Nuvvunte Naa Jathaga Serial Today March 11th: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసిన మిధున.. ఆడపిల్లకు దేవా రౌడీయిజానికి సంబంధం ఉందా!
Nuvvunte Naa Jathaga Today Episode మిధున దేవా గతం గురించి ప్రమోదినిని అడిగి తెలుసుకోవడం దేవా కోసం క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున దేవా గతం గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. దేవాలో మంచి గుణాలు, చెడ్డ గుణాలు బ్లాక్ బోర్డ్ మీద రాసుకుంటుంది. ఇంత మంచి వాడు రౌడీగా ఎందుకు మారాడో తెలుసుకోవాలని స్టోర్ రూంలోకి వెళ్తుంది. అక్కడ దేవా సర్టిఫికేట్లు ఉంటాయి వాటిని చూసి షాక్ అయిపోతుంది. రౌడీలా ఉన్న దేవా ఇంత బాగా చదివేవాడు. అన్ని క్లాస్‌లతో ఫస్టా.. మెరిట్ స్టూడింటే అయిన దేవా ఇలా అయిపోవడం ఏంటి? దానికి కారణం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది.
దేవా సర్టిఫికేట్లు పట్టుకొని ప్రమోదిని దగ్గరకు వెళ్తుంది. దేవా గురించి నిజం చెప్పమని దేవా సర్టిఫికేట్లు చూపించి అడుగుతుంది. ప్రమోదిని మిధునతో తన పెళ్లి అయినప్పుడు దేవా కాలేజ్ స్టూడెంట్ అని దేవాకి భక్తి చాలా ఎక్కువ అని ఇళ్లు కాలేజ్ తప్ప మరో లోకమే లేదని.. మామయ్యగారికి దేవా ముద్దుల కొడుకు అని చెప్తుంది. దేవా తిండి కూడా పక్కన పెట్టి ఎప్పుడు చూసిన చదువుతూనే ఉండేవాడని అన్నింట్లో ఫస్ట్ ర్యాంకులే అని దేవాని మామయ్యగారు దగ్గరుండి చూసుకునే వాళ్లని తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకరు అంటే ఒకరికి ప్రాణంగా ఉండేవారు.. అత్తయ్య మామయ్య ఇద్దరూ పోటీ పడి మరీ దేవాకి తినిపించేవారని దేవా గతం గురించి చెప్తారు. దేవా ఎందుకు రౌడీగా మారిపోయాడని మిధున అడుగుతుంది. ఇక సరిగ్గా అప్పుడే సూర్య కాంతం వచ్చి మరిది మీద సెటైర్లు వేస్తుంది. మిధున మధ్యలో కలుగ జేసుకోవద్దని కాంతం మీద కేకలేస్తుంది. ఇక ప్రమోదినిని మళ్లీ దేవా ఎందుకు రౌడీలా మారిపోయాడని అడుగుతుంది. దానికి ప్రమోదిని ఏం చెప్పకుండా పని ఉందని వెళ్లిపోతుంది. మిధున తన భర్త చాలా మంచోడని ఎలా అయినా మార్చాలి అని పాత దేవాలా అందరి ముందు నిలబెట్టాలని కంకణం కట్టుకుంటుంది.
మిధున రాత్రి అందంగా రెడీ అయి దేవా కోసం ఎదురు చూస్తుంది. దేవా రావడంతో మాస్టారూ మాస్టారూ నా మనసుని దోచారు అనే సాంగ్ వేసుకుంటుంది. దేవా మిధునని చూసి సారీ అండీ మా ఇళ్లు అనుకొని వచ్చేశా అంటాడు. మిధున దేవాని పిలవడంతో ఈ గొంతు ఎక్కడో విన్నట్లుందే.. ఇది మా రాక్షసే ఇది మా ఇళ్లే అనుకొని లోపలికి వెళ్తూ నువ్వేంటి ఈ రోజు కొత్తగా ఉన్నావని అంటాడు. దానికి మిధున థ్యాంక్స్ అంటుంది. ఎందుకు అని దేవా అంటే ఈ రోజు కొత్తగా ఉన్నాను అన్నావు అంటే రోజు నేను ఎలా ఉన్నానో నువ్వు చూస్తున్నట్లే కదా అంటుంది. దానికి దేవా తల మీద చేయి వేసుకొని ఒక్క నిమిషం అని మిధునతో చెప్పి ఫోన్‌లో ఫ్రెంట్ కెమెరా అన్ చేసి తనని తాను చూసుకొని నీకు అవసరమారా.. తను కొత్తగా ఉంటే నీకు ఏంటి పాతగా ఉంటే నీకు ఏంటి తూ అని అనుకుంటాడు. మిధున నవ్వుకుంటుంది.
దేవా భోజనం చేయడానికి అమ్మని లేపితే మిధున ఆపి అర్ధరాత్రి వరకు ఆవిడ మీ కోసం వెయిట్ చేస్తే ఆమె ఆరోగ్యం ఏమవుతుందని అంటుంది. ఇక భోజనం పెడతాను అని మిధున అంటే దేవా తినను అంటాడు. దాంతో మిధున ఎస్ నేనే గెలిచా అంటుంది. ఏమైందని అంటే మీ అమ్మ నేను బెట్ వేసుకున్నామని నేను వడ్డిస్తే నువ్వు తినవు అని బెట్ కాశామని నేనే గెలిచాను అంటే నిన్ను గెలవనివ్వను అని దేవా భోజనం చేస్తా అంటాడు. మిధున దేవా కళ్లు మూసుకోమని దేవాకి చెప్పి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తుంది. నీ పిచ్చి పరాకాష్టకు వెళ్లిందని దేవా అంటాడు. మిధున దేవాతో అంత మెరిట్ స్టూడెంట్‌వి ఎందుకు రౌడీలా మారావని అడుగుతుంది. దేవా తన పర్సనల్ విషయాల్లోకి రావొద్దని మిధునని తిడతాడు. ఇక మిధున దేవాతో నేనేం మీ అమ్మతో బెట్ కట్టలేదు నీతో చిన్న డ్రామా చేశానని అంటుంది. దేవా షాక్ అయిపోతాడు.
మిధున గురించి ఆలోచిస్తూ ఆదిత్య బాధగా కూర్చొని ఉంటే అక్కడికి మిధున తండ్రి వస్తాడు. హరివర్దన్ ఆదిత్యతో ఏం బాధ పడొద్దని రౌడీ పురుషోత్తం రాజకీయాల్లోకి వస్తున్నాడని వాడి మీద చాలా కేసులు ఉన్నాయని వాడిని దెబ్బ కొట్టి వాడి కుడి భుజం అయిన దేవాతోనే మిధున ఇంటికి వచ్చేలా చేస్తానని అంటాడు. ఇక శారద వీధిలో వెళ్తున్న కూరగాయల ఆవిడను పిలవమని కాంతానికి చెప్తే కాంతం కడుపు నొప్పి అని నాటకం ఆడుతుంది. దాంతో మిధున పరుగున వెళ్లి అమ్మా ఆకుకూరల అమ్మ అని పిలుస్తుంది. గంప కిందకి దించుతుంది. శారద వచ్చి కూరగాయలు కొంటే ఆకుకూరలామె మిధున మంచి పద్ధతి గల అమ్మాయి అని మీరు చాలా అదృష్టవంతురాలివి అని పొడుగుతుంది. మీకు ముగ్గురు కొడుకులమ్మా మీరు అదృష్టవంతులు నాకు ఇద్దరు కూతుళ్లు అని చెప్పుకొని ఆవిడ చెప్తుంది. దాంతో శారద ఆడ పిల్ల ఉంటే లక్ష్మీ దేవి అని ఆడ పిల్ల లేని ఇళ్లు ఇళ్లు లాగే ఉండదు అని ఆడపిల్లని పొడుగుతుంది. నాకు ఆడ పిల్లలేదని కన్నీరు పెట్టుకుంటుంది. మా మాటలు విన్న మిధున ఇంప్రెస్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో ఆస్తి పంపకాల రచ్చ.. కార్తీక్ నిర్ణయానికి కుస్తీలు పడుతున్న తండ్రి!





















