అన్వేషించండి

Podarillu Serial Today May 22th: పొదరిళ్లు టుడే ఎపిసోడ్: మహా నాన్న ప్రతాప్ సంచలనం! కూతుర్ని ఇంటికి తీసుకెళ్తానని ఛాలెంజ్

Podarillu Serial Today Episode May 22th: చక్రితో ఛాలెంజ్‌ చేసిన ఉక్రోశంతో మహాను తీసుకెళ్లడానికి వచ్చిన ప్రతాప్‌..మారిపోయానంటూ కూతురిని నమ్మించి మోసం చేయడంతో ఆసక్తిగా మారిన పొదరిల్లు ఏపీసోడ్‌

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మహాలక్ష్మి తండ్రి ప్రతాప్ చక్రిని సవాలు చేస్తాడు.
  • వారం రోజుల్లో కూతుర్ని ఇంటికి తీసుకెళ్తానని ప్రతాప్ హెచ్చరిస్తాడు.
  • చక్రి తన బాధను, భయాన్ని కేశవ్‌తో పంచుకుంటాడు.
  • ప్రతాప్ మహాలక్ష్మి ఇంటికి వచ్చి, ఆమెను ఇంటికి తీసుకురావాలని కోరుతాడు.

Podarillu Serial Today Episode: పొదరిళ్లు టుడే ఎపిసోడ్‌లో పెద్ద ఎమోషన్ డ్రామా! మహాలక్ష్మి తండ్రి ప్రతాప్‌ చక్రిని ఛాలెంజ్ చేస్తూ కూతుర్ని వారం రోజుల్లో ఇంటికి తీసుకెళ్తానని హెచ్చరిక చేస్తాడు. చక్రి బాధపడగా, ప్రతాప్ మహా ఇంటికి వచ్చి భావోద్వేగాలు రెచ్చగొడతాడు. పూర్తి ఎపిసోడ్ వివరాలు ఇక్కడ చదవండి. 

చక్రి చాలా బాధగా కేశవ్‌ షాప్‌దగ్గరకు వెళ్తాడు.ఏమైందిరా అలా ఉన్నావని అడిగితే....ఏంలేదని అబద్ధం చెబుతాడు.డబ్బులు ఏమైనా కావాలా అని అడుగుతాడు.అలాంటిదేమీలేదని చక్రి చెబుతాడు. మరి ఎందుకు అలా ఉన్నావని అడగ్గా....నిన్న మహావాళ్ల నాన్నను కలిశానని చెబుతాడు.ఆయన నిన్ను కలవడం ఏంటిరా అని నిలదీస్తాడు.అసలు నువ్వువాళ్ల ఇంటికి ఎందుకు వెళ్లావని కేశవ్ ప్రశ్నిస్తాడు.  నేను వెళ్లలేదని....ఆయనే వాళ్ల ఫ్రెండ్‌తో కలిసి నా కారు ఎక్కారని చెబుతాడు. దాదాపు 45 నిమిషాలపాటు గొడవపడుతూనే ఉన్నాడని చెబుతాడు. వారంరోజుల్లో తన కూతురు మనసు మార్చి ఇంటికి తీసుకెళ్లిపోతాడని ఛాలెంజ్‌ చేశాడని చెబుతాడు. అందుకే భయంగా ఉందని అంటాడు. ఆయన  తీసుకెళ్తే మాత్రం మహాలక్ష్మీ వెళ్తుందా అని కేశవ్ అంటాడు. కన్నతండ్రి కదరా  కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోతుందేమోనని భయంగా ఉందని అంటాడు. నువ్వు ఏం భయపడకని....తన కాళ్లమీద తాను నిలబడేవరకు మహా ఆఇంటికి వెళ్లదని....ఒకవేళ బలవంతంగా తీసుకెళ్తే మేం ఉన్నాం కదా అని భరోసా ఇస్తాడు.

హైదరాబాద్‌ నుంచి ఇంటికి వెళ్లిన  ప్రతాప్‌ వీరావేశంతో చిందులు తొక్కుతుంటాడు.కొడుకును గట్టిగా పిలవడంతో భార్య లలిత వచ్చి ఏమైందండీ అని అడుగుతుంది. ఇంతలో ఆది వచ్చి ఏమైంది నాన్నా అని అంటాడు.ఇవాళ మీ నాన్న పరువుపోయిందని అంటాడు. నేను వస్తుంటే నా కారు డోర్‌ తెరిచి చేతులు కట్టుకుని నిలబడే ఆ డ్రైవర్‌గాడు....ఇవాళ నా ఎదురుగా నిల్చుని నాకే ఛాలెంజ్‌ విసిరాడని అంటాడు. దమ్ముంటే నీ కూతురిని మీ ఇంటికి తీసుకెళ్లమని సవాల్‌ విసురుతాడా అని ఆవేశంతో ఊగిపోతాడు. అసలు వాడిని మీరు ఎందుకు కలిశారని ఆది అడగ్గా....మా ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లానని కారు సర్వీసింగ్‌కు ఇస్తే....క్యాబ్‌ బుక్ చేయగా వీడు వచ్చాడని అంటాడు.  ఎట్టి పరిస్థితుల్లోనూ మహాను వారం రోజుల్లో ఇంటికి తీసుకురావాలని అంటాడు.కూతురు ముందు ఓడిపోయినా తట్టుకున్నానని...ఇప్పుడు ఆ డ్రైవర్‌గాడి ముందు ఓడిపోతే తట్టుకోలేనని అంటాడు. మహాలక్ష్మీ మనమాట వినడం లేదు కదండీ అని భార్య లలిత అంటుంది. కన్నీళ్లతో కాళ్లు కడిగి మరీ ఇంటికి తీసుకొస్తానని...ఆ తర్వాత ఇక్కడ నుంచి అది అక్కడికి వెళ్లదని అంటాడు. దీనికోసం ఎంత కిందకైనా దిగుతానని చెబుతాడు.మహాను ఇంటికి తీసుకొచ్చేందుకు తనవద్ద ఓఐడియా ఉందని వాళ్లకు చెబుతాడు.

