Nindu Noorella Saavasam Serial Today September 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అయోమయంలో పడిపోయిన భాగీ – ఆరు పిలుపుతో షాక్
Nindu Noorella Saavasam serial Today Episode September 27th: ఇన్నాళ్లు తనతో మాట్లాడింది ఆరు అక్కా అంటూ అయోయమంలో పడిపోతుంది భాగీ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీకి నిజం తెలిసినా అమర్ కు చెప్పకపోవడంతో మనోహరి షాక్ అవుతుంది. వెంటనే రణవీర్ దగ్గరకు వెళ్లి నిజం చెప్తుంది. దీంతో రణవీర్ షాక్ అవుతాడు.
రణవీర్: ఏంటి మనోహరి నువ్వు మాట్లాడేది
మను: అవును రణవీర్ అరుంధతిని చంపింది నేనే అని సరస్వతి మేడం భాగీకి చెప్పింది
రణవీర్: అంతా తెలిసినా కూడా భాగీ అమరేంద్రతో ఈ విషయం చెప్పలేదా..? ఎందుకు
మను: నేనే నీ వైఫ్ అని మన బిడ్డను వదిలేశానని కూడా చెప్పింది.
రణవీర్: నా వైఫ్ నువ్వే అని భాగీకి కూడా తెలిసిపోయిందా…?
మను: అవును నా చరిత్ర మొత్తం రివీల్ అయిందని చెప్తున్నాను కదా..? నేనేంటో వాళ్లకు తెలిసిపోయింది.
రణవీర్: ఇంత తెలిసినా కూడా భాగీ.. అమరేంద్రతో ఏ విషయం చెప్పలేదా..? ఏం ఎందుకు..?
మను: తెలియదు
రణవీర్: ఒకపక్క అమరేంద్ర నా వైఫ్ ఎవరా అని నీ గురించి జల్లెడ పడుతున్నాడు. వేట కుక్కలా ఆధారాల కోసం వెతుకుతున్నాడు. ఇంకో పక్క భాగీకి నువ్వే నా వైఫ్ అని తెలిసిపోయింది. అయినా కూడా భాగీ అమరేంద్రకు నిజం చెప్పకపోవడానికి కారణం ఏమై ఉంటుంది
మను: అదీ నాకు అర్థం కావడం లేదు. అమరేంద్రకు అంతా చెప్పేస్తుందని చాలా భయపడ్డాను.. కానీ భాగీ ఏమీ చెప్పలేదు. అలా చూస్తూ ఉండిపోయింది. నేను అరుంధతిని చంపిన విషయం చెప్తుంది అనుకున్నాను కానీ చెప్పలేదు.. నేనే నీ వైఫ్ అని చెప్తుంది అనుకున్నాను.. కానీ అది కూడా చెప్పలేదు. భాగీ మన గురించి అమరేంద్రకు చెప్పకపోవడానికి కారణం మన బిడ్డే అయ్యుంటుందా..? దీనికి మన బిడ్డకు లింక్ ఏమైనా ఉండుంటుంది అంటావా..? అసలు భాగీ ఎందుకు చెప్పలేదు..
రణవీర్: నువ్వే నా వైఫ్ అని భాగీ చెప్పనందుకు సంతోషించు.. కారణాలు వదిలేయ్
మను: లేదు రణవీర్.. అరుంధతి నాకు ఏదో ఫేవర్ చేసిందని ఇందాక భాగీ ఏదో చెప్తూ ఆగిపోయింది
రణవీర్: అరుంధతి నీకు చాలా హెల్ఫ్ చేసింది కదా..?
మను: కాదు వాటిని మించి అరుంధతి ఏదో చెప్పబోతూ ఆగిపోయింది. ఏదో నిజం దాని గొంతులో ఆగిపోయింది. ఆ నిజమే నా గురించి అమర్‌కు చెప్పనివ్వకుండా ఆగిపోయిందా..? అసలు ఆ నిజం ఏంటి..? దానికి నాకు సంబంధం ఏంటి..?
రణవీర్: ఎక్కువ ఆలోచించకు మనోహరి.. ఈ రోజు నీ టైం చాలా బాగుంది అనుకో.. నీ గురించి అమర్‌కు తెలియలేదు..
మను: ఈ గుడ్ టైం రోజూ ఉండదు రణవీర్. ఏదో ఒక రోజు భాగీ నోరు తెరచి అమర్‌కు నా గురించి అంతా చెప్పేస్తుంది. ఆ రోజు నా టైం బ్యాడ్ అవుతుంది. ఆలోపే నువ్వు దాని నోరు మూయించాలి.
రణవీర్: ఆ పని నేను ఎలాగూ చేస్తాను.. మన గురించి నిజం తెలిసిన వాళ్లను ఎలా బతకనిస్తాను..
మను: త్వరలోనే అమరేంద్ర ఆరు అస్థికలను గంగలో కలుపబోతున్నాడు. ఆ తర్వాత అరుంధతి ఆత్మ కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు. అది ఆత్మ కాదు మనిషి అని భాగీ అనుకుంటుంది..
రణవీర్: అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ ఇంట్లో ఎవ్వరికీ కనిపించని ఆత్మ ఒక్క భాగీకే ఎందుకు కనిపిస్తుంది.
మను: భాగీ అరుంధతికి తోడబుట్టిన చెల్లెలు కదా..?
రణవీర్: మరి అమరేంద్ర, పిల్లలతో కూడా అరుంధతికి అంతే రిలేషన్ ఉంది కదా..? మరి వాళ్లకు ఎందుకు కనిపించడం లేదు
మను: ఆ విషయం పక్కన పెడితే.. తన కనిపిస్తుంది మనిషే కాదు ఆత్మ అని భాగీకి తెలిసిన రోజు మొత్తం తలకిందులైపోతుంది
అంటూ మను చెప్పగానే ఆశగా ఆరోజు వస్తుందా మనోహరి అని అడుగుతాడు. వస్తుందని మను చెప్తుంది. తర్వాత ఆరు రూంలోకి వెళ్లి ఫోటో చూసిన భాగీ.. గార్డెన్‌లోకి ఒంటరిగా వెళ్తూ.. ఆరు గురించి ఆలోచిస్తుంది. ఇంతలో వెనక నుంచి ఆరు వచ్చి భాగీ అని పిలవగానే ఆరు భయంతో వణికిపోతుంది. వెనక్కి తిరిగి ఆరును చూసి గజగజ వణికిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















