Nindu Noorella Saavasam Serial Today August 12th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్ ఇంటికి వచ్చిన రణవీర్ – రణవీర్ ను చూసి షాక్ అయిన మనోహరి
Nindu Noorella Saavasam Today Episode: మనోహరిని వెతుక్కుంటూ రణవీర్, అమర్ ఇంటికి రావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరిని వెతుక్కుంటూ అమర్ ఇంటికి వచ్చిన రణవీర్ తనను క్షమించమని.. అలాంటి తప్పు మరోసారి చేయనని అమర్‌కు చెప్తాడు. ఇంకోసారి తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉంటానంటాడు. దీంతో అమర్ క్షమించానని నువ్వు ఇప్పుడు ఇక్కడకు ఎందుకొచ్చావని అడుగుతాడు. దీంతో మీరు నన్నుకలవడానికి జైలుకి వస్తున్నారని తెలిసి నేనే ఇక్కడకు వచ్చానని మీరు నన్ను ఎందుకు కలవాలనుకున్నారని అడుగుతాడు రణవీర్.
అమర్: మా ఇంట్లో ఒక మనోహరి ఉంది. మీరు వెతుకుతున్న మీ భార్య ఆమెనేమో తెలుసుకుందామనుకున్నాను.
రణవీర్: ఒకసారి పిలిపించండి ఆమెను చూసి చెబుతాను.
అనగానే మిస్సమ్మ లోపలకు వెళ్లి మనోహరిని బయటకు రమ్మని పిలుస్తుంది. ఇవాళ్టీతో నీ బండారం బయటపడే అవకాశం ఉందని అనుకుంటుంది. మరోవైపు అరుంధతి కూడా మనోహరి బండారం బయటపడుతుందని హ్యాపీగా ఫీలవుతుంది. బయటకు వచ్చిన మనోహరి, రణవీర్ ను చూసి షాక్ అవుతుంది.
మనోహరి: మొత్తం చెప్పేసి ఉంటాడా? నా కష్టం మొత్తం వృథా అయిపోయిందా?
అని మనోహరి భయంగా భయంగా కిందకు వస్తూ కంగారుపడుతుంది.
అమర్: మనోహరి ముందుకు రా.. రణవీర్ మీరు వెతుకుతున్నది ఈ మనోహరినేనా?
రణవీర్: నేను వెతుకుతున్న నా భార్య మనోహరి ఈమె… కాదు కాదు.. నా భార్య ఈమె కాదు. నా భార్య పేరు మనోరమ.
మిస్సమ్మ: అదేంటీ.. ఇప్పటివరకు మనోహరి అన్నాడు. ఇప్పుడు మనోరమ అంటున్నాడు ( అని మనసులో అనుమానపడుతుంది.)
అమర్: సరే లోపలకు వెళ్లి మాట్లాడుకుందాం పదండి.
అని అందరూ లోపలికి వెళ్లగానే అమర్ తన తల్లిదండ్రులకు రణవీర్‌ను పరిచయం చేస్తాడు.
శివరాం: మీరు ఇంతగా వెతుకుతున్నారంటే మీకు మీ భార్య అంటే ఎంత ఇష్టమో?
రణవీర్: అవునండీ.. నా భార్యంటే నాకు ప్రాణం ఇచ్చేంత ఇష్టం. మీ కుటుంబాన్ని చూస్తే కూడా నాకు చాలా సంతోషంగా ఉంది.
అంటూ మనోహరి వైపు చూస్తాడు. అసలు రణ్‌వీర్ ఎందుకు అబద్ధం చెప్పాడో అర్థంకాక ఆలోచనలో పడుతుంది మనోహరి.
అరుంధతి: అసలేం జరుగుతోంది గుప్తగారు.. రణ్‌వీర్, మనోహరి పెళ్లి ఫొటోని నేను కళ్లారా చూశాను, మనోహరి స్వయంగా రణ్‌వీరే తన భర్త అనడం విన్నాను.
గుప్త: అతను రూటు మార్చి తన భార్యను తన వెంట తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ బాలుడు ఆ బాలికతో ఆడుతున్న ఆట చాలా భయంకరమైనది, మానసికంగా ఆ బాలికను కృంగిపోయేలా చేస్తాడు.
అరుంధతి: మను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ బాధను అనుభవించి తీరాల్సిందే..!
రణవీర్: ఈమె నా భార్య కాదని తేలిపోయింది. మరి మీకేమవుతుందో చెప్పలేదు.
అమర్: తను నా భార్య ఫ్రెండ్..
రణవీర్: ఓహో ఆమె ఈ ఇంటికి అతిథి అన్నమాట. కొన్నాళ్లకు తను ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికే వెళ్తుందన్న మాట.
నిర్మల: తను కూడా మా కోడలులా అనాథ. తనకి ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు వెళ్తుంది.
మనోహరిని భయపెట్టేందుకు కావాలనే తనని తాను మనోహరికి పరిచయం చేసుకుంటాడు రణవీర్. మనోహరిని మీరు ఎప్పుడైనా కోల్‌కత్తాకి వచ్చారా? అంటూ వివరాలు అడుగుతాడు. రణ్‌వీర్ వేసే ఒక్కో ప్రశ్నకి సమాధానం చెప్పలేక మనోహరి వణికిపోతుంది. ఆరోజు పార్టీలో నా వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడితే క్షమించండి అంటాడు రణ్‌వీర్. అందరికీ చెప్పారు కదా.. మళ్లీ ఎందుకు మనోహరికి స్పెషల్‌గా చెప్తున్నారు అంటూ డౌటుగా ప్రశ్నిస్తుంది మిస్సమ్మ. అయితే అందరికీ చెప్పినట్లు మనోహరి గారికి చెబితే ఎలా? తను ఎంతైనా నా భార్య కదా.. అని రణవీర్ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: 'రైడ్' రీమేక్ ఆఫర్‌కు 'నో' చెప్పిన రవితేజ - హరీష్ శంకర్ ఎంట్రీతో మారిన సీన్, కారణం ఏంటో తెలుసా?