Nindu Noorella Saavasam Serial Today August 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్, భాగీల మధ్య రొమాన్స్ - ఎమోషనల్ అయిన ఆరు
Nindu Noorella Saavasam serial Today Episode August 15th: అమర్ కోసం రూంలోకి వెళ్లిన భాగీని చేయి పట్టుకుని లాగడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ రొమాంటిక్‌గా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: చిత్రను తిట్టి నిజం చెప్పడానికి వినోద్ దగ్గరకు వెళ్తుంటాడు రావు. ఆయన లిఫ్టులో పైన ఉన్న వినోద్ దగ్గరకు వెళ్తాడు. చిత్ర భయంతో మనోహరిన ఏదైనా చేయమని అడుగుతుంది.
చిత్ర: మను ఆ ముసలాడు వెళ్లిపోతున్నాడు మను. వినోద్‌కు నిజం చెప్పేస్తే నా లైఫ్ మొత్తం తలకిందులై పోతుంది మను నువ్వు ఏదైనా చేయ్ మను.. నన్ను కాపాడు మను
మను: చాలా బాగుంది చిత్ర అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నమాట. ఏది ఏమైనా నీ పెంపుడు తండ్రి నీ గురించి నిజమే చెప్పారు.
చిత్ర: మను నువ్వు కూడా ఏంటి మను ఇలా నా గురించి నీకు తెలియదా..?
మను: ఎందుకు తెలియదు.. ఒడ్డుకు చేరాక తెప్ప తగులబెట్టే రకం నువ్వు. నీ అవసరం ఉంటే ఏమైనా చేస్తావు. నువ్వు అవసరం తీరాక పడేస్తావు.. నిన్ను అమర్ పిలిచి డబ్బులు ఇవ్వగానే.. ఎంత ఓవర్ యాక్టింగ్ చేశావే.. ఇప్పుడు ఏం చేయాలి అనేది నీకు నువ్వే ఆలోచించుకో
అమర్ అంతా చూసి ఆయన వినోద్‌కు నిజం చెప్పడానికి వెళ్తున్నాడు మనమే వెళ్లి ఆయన్ని ఆపేద్దాం అంటూ రాథోడ్, భాగీలను తీసుకుని వెళ్తాడు.
చిత్ర: అయితే నేనే ఏదో ఒకటి చేస్తాను.
మను: ఏం చేస్తావు చిత్ర..
చిత్ర: చంపేస్తాను ఆ ముసలాడిని ఇప్పుడే చంపేస్తాను..
అంటూ వెళ్లిపోయి లిఫ్ట్ స్విచ్చాప్ చేస్తుంది. లిప్ట్ ఆగిపోతుంది. అది గమనించిన రాథోడ్ సార్ లిఫ్ట్ ఆగిపోయింది.. ఆయన లిఫ్ట్ లో ఉన్నారు అని చెప్పగానే అమర్ ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాడు. షాపులో కరెంట్ ఉంది. కానీ లిఫ్ట్ ఆగిపోయింది అంటే ఎవరో ఆపేసి ఉంటారు. రాథోడ్ వెంటనే వెళ్లి స్విచాన్ చేయి అని చెప్పగనే రాథోడ్ వెళ్లి ఆన్ చేస్తాడు. రావు పైకి వెళ్తాడు.
వినోద్: చెప్పండి అంకుల్… ఏంటో చెప్పండి అంకుల్.. చిత్రను పిలపించమంటారా..?
రావు: వద్దు బాబు చిత్ర గురించే మాట్లాడాలి బాబు. తన గురించి మీకు కొన్ని విషయాలు తెలియాలి.
వినోద్: ఏ విషయాలు అంకుల్..
రావు: అంటే బాబు అది ఎలా చెప్పాలో అర్థం కావడ లేదు..
వినోద్: పర్వాలేదు అంకుల్ చెప్పండి..
రావు: చిత్ర గురించి మీతో పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను
ఇంతలో అమర్, భాగీ పైకి వస్తారు.
భాగీ: బాబాయ్ గారు నేను చెప్పేది వినండి..
వినోద్: అంకుల్ ఏదో విషయం చెప్తా అన్నారు. మాట్లాడటం లేదు.
రావు: అంటే బాబు అది నన్ను ఈ షాప్ ఓపెనింగ్‌కు ఎవ్వరూ పిలవలేదు బాబు..
వినోద్: ఏంటి అంకుల్ చిత్ర మిమ్మల్ని పిలవలేదా..?
రావు: లేదు బాబు నా అంతట నేనే వచ్చాను. మీకు కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చాను. నా భార్య హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య ఉంది బాబు. వెంటనే తనకు ఆపరేషన్ చేయాలి
వినోద్: అయ్యో ఆంటీకి ఏమైంది అంకుల్.. చిత్ర ఆంటీకి హెల్త్ బాగా లేదని నాకెందుకు చెప్పలేదు
రావు: తను ఎందుకు చెప్తుంది బాబు అందుకే నేను చెప్పడానికి వచ్చాను. తను ఎలాంటిదో మీకు అసలు తెలుసా బాబు.. తను ఏం చేసిందో మీకు అసలు తెలుసా బాబు..?
చిత్ర: అయ్యో నాన్న ఇక చాలు నాన్న ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్నా
అంటూ అడ్డుపడుతుంది. అమర్ కూడా వినోద్‌ను కిందకు వెళ్లమని చెప్తాడు. రావును అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్తాడు. రావు వెళ్లిపోతాడు. తరవాత ఇంటికి వెళ్లాక అమర్ ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అవుతుంటే భాగీ వస్తుంది. రొమాంటిక్‌గా చూస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















