Nindu Noorella Saavasam Serial Today March 21st : మూర్తి తన తండ్రి అన్న నిజం తెలుసుకున్న అరుంధతి – మిస్సమ్మకు మనోహరి వార్నింగ్
Nindu Noorella Saavasam Today Episode: తన తండ్రి మూర్తి అన్న విషయం తెలియడంతో అరుంధతి ఏడుస్తూ వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ పిల్లలను తన గదిలో తన గుండెల మీద పడుకొబెట్టుకుని నిద్రపోవడాన్ని మిస్సమ్మ చూసి హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు నుంచి మనోహరి చూసి ఇరిటేషన్‌గా ఫీలవుతుంది. కోపంగా తన రూంలోకి వస్తుంది. మనోహరిని కోపంగా చూసిన లీల ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నారని అడుగుతుంది. నేను ఉండాల్సిన ప్లేస్‌లో పిల్లలు ఉన్నారని అది చూసి నా మనసు తట్టుకోవడం లేదని చెప్తుంది మనోహరి. ఇంతలో లీల ఆ మిస్సమ్మ మాటలు నమ్మి నన్ను దూరం చేశారమ్మా అంటూ అలగడంతో ఆ మిస్సమ్మ పోయిపోయి నాతో పెట్టుకుంది దానికి నాతో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో తెలియాలి అని చెప్తుంది మనోహరి. మరోవైపు ఓటమంటే తెలియని ఆ మనోహరికి ఓటమి అంటే ఏంటో రుచి చూపించాలని రాథోడ్‌తో చెప్తుంది మిస్సమ్మ. తర్వాత అరుంధతి వెళ్తుంటే గుప్త ఆపడానికి ప్రయత్నిస్తాడు అరుంధతి ఆగకుండా మూర్తి ఇంట్లోకి వెళ్లిపోతుంది.
మూర్తి: నువ్వు... నువ్వు..
అరుంధతి: నేనా..
గుప్త: అమరేంద్ర అయ్యవారి ఇంట తోటమాలిని తమరితో మాట్లడుటకు వచ్చితిని
మంగళ: పగటి వేషగాణ్ని ఇంట్లోకి రానిచ్చావేంటి? ఏమయ్యా ఈయనకంటే బుద్ది లేక రానిచ్చాడు. నువ్వు అలాగే వస్తావా?
మూర్తి: అవసరం అయితే తప్పా మాట్లాడొద్దని నీకు ముందే చెప్పాను కదా? ముందు రెండు టీలు పెట్టు..
అనగానే మంగళ రెండు ఎవరికి వచ్చింది ఒక్కరే కదా అంటుంది. కనిపిస్తుంది ఒక్కరే అయినా నాకు ఇద్దరు ఉన్నట్లు అనిపిస్తుంది అంటాడు మూర్తి. గుప్త అరుంధతితో మాట్లడుతుంటే మంగళ మేము ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ మాట్లాడతావేంటి అని అడుగుతుంది. దీంతో మూర్తి అక్కడ ఎవరైనా ఉన్నారా అని దగ్గరకు వెళ్లి అరుంధతిని టచ్ చేస్తాడు. దీంతో షాక్ అవుతాడు మూర్తి.
మూర్తి: నాకు ఇక్కడ ఎవరో ఉన్నారనట్టు అనిపిస్తుంది. నీకు కూడా అనిపిస్తుందా?
గుప్త: నాకు అనిపించడం లేదు.
మూర్తి: చెప్పండి నాతో ఏదో మాట్లాడాలని వచ్చారు. అమరేంద్ర బాబు ఏదైనా పంపించాడా?
గుప్త: నేనే తమరిని ఒక సందేహం అడుగుటకు వచ్చితిని..తమరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారా? అంటే మిస్సమ్మ కాకుండా మీకు వేరొక కుమార్తె ఉన్నదా?
అని గుప్త అడుగుతుండగానే మంగళ ఈ వ్యక్తి వేషం మాట చూస్తుంటే తేడాగా ఉంది. కొంపతీసి అరుంధతి వచ్చిందా అని మనసులో అనుకుని భయపడుతుంది. మూర్తి ఏడుస్తూ నేను చేసిన పాపం గుర్తుకు వచ్చింది అంటాడు. తనకు కూతురు పుట్టిన వెంటనే కొన్ని కారణాల వల్ల అనాథ శరణాలయంలో వదిలేశాను. అంటూ నిజం చెప్పడంతో అరుంధతి ఏడుస్తుంది. నా కూతురు సరస్వతి అనే వార్డెన్ దగ్గర పెరిగిందట అని చెప్పగానే అరుంధతి అది నేనే అంటూ ఏడుస్తూ వెళ్లిపోతుంది. గుప్త కూడా బాలికా ఆగుము అంటూ వెళ్లడంతో.. అరుంధతి నిజంగానే వచ్చిందని మంగళ భయపడుతుంది. మరోవైపు మనోహరి పెళ్లి ఎలాగైనా ఆపాలని మిస్సమ్మ ఆలోచిస్తుంది. మనోహరి వస్తుంది.
మనోహరి: ఏవమ్మా మిస్సమ్మా ఒక్కదెబ్బకే నీళ్లలొంచి నేల మీద పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటున్నావేంటమ్మా? వచ్చేసింది చూడు నా రెండో అస్త్రం.
అనగానే ప్రిన్సిపాల్ అక్కడకు వస్తుంది. మనోహరి ప్రిన్సిపాల్‌ను తీసుకుని లోపలికి వెళ్తుంది. లోపలకి వచ్చిన ప్రిన్సిపాల్ అమర్‌తో పిల్లలకు సమ్మర్ క్యాంపు అరెంజ్ చేశామని పంపించమని అడుగుతుంది. పిల్లలు వద్దని బాధపడుతుంటారు. ఇంతలో మిస్సమ్మ వచ్చి పిల్లలు ఏ సమ్మర్ క్యాంపుకు రారని చెప్తుంది. దీంతో మనోహరి కోపంగా మిస్సమ్మను తిడుతుంది. అమర్ కూడా పిల్లలను పంపడం ఇష్టం లేదని చెప్పడంతో మనోహరి షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.