మహా దగ్గరకు వెళ్లిన చక్రి...ఈరోజు మీనాన్నగారు కలిశారని చెబుతాడు.  దీంతో మహా చాలా ఆనందపడిపోతుంది. ఎవరో ఫ్రెండ్‌ను కలవడానికి వచ్చారని...అలా నా కారు ఎక్కారని అంటాడు. ఏమైనా గొడవపడ్డారా అంటే....ఎక్కిన దగ్గర  నుంచి గొడవపడుతూనే ఉన్నారని చెబుతాడు. కానీ నేనే ఆయన కోపం అర్థం చేసుకుని నోరు మెదపలేదని అంటాడు. ఆయన వయసుకు గౌరవం ఇచ్చి మాట్లాడకుండా ఉండిపోయానని అబద్ధం చెబుతాడు. త్వరలోనే మీ నాన్న నీకోసం వస్తారన్న నమ్మకం నాకు ఉందని చెబుతాడు.ఈ  మాటలకు మహాలక్ష్మీ మరింత సంతోషపడుతుంది.

చక్రి అన్నట్లుగానే ప్రతాప్‌ కూతురు ఇల్లు వెతుక్కుంటూ ఆ కాలనీకి వస్తాడు.వాళ్లఇల్లు తెలియక వెతుకుతుండగా...మాధవ్‌ చూసి ప్రతాప్‌ను ఇంటికి తీసుకొస్తాడు.అప్పుడే మహా ఇల్లు దులపడం చూసిచాలా బాధపడిపోతాడు.తండ్రిని చూడగానే మహా సంతోషంతో పరుగెత్తుకుంటూ వెళ్తుంది.నువ్వు చాలా పెద్దదానివి అయిపోయావమ్మా అని అంటాడు. ఇంటి పనులు కూడా చేస్తున్నావు అని మెచ్చకుంటాడు.నేను పగలు,ప్రతీకారాలు అన్నీ పక్కనపెట్టి నీకోసం దిగి వచ్చానని చెబుతాడు. ఆ మాటలకు మహా కరిగిపోతుంది. ఇంతలో చక్రి,కేశవ్‌ కూడా వస్తారు. కూతురు,అల్లుడిని ఇంటికి తీసుకెళ్తానని ప్రతాప్‌ అడగడంతో అందరూ షాక్‌ తింటారు.

పాత్ర    ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిం
ప్రతాప్‌    చక్రిని ఛాలెంజ్ చేసి మహాను ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయం 
చక్రి    ప్రతాప్‌తో గొడవ, భయం, బాధ
మహాలక్ష్మి   తండ్రిని చూసిన సంతోషం
కేశవ్‌   చక్రీకి ధైర్యం చెప్పాడు

Frequently Asked Questions

మహాలక్ష్మి తండ్రి ప్రతాప్ చక్రితో ఏమి అన్నాడు?

వారం రోజుల్లో తన కూతురిని ఇంటికి తీసుకెళ్లిపోతానని ప్రతాప్ చక్రితో సవాల్ విసిరాడు.

చక్రి ప్రతాప్ కలిసినప్పుడు ఏం జరిగింది?

ప్రతాప్, తన స్నేహితుడితో కలిసి చక్రికారులో వెళ్తూ, అతనితో గొడవపడ్డాడు.

చక్రితో ఏం జరిగిందని కేశవ్ అడిగాడు?

చక్రి అలా బాధగా ఉండటానికి కారణం ఏమిటని, డబ్బులు ఏమైనా కావాలా అని కేశవ్ అడిగాడు.

ప్రతాప్ మహాలక్ష్మిని ఎలా ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నాడు?

తన కూతురిని కన్నీళ్లతో కాళ్లు కడిగి, ఇంటికి తీసుకురావాలని ప్రతాప్ అనుకుంటున్నాడు.

మహాలక్ష్మి తండ్రిని చూసి ఏం అన్నాడు?

మహాలక్ష్మిని చూసి, నువ్వు చాలా పెద్దదానివి అయిపోయావమ్మా, ఇంటి పనులు కూడా చేస్తున్నావని ప్రతాప్ మెచ్చుకున్నాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget