అన్వేషించండి

Meghasandesam Serial Today September 18th: ‘మేఘసందేశం’ సీరియల్‌: శారదకు దొరికిన కెమెరా – కెమెరా కోసం శరదతో రత్న గొడవ

Meghasandesam serial today episode September 18th: శోభాచంద్ర ను అపూర్వ  చంపిన వీడియోను శారద చూస్తుంది. అదే విషయం భూమికి ఫోన్‌ చేసి చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.    

Meghasandesam Serial Today Episode: కిచెన్‌లో ఉన్న రత్నం దగ్గరకు శారద వెళ్తుంది. భూమిని ఇంటికి తీసుకొచ్చిని ఆనందంలో నీ గురించే పట్టించుకోలేదు.. ఆరోజు అన్ని మాటలు అని మళ్లీ ఎందుకు వచ్చావే అంటూ నిలదీస్తుంది.

రత్న: ఒక్కోసారి మంచితనాన్ని చూసి కూడా ఓర్చుకోలేని కళ్లు ఉంటాయి అమ్మ. ఇంత మంచి తనాన్ని చూసిన నా కళ్లు ఆ క్షణంలో నా మనసులో ఉన్న కుళ్లును బయట పెట్టేశాయి. తప్పు అయిపోయింది అంటేను పూరి గారే ఇంటికి తీసుకొచ్చారు.

శారద: పూర్ణి.. మళ్లీ ఎందుకే దీన్ని ఇంటికి తీసుకొచ్చావు.

పూర్ణి: నువ్వు ఒక్కదానివే పని చేసుకోలేకపోతున్నావు కదమ్మా..? అందుకే తీసుకొచ్చాను.

శారద: నేను చేసుకోలేకపోతున్నాను అంటే నువ్వు సహాయం చేయాలి. అంతే కానీ ఎవరూ లేనట్టు దీన్ని ఎందుకు తీసుకొచ్చావు. చిన్నపిల్ల అదేదో తెలియక తీసుకొచ్చింది. నువ్వు నడు

పూర్ణి: అమ్మ వయసులో తను చిన్నదే కదా పైగా పిల్లలు ఉన్నారు. ఈ ఒక్కసారికి క్షమించకూడదు..

శారద: నువ్వు ఎంత బతిమిలాడినా వినేది లేదు.

అంటూ చెప్తుండగానే.. భూమి వస్తుంది. తాను ఆఫీసుకు వెళ్తున్నానని చెప్తుంది. దీంతో భూమితో మాట్లాడుతుంటే.. భూమికి మంచి జరగాలంటే ఈ దసరా నవరాత్రుల్లో భూమి గారితో అమ్మవారికి పూజ చేయించండి అని రత్న చెప్తుంది. దీంతో శారద ఇందుకోసమైనా నిన్ను ఇంట్లో ఉండనివ్వాలి అంటుంది. తర్వాత ఇంట్లో గగన్‌ రూంను సర్దుతూ ఉంటుంది శారద. ఇంతలో బట్టల కింద నుంచి కెమెరా కింద పడుతుంది. ఏంటి కెమెరా ఇక్కడ దాచిపెట్టాడు. ఇందులో ఏమైనా వీడియోలు ఉన్నాయా..? ఓపెన్ చేసి చూద్దాం అనుకుని కెమెరా ఆన్‌ చేస్తుంది శారద. అందులో అపూర్వ, శోభాచంద్రను చంపిన వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసిన శారద షాక్‌ అవుతుంది. వెంటనే భూమికి ఫోన్‌ చేస్తుంది. అకాడమీలో డాన్స్‌ నేర్పిస్తున్న భూమి కాల్‌ లిఫ్ట్‌ చేస్తుంది.

భూమి: చెప్పండి అత్తయ్యా ఈ టైంలో ఫోన్‌ చేశారు.

శారద: అమ్మా భూమి ఎక్కడున్నావు..

భూమి: అకాడమీలో ఉన్నాను అత్తయ్య.. పిల్లలకు డాన్స్‌ నేర్పిస్తున్నాను..

శారద: భూమి నీకు ఒక నిజం చెప్తాను.. గుండె నిబ్బరం చేసుకుని విను తల్లి..

భూమి: ఏంటత్తయ్యా అది.. చెప్పండి..

