అన్వేషించండి

Nindu Noorella Savasam October 12: మిస్సమ్మను బయటకు పంపేందుకు పిల్లల ప్లాన్లు.. అమర్​కి క్లాస్ పీకిన భాగీ!

అంజు అక్క,అన్నయ్యలతో కలిసి మిస్సమ్మ విషయంలో ఒక నిర్ణయానికి రావటంతో కథ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

Nindu Noorella Savasam, October 12, ఈరోజు ఎపిసోడ్ లో

మిస్సమ్మ: కలవని బంధాన్ని ఆ దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవాలని ఉంది. చెప్పకుండా వచ్చి చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. కానీ అర్ధాంతరంగా వెళ్ళిపోయి ఎవరూ తీర్చలేని లోటు మిగిలించింది.

అరుంధతి: ఏంటి ఆ బంధం?

మిస్సమ్మ : జరిగిందంతా చెప్తుంది. ఆ తర్వాత.. గుర్తొచ్చినప్పుడల్లా బాధేస్తుంది. చెప్పుకున్నంత మాత్రాన జరిగింది మార్చలేము కదా.. అయినా ఆ దేవుడు బంధాన్ని నిలబెట్టాలని రాసి పెట్టలేదు. దాని గురించి అడగకండి బాధేస్తుంది.

అరుంధతి: సరే అడగను కానీ నన్ను అక్క అని పిలుస్తావా అంటూ ఎమోషనల్ అవుతుంది.

మిస్సమ్మ : అయ్యో.. ఆ కన్నీరు ఏంటి?

అరుంధతి: ఆ దేవుడికి నా ఆనందాన్ని చూసి కుళ్లు వేసినట్టు ఉంది. నా ప్రేమని నాకు దూరం చేశాడు. నువ్వు చెప్పినట్లు నాకు రాసిపెట్టి లేదేమో. అందుకే నువ్వు అక్క అని పిలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది.

మిస్సమ్మ: ఎమోషనల్ అవుతూ అసలు నేను ఇక్కడికి వచ్చింది నీకు థాంక్స్ చెప్పాలని. నిజంగా నీవల్లే నాకు జాబ్ వచ్చింది. ఈరోజు ఈ ఇంట్లో ఉన్నానంటే అందుకు కారణం నువ్వే. అందుకే నిన్ను గట్టిగా హాగ్ చేసుకుని థాంక్స్ చెప్పాలని ఉంది అంటూ అరుంధతి దగ్గరికి వెళ్ళబోతుంది.

కంగారుగా వెనక్కి తగ్గుతుంది అరుంధతి.

మిస్సమ్మ : ఏం అక్క? నిన్ను హాగ్ చేసుకోవడం ఇష్టం లేదా మొన్న కూడా అలాగే చేసావు.

అరుంధతి: అలాంటిదేమీ లేదు, మా ఊర్లో అక్కచెల్లెళ్లు హగ్ చేసుకుంటే విడిపోతారు, అందుకే వద్దన్నాను.

మిస్సమ్మ : ఇదేదో మూఢనమ్మకం లాగా ఉంది. కానీ విడిపోతారు అంటున్నావు కదా అందుకే వద్దులే, మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సరే సరే మళ్లీ మనం రేపు మాట్లాడుకుందాం మళ్లీ ఆ నెలవంక వంట చేయడం స్టార్ట్ చేసేస్తుంది.

అరుంధతి: అయితే ఏం?

మిస్సమ్మ : తను ఈజీగా ఉండే వంటలు వండేస్తుంది. పిల్లలకు నచ్చిన వంటలు వండదు. నేను ఒక లిస్టు తయారు చేశాను దాని ప్రకారం వంట చేయమని చెప్పాలి అని కంగారుగా లోపలికి వెళ్ళిపోతుంది.

తన పిల్లలు ఆకలి గురించి మిస్సమ్మ ఆలోచిస్తుందని ఆనందపడిపోతుంది అరుంధతి. ఆ తర్వాత దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది మంజు. అది చూసిన అన్నలు, అక్క ఇది దీర్ఘంగా ఆలోచిస్తుందంటే మనకి మూడినట్టే అనుకుంటూ అంజు దగ్గరికి వెళ్తారు.

అమ్ము: అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావేంటి?

అంజు : నాకన్నా ముందు పుట్టిన వాళ్లు తెలివైన వారు అయితే నాకు ఇలా ఆలోచించవలసిన కర్మ ఉండేది కాదు అంటూ నాటకీయంగా మాట్లాడుతుంది.

ఆ మాటలకి హర్ట్ అయిన అమ్ము ఆమె తమ్ముళ్లు అంజుని కొడతారు. అడిగినదానికి తిన్నగా సమాధానం చెప్పు అంటారు.

అంజు: మిస్సమ్మని ఇంట్లోంచి ఎలా పంపించేయాలా అని ఆలోచిస్తున్నాను అంటూ రకరకాల ప్లాన్స్ చెప్తుంది.

అమ్ము : నువ్వు మిస్సమ్మని ఇంట్లోంచి పంపించేయటానికి కాదు, మనల్ని ఇంట్లోంచి పంపించేయడానికి ప్లాన్స్ చెప్తున్నట్లుగా ఉంది. అయినా మిస్సమని పంపించవలసిన అవసరం ఏముంది? ఒకరోజు ఆమెని అబ్జర్వ్ చేద్దాం మనకు నచ్చినట్లుగా ఉంటే యాక్సెప్ట్ చేద్దాం లేదంటే తర్వాత సంగతి తర్వాత చూద్దాం అంటుంది. అందుకు మిగిలిన వాళ్ళు కూడా ఓకే చెప్తారు.

ఆ తర్వాత వంట గదిలోకి వెళ్లి నీలని ఏముండుతున్నావని అడుగుతుంది మిస్సమ్మ.

నీల: బెండకాయ కూర, క్యాబేజీ ఫ్రై వండుతున్నాను.

మిస్సమ్మ : నిన్ను పనిలో పెట్టుకున్నది నీకు నచ్చింది వండుకొని తినమని కాదు, పిల్లలకు నచ్చింది వండి పెట్టమని అంటూ ఏం వండాలో లిస్ట్ ఇస్తుంది.

నీల: సార్ కి ఏం వండమంటారు?

మిస్సమ్మ : అది వెళ్లి ఆయనని అడుగు, నేను పిల్లలకు మాత్రమే కేర్ టేకర్ ని.

నీల: ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం అంటే కష్టం అమ్మ.

మిస్సమ్మ : నిన్ను పనిలో పెట్టుకునేది చెప్పింది చేయడానికి అమ్మ అంటూ ఆర్డర్ వేస్తుంది.

అలా ఆర్డర్ వేయడం అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ చూస్తాడు. అప్పుడే బయటికి వస్తున్న మిస్సమ్మతో ఆర్డర్లు వేస్తున్నావ్ ఏంటి అని అడుగుతాడు.

మిస్సమ్మ : పిల్లలకి ఏం వండాలో చెప్తున్నాను సార్.

అమర్: వాళ్లు అడిగింది వండి పెడితే ఆరోగ్యం పాడైపోతుంది.

మిస్సమ్మ : వాళ్ళు ఏమైనా ఒలింపిక్స్ పోటీలకి వెళ్లాలా సార్.. చిన్న వయసు, కడుపునిండా తింటే చదువు మీదకి దృష్టి వెళుతుంది. అంతేగాని ఇదే తినాలి అంటే వాళ్ళేం చేస్తారు. తల్లి లేని పిల్లలు ఇది కావాలి అని అడగలేరు. సొంత ఇంట్లోనే గెస్ట్లు అయిపోతారు. ఆ బాధ చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు అంటూ ఎమోషనల్ అవుతుంది.

అది చూసిన అరుంధతి కూడా ఎమోషనల్ అవుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget