Nindu Noorella Saavasam Serial Today May 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనోహరికి షాక్ ఇచ్చిన అమర్ – చెప్పకుండా స్టేషన్‌కు వెళ్లిన మనోహరి
Nindu Noorella Saavasam Today Episode: ఇంటి దగ్గర అడిగితే స్టేషన్‌కు రానన్న మనోహరి అమర్‌కు చెప్పకుండా స్టేషన్‌కు వెళ్తుంది. అక్కడ అమర్ చూడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అందరూ లాన్ ఉంటారు. పిల్లల క్రికెట్ ఆడుతుంటారు. అమర్ కాఫీ తాగుతుంటాడు. భాగీ, అనామిక ఫీల్డింగ్ చేస్తుంటారు. రాథోడ్ బౌలింగ్ చేస్తుంటాడు. ఇంతలో మనోహరి లోపలి నుంచి బయటకు వస్తుంది. ఇంట్లో సైలెంట్ గా ఉంటే ఎవ్వరూ లేరనుకున్నాను అందరూ ఇక్కడున్నారా..? అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంటే భాగీ పిలుస్తుంది.
భాగీ: మనోహరి గారు ఇక్కడ ఇటు రండి.. పొద్దున్నే అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు మనోహరి గారు.
మనోహరి: మనసు ఏమీ బాగా లేదు.. అందుకే శివాలయానికి వెళ్తున్నాను
అనామిక: ముందే చెప్తే అందరం వచ్చే వాళ్లం కదా మనోహరి గారు
మనోహరి: అంటే సడెన్‌గా అనుకుని వెళ్తున్నాను వెంటనే వచ్చేస్తాను
రాథోడ్: మేడం మేము స్టేషన్‌కు వెళ్తున్నాము. మీరు కూడా వస్తే ఒక సారి బాబ్జీని కలవొచ్చు.
అనామిక: బాబ్జీ వెనక ఉండి.. ఇదంతా చేయిస్తున్న వాళ్లు ఎవరో చెప్పేటప్పుడు మనోహరి గారు అక్కడ ఉంటే మీ పని ఈజీగా అయిపోతుందిగా
మనోహరి: ఏయ్ ఏం మాట్లాడుతున్నావు
అనామిక: అయ్యో మనోహరి గారు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒకవేళ బాబ్జీ నిజం చెప్పకపోతే మీరు నాలుగు తగిలించైనా నిజం చెప్పిస్తారని అన్నాను అంతే
మనోహరి: నేను స్టేషన్‌కు రాలేను రాథోడ్
రాథోడ్: సరే మేడం
అమర్: ఎందుకు మనోహరి
మనోహరి: అక్కడికి వచ్చి వాడి ముఖం చూడలేను అమర్ వాడు చేసిన పని తలుచుకుంటేనే ఒళ్లు మండిపోతుంది. అలాంటిది వాడి ఎదురుగా నిలబడాలి అంటే నా వల్ల అసలు కాదు. బై అమర్
అమర్: మనోహరి చెప్పడం మర్చిపోయాను నీ ఫ్రెండ్ నిన్న కనిపించింది. హోటల్ లో ఉన్నానని చెప్పింది.
మనోహరి: నా ఫ్రెండా.. ఎవరు అమర్
అమర్: అదే అనాథ శరణాలయంలో కలిశాం కదా..? చిత్ర
మనోహరి: చిత్ర కొడైకెనాల్ లో ఉందా..? లేదు అమర్ నిన్న మాట్లాడినప్పుడు కూడా హైదరాబాద్ లో ఉన్నాను అని చెప్పిందే..
అమర్: నీకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుందట అందుకే చెప్పలేదేమో.. ఓకే తనని కలిస్తే లంచ్‌కు రమ్మని చెప్పు.. ఇవాళ బాబ్జీ నిజం చెప్పగానే.. రేపే హైదరాబాద్ వెళ్లిపోవాలి
అంటూ అమర్ చెప్పగానే మనోహరి సరే అంటూ వెళ్లిపోతుంది. తర్వాత పిల్లలందరూ కూర్చుని సరదాగా మాట్లాడుకుంటుంటే..
అంజు: మిస్సమ్మతో మాట్లాడదామా..
అమ్ము: బాల్కనీలో ఉంది వెళ్లి ఎంతసేపైనా మాట్లాడుకో
అంజు: మనలా కాదు మిస్సమ్మ ఇష్టపడే అక్క వాళ్ల పిల్లలాగా మాట్లాడదాము
ఆనంద్: కరెక్టే ఒక్కసారి మాట్లాడదాము
అంజు: హైదరాబాద్ వెళ్లిపోతే ఎలాగూ మాట్లాడలేము కదా ఈ ఒక్కసారికి మాట్లాడదాము
అమ్ము: నాకెందుకో రిస్క్ అనిపిస్తుంది అంజు. డాడీ నిజం మిస్సమ్మకు తెలియకూడదని మరీ మరీ చెప్పారు
అంజు: నేనేం నిజం చెబుదాం అనడం లేదు కదా..? జస్ట్ మిస్సమ్మకు ఫోన్ చేసి మాట్లాడదాం పాపం హ్యాపీగా ఫీలవుతుంది కదా
అమ్ము: సరే ఇదే లాస్ట్ మళ్లీ ఇంకొకసారి చేయకూడదు
అంజు: బ్రెయిన్ లెస్ బ్రో వెళ్లి అనామికను పిలుచుకురాపో
ఆకాష్, అంజును కొట్టి బయటకు అనామిక దగ్గరకు వెళ్లి రూంలోకి రమ్మని పిలుస్తాడు. ఎందుకని అనామిక అడిగితే అక్కడే చెప్తాము రా అంటూ చేయి పట్టుకుని లాకెళతాడు. అంతా గమనించిన భాగీ ఏదో జరుగుతుంది. అదేంటో కనిపెట్టాలి అని వెనకాల వెళ్తుంది. కిటికీ దగ్గర నిలబడి లోపలికి చూస్తుంటుంది. లోపల ఫోన్ చూసిన అనామిక పిల్లలను గుర్రుగా చూస్తుంటుంది. పిల్లలందరూ కలిసి అనామికను ఒప్పించి ఫోన్ చేయిస్తారు. మరోవైపు అమర్‌కు చెప్పకుండా స్టేషన్‌కు వచ్చిన మనోహరిని అమర్ చూసి ఎందుకొచ్చావని నిలదీస్తాడు. బాబ్జీని ఎలాగైనా నిజం చెప్పించాలని వచ్చాను అంటుంది మనోహరి ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు






