శారద: మీ అమ్మ ప్రమాదంలో చనిపోలేదమ్మా..?

భూమి: ఏంటి అత్తయ్యా మీరు చెప్పేది.. మా అమ్మ ప్రమాదంలో చనిపోలేదా..?

శారద: అవును భూమి.. మీ అమ్మను  ఆ అపూర్వనే చంపేసింది. దారుణంగా గొంతు పిసికి చంపేసింది.

భూమి: అత్తయ్యా ఏం చెప్తున్నారు.. అయినా ఇన్ని రోజులుకు మీరు ఈ విషయం ఎందుకు చెప్తున్నారు..

శారద: ఇప్పడే ఇంట్లో ఒక పాత కెమెరా దొరికింది భూమి. అందులో మీ అమ్మను ఆ అపూర్వ చంపడం ఉంది.

అంటూ చెప్పగానే.. భూమి ఏడుస్తూ అత్తయ్యా ఇప్పుడే నేను ఇంటికి వస్తున్నాను అంటూ కాల్‌ కట్‌ చేసి ఇంటికి బయలుదేరుతుంది. ఇంట్లో శారద వెనక నిలబడి అంతా వింటున్న  రత్నం దగ్గరకు వెళ్లి శారదను బెదిరిస్తుంది.

రత్న: అమ్మగారు ఆ కెమెరా నాకు ఇవ్వండి..

శారద: ఏయ్‌ రత్న ఏం మాట్లాడుతున్నావు.. నీకెందుకు ఈ కెమెరా..?

రత్న: అమ్మగారు మంచిగా మర్యాదగా అడుగుతున్నాను.. ఆ కెమెరా నాకు కావాలి..

శారద: ఏయ్‌ ఎవతివే నువ్వు.. ఆ అపూర్వ మనిషివా..?

రత్న: నేను ఎవరి మనిషినైతే నీకెందుకు ఆ కెమెరా ఇవ్వు..

అంటూ బెదిరిస్తూ అడగుతుంది రత్న. శారద కెమెరా ఇవ్వనని వెళ్లబోతుంటే రత్న బలవంతంగా లాక్కుంటుంది. శారద ఇవ్వనని రత్నను తోసేస్తుంది. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. ఇంతలో భూమి అత్తయ్యా అంటూ పిలుస్తూ  వస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today march 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజు ప్లాన్‌ అదుర్స్‌ - వంటమనిషిగా ఇందు
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజు ప్లాన్‌ అదుర్స్‌ - వంటమనిషిగా ఇందు
Podharillu Serial Today March 12th: భర్తతో పాటు వాళ్ల అన్నదమ్ములను మహా ఎలా కాపాడింది...? పెద్దిని పోలీసుస్టేషన్‌ నుంచి బయటకు ఎలా తీసుకొచ్చింది...?
పొదరిల్లు: భర్తతో పాటు వాళ్ల అన్నదమ్ములను మహా ఎలా కాపాడింది...? పెద్దిని పోలీసుస్టేషన్‌ నుంచి బయటకు ఎలా తీసుకొచ్చింది...?
Meghasandesam Serial Today march 12th:‘మేఘసందేశం’ సీరియల్‌: శివ కోసం గగన్‌ ఇంటికి వచ్చిన బిందు – షాక్‌లో భూమి
‘మేఘసందేశం’ సీరియల్‌: శివ కోసం గగన్‌ ఇంటికి వచ్చిన బిందు – షాక్‌లో భూమి
Nindu Noorella Saavasam Serial Today march 12th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లల కోసం ఫోన్‌ చేసిన అమర్‌ - అమ్ము కనిపించడం లేదన్న యాదమ్మ
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లల కోసం ఫోన్‌ చేసిన అమర్‌ - అమ్ము కనిపించడం లేదన్న యాదమ్మ

వీడియోలు

Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Harish Shankar: హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
Affordable Mileage Bikes: హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Viral Girl Love Jihad Controversy: వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
Lok Sabha Rahul Gandhi: భారత సార్వభౌమత్యాన్ని అమెరికాకు లొంగిపోయేలా చేశారు - లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు
భారత సార్వభౌమత్యాన్ని అమెరికాకు లొంగిపోయేలా చేశారు - లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు
Embed widget