Naga Panchami November 29th Episode : కరాళి ప్రాణత్యాగం.. రంగంలోకి ఫణేంద్ర.. పంచమికి అండగా సుబ్బు!
Naga Panchami Today Episode : అన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక కరాళి ప్రాణత్యాగం చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Naga Panchami serial today November 29th Episode : ఫణేంద్ర : మన యువరాణి పాముగా మారిన తర్వాతే మన లోకానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. పంచమిగా ఉన్నప్పుడు తనకి ఏమాత్రం కష్టం కలిగించొద్దని చెప్పారు.
నాగదేవత: ఆ స్వామి చెప్పారు అంటే అందులో కచ్చితంగా న్యాయం ఉంటుంది. అందుకు వ్యతిరేకంగా ప్రవర్తించినా ఫలితం ఉండదు. యువరాజా కార్తీక పౌర్ణమి వరకు నువ్వు అక్కడే ఉండి పాముగా మారిన తర్వాత ఈ లోకానికి తీసుకొని రావాలి. అంత వరకు యువరాణి మోక్షని కాపాడటానికి చేసే ప్రయత్నాలు గమనిస్తూ ఉండి పౌర్ణమి రోజున అవి ఫలించకుండా చూడు.
ఫణేంద్ర: ఆ మోక్ష చాలా తెలివిగా ఉన్నాడు మాతా. యువరాణిని శాశ్వతంగా భూలోకంలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు. మన నాగలోక రహస్యాలు కొన్ని మోక్షకు తెలిసినట్లుంది.
నాగదేవత: అలా జరిగే అవకాశం ఉంది యువరాజా మన యువరాణికి భూలోకంలో సాయం చేయడానికి అన్ని శక్తులు పనిచేస్తున్నాయి. నాగ సాధువుల ద్వారా తెలిసిపోయే అవకాశం పుష్కలంగా ఉంది.
ఫణేంద్ర: మోక్ష చేసే ప్రయత్నాలు ఫలిస్తే ఇక యువరాణి నాగలోకానికి తిరిగి వచ్చే అవకాశమే లేదు మాతా.
నాగదేవత: అలా జరగడానికి వీలు లేదు యువరాజా.. యువరాణి నాగలోకం వచ్చి తీరాల్సిందే. అందుకోసం మనం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు.
ఫణేంద్ర: అందుకు ఓ అవకాశం ఉంది మాతా. మోక్ష చనిపోవాలి. అప్పుడు యువరాణి భూలోకంలో ఉండాల్సిన అవసరం ఉండదు.
నాగదేవత: మోక్షను చంపడం కోసం యువరాణికి వచ్చే పౌర్ణమి వరకు గడువు ఇచ్చాను. ఆరోజు కూడా ఏదైనా ఆటంకం వచ్చి యువరాణి పాముగా మారినా మోక్షను కాటేయకపోతే.. నువ్వు మోక్షను కాటేసి చంపేయ్.
ఫణేంద్ర: ఆలోగా మోక్ష ప్రయత్నం ఫలించి యువరాణి శాశ్వతంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చే అవకాశం ఉంది కదా మాతా. అందుకే మాతా మోక్షని ఇప్పుడే కాటేసి చంపేస్తా.
నాగదేవత: వద్దు యువరాజా.. మన లోకం నుంచి ఎలాంటి తప్పు జరగకూడదు. ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చిన గడువు కార్తీక పౌర్ణమి వరకు అలాగే ఉంటుంది. కానీ మోక్ష వైపు నుంచి మనకు ఏదైనా ఆటంకం వస్తుంది అనిపిస్తే మాత్రం మోక్షని కాటేసి చంపేయ్. అప్పుడు ఏమాత్రం ఆలోచించకు.
ఫణేంద్ర: చాలు మాతా నాకు మీరిచ్చిన ఈ అవకాశం చాలు కార్యం చక్కబెట్టే వస్తా
నాగదేవత: యువరాణికి వచ్చే కార్తీక పౌర్ణమే చివరి అవకాశం అని చెప్పు యువరాజా.. ఆరు నూరైనా నూరు ఆరైనా నువ్వు ఆరోజు మన యువరాణిని తీసుకురావాలి. కార్తీక పౌర్ణమి మన లోకానికి చాలా ముఖ్యమైనదని తెలుసుకదా ఆ రోజే మన యువరాణినికి అధికారం ఇవ్వాలి. ఆ కార్యం ఎలా అయినా నువ్వు పూర్తి చేస్తావని నమ్ముతున్నాను.. అంతా నీ చేతుల్లోనే ఉంది యువరాజా.
ఫణేంద్ర: నామీద ఉన్న నమ్మకానికి ఒమ్ము చేయను. నాగలోకానికి యువరాణిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. నన్ను ఆశీర్వదించండి మాతా
మరోవైపు ఇంట్లో అంతా మోక్ష గురించే ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంటారు. ఇక జ్వాలా, చిత్ర ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారు. అప్పుడే మోక్ష తన గది నుంచి బయటకు వస్తాడు. అందరూ మోక్షకు ఏం కాలేదు కదా అంటూ సంతోష పడతారు. ఇక మోక్ష అయితే శబరితో ముని మనవడు పుడితే తాతయ్య పేరు పెట్టు అని మనవరాలు పుడితే శబరి అని పేరు పెట్టు అని శబరితో అంటాడు. శబరి మంచి వార్త చెప్పావు అంటూ సంతోషిస్తుంది. త్వరలోనే పండంటి బిడ్డ నీ చేతిలో ఉంటుంది అని అంటాడు. పంచమిని, మా బిడ్డను కడుపులో పెట్టుకొని చూసుకోండి అని అంటాడు. దానికి వైదేహి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము.. నీకు ఏం కాకపోతే అంతే చాలు నాన్న అంటుంది. పాపం పంచమికి ఎవరూ లేరు మీరే చక్కగా చూసుకోవాలి అమ్మ. ఇక అందరం నోరు తీపి చేసుకుందాం అని శబరి అందర్నీ తీసుకెళ్తుంది. మోక్ష మాటలు నమ్మబుద్ధి కావడం లేదని చిత్ర అంటుంది. పంచమి ప్రెగ్నెంట్ అయితే తనని చంపేద్దామని జ్వాలా అంటుంది.
పంచమి: (సుబ్బు ధ్యానంలో ఉంటే అక్కడికి వచ్చి) సుబ్బు నువ్వు ఎప్పుడూ ధ్యానంలో ఎందుకు ఉంటావు.
సుబ్బు: లోకం అంతా తిరగాలి అంటే సమయం సరిపోదు కాదా అందుకే కళ్లు మూసుకుంటే అంతా తెలిసిపోతుంది.
పంచమి: నీతో మాట్లాడటానికి మహా మహులు సరిపోరు ఇక నేనెంత సుబ్బు ఒక చిన్న నలుసంత.
సుబ్బు: నీ అస్తిత్వాన్ని నువ్వు మరచిపోతున్నావు పంచమి. నువ్వు పవిత్ర మైన నాగకన్యవి. నీలో కూడా విశేషమైన శక్తులు ఉంటాయి.
పంచమి: నాకు అవేమి వద్దు సుబ్బు ఇప్పుడు నా ముందు కొండంత సమస్య వచ్చి పడింది. దాన్ని ఎలా ఎదుర్కొవాలో అర్థం కావడం లేదు
సుబ్బు: ఆ కొండ ఎక్కు పంచమి అప్పుడు సమస్య నీ కాలి కింద ఉంటుంది.
పంచమి: తమాషా కాదు సుబ్బు నేను నిజంగానే చెప్తున్నా. నా భర్తకు నా విషయం అంతా తెలిసిపోయింది. ఇప్పుడు మోక్ష బాబు నాకు ఈ లోకంలో ఉంచేయాలి అని ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు కనిపించావ్ అందుకే నీ దగ్గరకు వచ్చాను.
సుబ్బు: త్యాగాలు రాతలను మార్చవు. విధిని తప్పించడం ఎవరి తరం కాదు. ఇప్పుడు కార్తీక మాసం జరుగుతుంది. ఈ మాసం శ్రేష్ఠమైన మాసం. ఈ పుణ్యమైన మాసంలో నిష్ఠగా దీపాలు వెలిగించి ఆది దేవుడు ఆ శివుణ్ని మొక్కుకుంటే చీకటి జీవితాలకు వెలుగు చూపిస్తాడు నువ్వు ఆ పని చేయు పంచమి. ఏ పని చేసినా సంపూర్ణ విశ్వాసంతో చేయు. నాకు ఈ మాసంలో కొన్ని ముఖ్య కార్యాలు ఉంటాయి ఇక నేను వెళ్లొచ్చా పంచమి
పంచమి: నున్ను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు సుబ్బు. కానీ నువ్వు ఉన్నావు అనే ధైర్యంతో ఇక్కడ అడుగులు వేయగలుగుతున్నాను. నువ్వు వెళ్లిపోతే నాకు దారి చూపే వాళ్లు ఎవరూ ఉండరు సుబ్బు. మన మధ్య ఉన్న బంధం ఏంటో తెలీదు కానీ నువ్వు వెళ్లిపోతాను అంటే నాకు దుఖం వస్తోంది.
సుబ్బు: నీకోసం ఉంటాను వెళ్లు పంచమి.
మరోవైపు కరాళి తన అన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినందుకు ప్రాణ త్యాగం చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకు మంటల్లో కాలిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*