పంపించడంతో ఇవాల్టి ఏపిసోడ్‌ ముగిసిపోతుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రని తోసేసిన మహా! సహస్రని మిస్ లీడ్ చేసిన అంబిక
కలవారి కోడకలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రని తోసేసిన మహా! సహస్రని మిస్ లీడ్ చేసిన అంబిక
Godavari Serial Today November 12th: 'గోదావరి' సీరియల్: జానుకి సంజయ్ వెరైటీ సారీ! నందుపై ఆకర్ష్‌ స్పెషన్ కేర్! మురళీకి నో చెప్పిన నందు!
'గోదావరి' సీరియల్: జానుకి సంజయ్ వెరైటీ సారీ! నందుపై ఆకర్ష్‌ స్పెషన్ కేర్! మురళీకి నో చెప్పిన నందు!
Nindu Manasulu Serial Today November 12th: నిండు మనసులు: సిద్ధూ ముందు తలదించుకున్న ప్రేరణ! అన్నాచెల్లెళ్లకి నిజం తెలుసని రచ్చ చేసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ ముందు తలదించుకున్న ప్రేరణ! అన్నాచెల్లెళ్లకి నిజం తెలుసని రచ్చ చేసిన విజయానంద్!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 12:అనసూయ,రామలింగం ప్రేమవిషయం విక్కీకి తెలిసిందా లేదా..?ఇప్పుడు రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..?
నువ్వులేక నేను లేను: అనసూయ,రామలింగం ప్రేమవిషయం విక్కీకి తెలిసిందా లేదా..?ఇప్పుడు రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget