అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today July 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ తన భర్త అని మిస్సమ్మకు చెప్పిన ఆరు - ఆరు ఆస్థికలు ఘోరాకు ఇస్తానన్న మనోహరి

Nindu Noorella Saavasam Today Episode: కంగారులో అమరే తన భర్త అని అరుంధతి, మిస్సమ్మతో చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి రూంలోకి ఘోర వస్తాడు. ఇంతలో అమర్‌, మనోహరి రూంలోకి వస్తాడు. దీంతో మనోహరి టెన్షన్‌ పడుతుంది. ఎందుకు టెన్షన్‌ పడుతున్నావంటూ అమర్‌ అడిగేతే ఏం లేదని చెప్తుంది. సరే అయితే మనం మరోసారి జైలుకు వెళదామని అమర్‌ చెప్పగానే తనకు హెల్త్‌ బాగా లేదని ఇవాళ కుదరదని రెస్ట్‌ తీసుకుంటానని చెప్తుంది. దీంతో అమర్‌ సరేనని వెళ్లిపోతాడు. మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది.

మనోహరి: అమర్‌ మనసులో అనుమానాలు బలపడుతున్నాయి. ఆరు ఫ్రెండ్‌ ముసుగులో ఉన్నాను కాబట్టి నా మీద అనుమానం రావడం లేదు. దాని అస్థికలు నేను తీసుకొస్తాను. అది శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్లిపోయేలా నువ్వు చేయ్‌

 అని ఘోరకు చెప్తుంది. ఘోర నవ్వుతుంటాడు. మరోవైపు మిస్సమ్మ లంచ్‌ బాక్స్‌ తీసుకొచ్చి రాథోడ్‌కు ఇస్తుంది. దీంతో రాథోడ్‌ నువ్వింత ముద్దపప్పువు అనుకోలేదు అంటాడు. మిస్సమ్మ అదేంటి అంత మాటన్నావు అంటుంది. ఎప్పుడు చూసినా గొడవలు కాదు ప్రేమలో పడేయటం నేర్చుకోమని చెప్తాడు రాథోడ్‌.

రాథోడ్‌: నీ మనసులో ఉన్న ప్రేమ ఆ మనిషికి తెలియాలంటే నువ్వు కళ్ల ముందే ఉండాలి. కలలోకి కూడా వస్తూ ఉండాలి. అప్పుడే కదా మా సారు మనసులో స్థానం సంపాదించుకునేది.

మిస్సమ్మ: మీ సారు అంటే నాకు ప్రేమ అని చెప్పానా..?

రాథోడ్‌: కళ్లల్లో అంత స్పష్టంగా కనిపిస్తుంటే మళ్లీ మాటల్లో చెప్పాలా ఏంటి? ఈ బాక్సేదో ఆయన చేతుల్లో పెట్టండి. ఆయన బయటికి వెళ్తుంటే ఎదురెళ్లండి.  

మిస్సమ్మ: మీ సారు ఊరుకుంటారంటావా?

రాథోడ్‌: ఊరుకోక ఏం చేస్తారు. ఇంతకుముందు మేడం గారు కూడా ఎదురొచ్చేవారు. అప్పుడు రోజంతా మేడం గారి గురించే ఆలోచించేవారు. నీకు కూడా వర్కౌట్‌ అవుతుందిలే..

   అని రాథోడ్‌ చెప్పగానే మిస్సమ్మ తాను అమర్‌కు ఎదురొచ్చినట్టు అమర్‌ మిస్సమ్మను హగ్‌ చేసుకున్నట్లు కలగంటుంది. దీంతో రాథోడ్‌ సిగ్గుపడింది చాలు ముందు పని కానివ్వు అనగానే మిస్సమ్మ అమర్‌ కోసం ఎదురుచూస్తుంది. అమర్‌ రాగానే బాక్స్‌ ఇస్తుంది. బాక్స్‌ తీసుకుని వెళ్తున్న అమర్‌కు అరుంధతి ఎదురురావాలని గేటు దగ్గరకు పరుగెడుతుంది. మిస్సమ్మ కూడా ఎదురురావాలని పరుగెడుతుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుని ఇక్కడేం చేస్తున్నారు అని ప్రశ్నించుకుంటారు. ఇద్దరూ ఒకేసారి మా ఆయనకు ఎదురురావాలని చెప్పుకుంటారు. దీంతో మిస్సమ్మ షాక్‌ అవుతుంది. ఇంతలో తేరుకుని అరుంధతి ఏదో సర్ధి చెప్తుంది. ఇంతలో అమర్‌ వెళ్లిపోతాడు. మిస్సమ్మ బై చెప్తుంది. అమర్‌ కారు వెనక్కి తీసుకుని వచ్చి మరీ మిస్సమ్మకు బై చెప్పి వెళ్తాడు. దీంతో మిస్సమ్మ ఫుల్‌ హ్యాపీగా గెంతులేస్తూ ఆరు దగ్గరకు వెళ్తుంది.

మిస్సమ్మ: అక్కా మా ఆయన నాకు బై చెప్పేశాడు అక్కా.. ఫస్ట్‌ టైం..

ఆరు: అవునా..? అవును మిస్సమ్మ మీరు హద్దులు దాటి ముద్దుల దాకా వెళ్లారట నిజమా? పెద్దవాళ్లు మాట్లాడుతుంటే విన్నాను.

మిస్సమ్మ: ఓ అదా? ముద్దు లేదు హద్దు లేదు అక్కా బైమిస్టేక్‌ ఆయన మీద పడ్డప్పుడు లిప్‌స్టిక్‌ ఆయనకు అంటుకుంది. ఆ మనోహరిని ఏడిపించడానికి నేనది అలానే ఉంచా? ఆ ముద్దు చూసినప్పుడు ఆ మనోహరి ముఖం చూసుండాలి అక్కా?

ఆరు: ఇది నా ముఖం చూసుండాలి. ( మనసులో అనుకుంటుంది.) నేను అదే అనుకున్నాను మిస్సమ్మ లేదంటే మా ఆయన హద్దు దాటరని నాకు తెలుసు?

మిస్సమ్మ: మీ ఆయనేంటి?

 అనగానే ఆరు తన మాటలతో మిస్సమ్మను కన్‌ఫీజ్‌ చేసి వెళ్లిపోతుంది. మరోవైపు పోలీస్‌స్టేషన్‌ లో ఉన్న రణవీర్‌ను ఆయన లాయర్‌ కలుస్తాడు. బెయిల్‌ గురించి మాట్లాడుకుంటారు. జైలు నుంచి బయటకు రాగానే మనోహరిని చంపేస్తానని వార్నింగ్‌ ఇస్తాడు రణవీర్‌. మరోవైపు మనోహరి, నిర్మల, శివరాంల దగ్గరకు వచ్చి ఇంటికి ఏదో దోషం పట్టినట్టుందని చెప్తుంది. ఆరు ఆస్థికలను నదిలో కలపలేదు కదా అందుకే ఇలా జరుగుతుందేమోనని మనోహరి చెప్పగానే నిర్మల నిజమే అనిపిస్తుంది అంటుంది. కిటికీలోంచి చూస్తున్న ఆరు బాధపడుతుంది. ఆరు ఆస్థికలు ఎక్కడున్నాయని మనోహరి అడుగుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో మెరిసిన సినీ తారలు - మహేష్ బాబు, రామ్ చరణ్ TO రజనీకాంత్ ఫ్యామిలీల సందడి

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget