Naga Panchami Serial Today April 17th: 'నాగ పంచమి' సీరియల్: కరాళి కారణంగానే నాగ శక్తులు పోయాయన్న ఫణేంద్ర.. అబార్షన్ విషయంలో మోక్ష వార్నింగ్
Naga Panchami Serial Today Episode: గర్భం తొలగించుకుంటేనే ఇంట్లో ఉంటామని పంచమిని చిత్ర, జ్వాలలు బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode: తమ బిడ్డను దూరం చేయొద్దని మోక్ష తల్లి కాళ్లు పట్టుకొని ఏడుస్తాడు. కొడుకును చూసి వైదేహి కూడా ఏడుస్తుంది. తనకు పుత్రభిక్ష పెట్టమని మోక్ష ఏడుస్తాడు. అంతా నీ చేతుల్లోనే ఉందమ్మ అని తనకు పుట్టబోయే బిడ్డ మీద తాను పంచమి ఎన్నో ఆశలు పెంచుకున్నామని.. ఇంతకు మించి నువ్వు ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే మా బిడ్డతో పాటు మేం కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడానికి సిద్ధమని చెప్పి మోక్ష వెళ్లిపోతాడు.
మరోవైపు కుల గురువు గారు ఉన్న చోటుకు మీనాక్షి, శబరి వస్తారు. అక్కడ ఆయన శిష్యులు పడిపోయి ఉంటారు. అది చూసిన శబరి తనకు ముందే అనుమానం వచ్చిందని గురువుగారు ఎప్పుడూ అలా మాట్లాడరని.. ఇక్కడ ఏదో జరిగిందని ఏదో దుష్టశక్తి గురువుగారితో అలా మట్లాడించిందని త్వరగా వెళ్లిపోదామని కూతురిని తీసుకొని బయల్దేరుతుంది.
ఇక పంచమి కూర్చొని నాగేశ్వరి పాము మాటలు తలచుకొని బాధ పడుతుంది. జ్వాల, చిత్రలు వచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపోతామని పాములు బెడద లేకుండా చేస్తేనే ఇంట్లో ఉంటామని అంటారు. మోక్షకు ఏం జరగకుండా ఉండాలి అంటే నీ బిడ్డను వదులుకో అని అత్తయ్య బాధ తగ్గించని చెప్తారు. మొండిగా ప్రవర్తిస్తే ఇళ్లు చిన్నాభిన్నమవుతుందని నూరిపోస్తారు. దానికి పంచమి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మోక్షకు ఏదో ఒక అనర్థం చేస్తే వైదేహి అత్తయ్యే పంచమి బిడ్డను తొలగించేస్తుందని అనుకుంటారు.
రఘురాం: అమ్మా గురువుగారిని కలిశారా.
శబరి: లేదు రఘు.. అక్కడి ఆనవాళ్లు చూస్తే ఏదో అపచారం జరిగినట్లు కనిపించింది. గురువుగారు కనిపించలేదు.
వైదేహి: వారు చెప్పాల్సింది చెప్పేశారు. ఇక ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తారు. ఇక గురువుగారిని వదిలేసి జరగాల్సింది చూడండి.
శబరి: నేను గురువు గారితో మాట్లాడిన వరకు దాని గురించి నువ్వు మర్చిపో వైదేహి. నేను చెప్పే వరకు మీరు ఎవరూ ఏం మాట్లాడకు.
మీనాక్షి: తల్లిగా నువ్వే కాదు వదినా మోక్షకు ఏమైనా జరుగుతుందేమో అని మా ప్రాణాలు కూడా విలవిల్లాడిపోతున్నాయి.
రఘురాం: వైదేహి అమ్మ నీ మాట కాదు అనడం లేదు.
వైదేహి: రోజు రోజుకు వాళ్లు బిడ్డ మీద ప్రేమ పెంచుకుంటారు. తర్వాత వాళ్ల మనసు మార్చేలేం.
మోక్ష: ఎప్పటికీ నా మనసు మారదమ్మ. ఎవరో చెప్పిన మాట విని ఓ పసి బిడ్డను చిదిమేయాలి అని చూడటం దారుణం. మేమే కాదు దీన్ని ఎవరూ ఒప్పుకోరు. ఈ విషయంలో నీ మాట విననమ్మ. పంచమిని తీసుకొని నేను ఎక్కడికైనా వెళ్లిపోతాను రా పంచమి.
పంచమి: ఆగండి మోక్షాబాబు. మీ తల్లిదండ్రులు మీకు శత్రువులు కాదు. మీ మంచే కోరుకుంటారు.
మోక్ష: అలా అని మన బిడ్డను చంపుకుంటామా. అమ్మా రేపు ఉదయం వరకు టైం ఇస్తున్నా ఇంకెప్పుడు గర్భం తీయించడం అనే ఆలోచన మానుకంటే ఈ ఇంట్లో ఉంటాను లేదంటే వెళ్లిపోతా..
శబరి: వైదేహి మోక్షను దూరం చేసుకొని నువ్వు ఉండగలవా..
మీనాక్షి: నువ్వు ఇలాగే మొండిగా ఉంటే మోక్ష వెళ్లిపోతాడు వదినా. దయచేసి ఆ పని మాత్రం చేయకు.
శబరి: దేవుడి మీద భారం వేసి పుట్టబోయే బిడ్డను కాపాడుకుందాం వైదేహి. ఆలోచించు.ఇక చిత్ర, జ్వాలలు మాత్రం వైదేహిని రెచ్చగొడతారు. పంచమికి ఎలా అయినా గర్భం తొలగించేయ్ మని చెప్తారు.
మరోవైపు కరాళి దగ్గరకు ఫణేంద్ర వస్తాడు. కరాళి ఫణేంద్రతో విజయం సాధించామని అంటుంది. గురువుగారి శరీరంలోకి ఆత్మగా తాను వెళ్లి చెప్పించిన మాటలు ఫణేంద్రకు చెప్తుంది. తన విజయాన్ని ఫణేంద్రకు చెప్తుకుంటూ జయించాను ఫణేంద్రకు చెప్పి పెద్దగా నవ్వుతుంది.
కరాళి: ఏమైంది ఫణేంద్ర మనం గెలిచామన్న సంతోషం నీలో మచ్చుకైనా కనిపించడం లేదు.
ఫణేంద్ర: ఇంకెప్పటికీ కనిపించదు కరాళి. నీకు సాయం చేసినందుకు నేను నా శక్తిని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాలో నాగశక్తే లేదు. నాగేశ్వరితో పోరాడి గాయపరిచినందుకు నన్ను నాగదేవత శపించింది. ఇక నేను ఎప్పటికీ నాగలోకం వెళ్లలేను.
కరాళి: పర్వాలేదు ఫణేంద్ర. నీకు తోడుగా నేను ఉన్నాను. ఇప్పుడు మనం గెలుపు బాటలో ఉన్నాను. ఈ కరాళికి ఇక తిరుగులేదు. నువ్వు ఇక్కడే ఈ ఆశ్రమంలోనే ఉండు నీకు ఏ ఇబ్బంది రాదు.
మరోవైపు మోక్ష పంచమి కోసం పాలు రెడీ చేస్తాడు. శబరి వచ్చి కుంకుమ పువ్వు వేస్తుంది. చిత్ర, జ్వాలలు అది దూరం నుంచి చూస్తారు. అర్జెంటుగా ఏదో ప్లాన్ చేయాలి వైదేహి అత్తయ్యని భయపెట్టాలి అనుకుంటారు. శబరి పంచమి కోసం పాలు తీసుకొని వెళ్తుంది. ఇక చిత్ర జ్వాలలు మెట్లమీద ఆయిల్ వేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.