అన్వేషించండి

Meghasandesham Serial Today  September 27th: ‘మేఘసందేశం’ సీరియల్‌: నక్షత్రను అనుమానించిన అపూర్వ – గగన్‌తో వంశీకి సారీ చెప్పిస్తానన్న అపూర్వ  

Meghasandesham Today Episode: వంశీ వాళ్లు అపూర్వ ఇంటికి వచ్చి గొడవ చేయడంతో గగన్‌తో సారీ చెప్పిస్తానని అపూర్వ హామీ ఇవ్వడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode: ఇంటికి వచ్చిన ఇందు ఏడుస్తుంది. ఎవరడిగినా ఏమీ చెప్పకుండా ఏడుస్తూనే ఉంటుంది. ఇంతలో వంశీ వాళ్ల అమ్మా నాన్నలు శరత్‌ చంద్ర ఇంటికి వస్తారు. కాబోయే భార్యతో బయటకు వెళితే తప్పని నా కొడుకుని కొట్టాడట ఇందు వాళ్ల అన్నయ్యా అని చెప్పగానే చెర్రి, ఇందు కవల పిల్లలు అన్నయ్య ఎవరు? అని మీరా అడగ్గానే ఇంకెవరు ఆ గగన్‌ గాడు అని ఇందు చెప్తుంది. దీంతో మీకు మీకు పగలుంటే మీరే చూసుకోవాలి కానీ మా కొడుకును కొట్టడమేంటండి అంటారు.

వంశీ డాడి: మీ మనిషి ఇంత చేసినా మీరేం మాట్లాడటం లేదంటే ఇక ఈ పెళ్లి చేసినా అర్థం ఏముంది.

శరత్‌: పొరపాటు పడుతున్నారు. వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు.

వంశీడాడీ: సంబంధం లేదని మీరంటున్నారు. అన్న అనే హక్కుతో కొట్టానని వాడంటున్నాడు.

అపూర్వ: అసలు వాడెవడండి కొట్టడానికి. అన్నయ్య అని వాడు చెప్పాడా? అసలు ఆ కుటుంబాన్ని ఈ ఇంటి గడపే తొక్కనివ్వం. వాడు మా మనిషని అనుకోము.

వంశీడాడీ: మీ మనిషి అని మీరు అనుకోకపోయినా.. వాడనుకుంటున్నాడు కదా? ఏమో వాణ్ని ఇంకా ఈ ఇంట్లో కొంతమంది సమర్థిస్తున్నారేమో

వంశీ మమ్మీ: ఎవరి అండ లేకపోతే అతను అంత ధైర్యంగా మా అబ్బాయిని ఎందుకు కొడతాడు.

వంశీడాడి: పెళ్లి కూతురు అన్నతో మా వాడు తన్నులు తిన్నాడని తెలిస్తే మా బంధువుల మమ్మల్ని అసహ్యించుకుంటారు. అసలు ఈ పెళ్లే జరగదు.

మీరా: అయ్యోయ్యో అలా అంటే ఎలా అండి. పెళ్లి అని అందరికీ చెప్పుకున్నాం.

ప్రసాద్‌: పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెళ్లి జరగదు అంటే అందరూ మా అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడతారు అండి.

వంశీ డాడీ: పెళ్లి చేస్తే మా అబ్బాయి గురించి కూడా అందరూ అలాగే అనుకుంటారండి.

శరత్‌: ముహూర్తాలు కూడా పెట్టుకున్న తర్వాత ఈ పెళ్లి జరగదు అనడం కరెక్టు కాదు.

 అనడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరుగుతుంది. ఇంతలో అపూర్వ మీ అబ్బాయిని కొట్టిన వాడి చేత మీకు క్షమాపణ చెప్పిస్తాను అంటుంది. దీంతో వంశీ వాళ్లు ఓకే అంటారు. మా ఇంటికి వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి అంటారు. కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పిస్తాను అంటుంది అపూర్వ. సరే అలాగే చేయండి అప్పుడే ఈ పెళ్లి జరగుతుంది. లేదంటే మీరు మరో సంబంధం చూసుకోవచ్చు అని చెప్పి వెళ్లిపోతారు. మరోవైపు భూమి ఇల్లు తుడుస్తుంటే గగన్‌ వస్తాడు.

గగన్‌: ఏయ్‌ తైతక్క పనమ్మాయికి చొప్పొచ్చు కదా? ఇవన్నీ నువ్వెందకు చేస్తున్నావు.

భూమి: ఇంటి మనిషిని నేనుండగా వేరే ఎవరికి చెప్పడం.

గగన్‌: ఓ తైతక్కా నువ్వు ఇంటి మనిషి ఏంటి?

భూమి: నేను ఇంటి మనిషిని అని మీరే అన్నారుగా

గగన్‌: ఇంటి మనిషి అనలేదు. ఇంట్లో మనిషి అన్నాను.

భూమి: అవును నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మీ కోపం ఆ అపూర్వ మీద కదా? అందుకని నక్షత్రను పెళ్లి చేసుకోను అన్నారు. ఒకవేల శరత్‌ చంద్ర గారికి అమ్మాయి ఉంటే చేసుకుంటారా?

గగన్‌: నీకేం పని లేదా? అడగడానికి ఇంతకన్నా వేరే టాపికే దొరకలేదా..?

అని గగన్‌ కోపంగా చెప్పగానే ఇంతలో శారద వచ్చి ఆ ఇంటి నుంచి ఎవరు వచ్చినా వాడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను అంటుంది. దీంతో గగన్‌ తిడతాడు. అందరూ కలిసి భోజనానికి వెళతారు. మరోవైపు అపూర్వ  హాస్పిటల్‌ లో భూమి గురించి చెప్పిన నిజాన్ని గుర్తు చేసుకుంటుంది. ఈ నిజం ఎవ్వరికీ తెలియకూడదు. తెలిసే లోపే ఆ భూమిని చంపేయాలని అనుకుంటుంది. ఇంతలో నక్షత్ర వచ్చి గగన్‌ను సపోర్టు చేసి మాట్లాడుతుంది. అపూర్వ కోపంగా కొత్తగా వాణ్ని సపోర్టు చేసి మట్లాడుతున్నావు అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

ALSO READ: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Swiggy One BLCK: స్విగ్గీ కొత్త ప్రీమియం ప్లాన్‌ - అపరిమిత ఫ్రీ డెలివెరీలు, డిస్కౌంట్‌లు, OTT ఆఫర్లు!
స్విగ్గీ కొత్త ప్రీమియం ప్లాన్‌ - అపరిమిత ఫ్రీ డెలివెరీలు, డిస్కౌంట్‌లు, OTT ఆఫర్లు!
Tiger Attack In Kakinada District: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
Embed widget