Nindu Noorella Saavasam Serial Today November 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: నిజం తెలుసుకున్న భాగీ – భయంగా అమర్ ఇంటికి వెళ్లిన రామ్మూర్తి
Nindu Noorella Saavasam serial Today Episode November 8th: మనోహరి చంపడానికి ప్రయత్నిస్తున్న బ్లాక్ మ్యాన్ ఎవరో భాగీకి తెలిసిపోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: యమలోకంలో యముడు పాపుల గురించి తనకు తీరికలేని సమయం గురించి గుప్త తో చెబుతూ బాధపడుతుంటాడు. ఇంతలో ఆరు దేవకన్యలా గెటప్ వేసుకుని వస్తుంది. ఆరును చూసిన యముడు, గుప్త షాక్ అవుతారు.
యముడు: తను మానవ కాంతయా..? లేక నిజంగా దేవకన్యనా..?
గుప్త: నాకూ అటులనే అనిపిస్తుంది ప్రభు.. మనం నారదుల వారికి నిజం చెబితిమా..? అబద్దం చెబితిమా..? అవగతం అవ్వడం లేదు..
ఆరు దగ్గరకు వెళ్తుంది.
ఆరు: రాజు గారు, గుప్త గారు ఈ గెటప్ ఎలా ఉంది
గుప్త: అద్బుతం బాలిక.. అమోఘం.. ఇది వేషధారణ వలే లేదు.. అచ్చు దేవకన్యలా ఉన్నావు.. సాక్ష్యాత్తు ఆ దేవేంద్రుడి పుత్రిక ఇంద్రజ సైతం ఈర్ష పడేలా ఉన్నావు ఏడు ఏడు పద్నాలుగు లోకములలో నీకు సాటి ఎవ్వరూ లేరు అనుటలో అతిశయోక్తి లేదు..
యముడు: ఆపుము విచిత్రగుప్త నువ్వు నీ సోదరి ప్రేమ.. ఒక మానవ కాంతను మరీ అంతలా పొగడట ఇక్కడ అవసరం లేదు..
ఆరు: ఏంటి రాజు గారు.. మీ ఇంద్రజ డాటర్‌కు నేను పోటీగా వచ్చానని మీ ఫీలింగా
యముడు: మాకు అలాంటి మనోభావాలు ఏమీయూ లేవు.. నువ్వు ఈ వేషధారణలోనే ఉండుము.. ఎవరైనా అడిగినచో.. నువ్వు ఇంద్రజవే అని చెప్పుకునుము
ఆరు: అలాగే రాజు గారు నేను ఈ డ్రెస్ వేసుకుని మా లోకానికి వెళ్లే చాన్స్ ఏమైనా ఉందా..?
యముడు: నీకు ఆ సౌలభ్యం లేదు అంగుళీకము లేనిచో నువ్వు ఎచ్చటకు వెళ్లలేవు..
ఆరు: ( మనసులో) అయితే ఆ అంగుళీకము కొట్టేసే వెళ్తాను
యముడు: చిత్రవిచిత్ర గుప్త నీ అంగుళీయకము జాగ్రత్త..
గుప్త: అలాగే ప్రభు ఇటు చూడుము ప్రభూ.. ఈ బాలిక తస్కరించకుండా మా అంగుళీకమును మేము బంధించితిమి
యముడు: మేము కూడా మా అంగుళీకమును.. మా దేవి అంగుళీకమును జాగ్రత్తగా భద్రపరుచితిమి.. నువ్వు ఏ రకంగా తస్కరించలేవు బాలిక
ఆరు: ( మనసులో) మీ రింగు లేకపోతే ఏంటి..? నారదుడు ఉన్నాడు కదా..? అతన్ని పట్టుకుని భూలోకం వెళ్లిపోతాను.. ఈ నారదుడు ఏంటి ఎప్పుడూ పిలవక ముందే వచ్చేవాడు.. ఇప్పుడేంటి రావడం లేదు
గుప్త: ఏమిటి బాలిక నీ ముఖము చూస్తుంటే.. మనసులో ఏదో పథకము వేస్తున్నట్టు ఉన్నావు
ఆరు: రింగు లేకుండా ఎలాగూ మా లోకమునకు వెళ్లలేను కదా..? మీ బాస్ చెప్పారు కదా.. గుప్త గారు
గుప్త: అంగుళీకము లేకుండానే నువ్వు భూలోకం వెళ్లుటకు ఏదైనా పథక రచన చేయుచున్నావో అని మా అనుమానం బాలిక. నీ మదిలో అటువంటి తలంపు ఏదైనా ఉన్నచో ముందుగా మాకు విన్నవించుము
ఆరు: ఆ అన్ని చెప్తారు మరి..? పోండి గుప్త గారు..
గుప్త: ( మనసులో) ఈ బాలికనే ఇంద్రజ అని నారద మునీంద్రల వారికి చెప్పి ఈ బాలిక భూలోకమునకు వెళ్లుటకు మేమే దారి చూపి మరీ ద్వారము తెరిచితిమా..? జగన్నాథ యమహో యమా..
అనుకుంటూ గుప్త భయపడతాడు. ఆరు వెళ్లిపోతుంది. కింద భూలోకంలో ఇంట్లో ఉన్న భాగీ అమర్ తీసుకొచ్చిన పర్స్ చూస్తుంది. అది బ్లాక్ మ్యాన్ పర్సు అని అమర్ చెప్పడం గుర్తు చేసుకుని పర్స్ తెరచి చూస్తుంది. అందులో భాగీ వాళ్ల అమ్మ ఫోటో ఉంటుంది. దీంతో భాగీ షాక్ అవుతుంది. అయితే ఆ బ్లాక్ మ్యాన్ నాన్న అని అనుమానిస్తుంది. ఇంతలో రామ్మూర్తి అనుమానంగా అమర్ ఇంటికి వస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు






















