అన్వేషించండి

Meghasandesam Serial Today October 20th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి నాటకం ఆడుతుందన్న అపూర్వ – శారదకు జరిగిన అవమానం గగన్‌ కు చెప్పబోయిన ప్రసాద్‌   

Meghasandesam Today Episode: భూమి లోపలికి శోభ రాలేదని అపూర్వ చెబితే శరత్‌ చంద్ర నమ్మకపోగా అపూర్వను తిట్టి ఇంకోసారి ఆ మాట అనొద్దని వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Meghasandesam Serial Today Episode:  కింద పడిపోయిన భూమిని తీసుకుని రూంలోకి వెళ్తుంది మీరా. లోపలికి వెళ్తున్న భూమి.. అపూర్వను వెటకారంగా చూస్తుంది. భూమి వచ్చి తనను కొట్టిన విషయం గుర్తు చేసుకుంటుంది అపూర్వ. శరత్‌చంద్ర మాత్రం శోభాచంద్రను చూస్తుంటాడు. రూంలోకి వెళ్లిన మీరా ఏడుస్తూ వదినా అంటూ భూమిని హగ్‌ చేసుకుంటుంది.

మీరా: మా వదిన నీ వంట్లోకి వచ్చి నా కాపురం నిలబెట్టింది.

భూమి: నా ఒంట్లోకి రావడం ఏంటి?

మీరా: అవును మా వదిన వచ్చింది. ఆయన లేకపోయినా పర్వాలేదు. పెళ్లి చేసేద్దాం అని మా అపూర్వ వదిన నీ ఒంట్లోకి వచ్చింది. అప్పటికీ అపూర్వ వదిన ఏదేదో మాట్లాడుతుంటే చెంప పగులగొట్టింది.

భూమి: ఏంటి కొట్టిందా?

మీరా: అంటే నీ ద్వారా కొట్టింది.

భూమి: నా ద్వారానా..

మీరా: నీకు తెలియదులే నీ ఒంట్లో మా వదిన ఉంది కాబట్టి నీకెలా తెలుస్తుంది.

భూమి: అవును నాకెలా తెలుస్తుంది. నాకేం తెలియదు.

మీరా: ఇంట్లో ఇంత మంది ఉండగా మా వదిన నీ ఒంట్లోకే వచ్చిందంటే నువ్వుంటే ఎంత ఇష్టమో కదా. నువ్వే కాదు నేనంటే కూడా అంత ఇష్టం. అందుకే నీ ద్వారా నా కాపురాన్ని కూడా నిలబెట్టింది.  

భూమి: మీరేం భయపడకండి ఆంటీ అంకుల్‌ వస్తారు. మీ ఇద్దరి చేతుల మీదుగానే ఇందు పెళ్లి జరగుతుంది.

మీరా: అయినా నువ్వేం చేస్తావు. నీ మాట అపూర్వ వదిన అసలు వినదు కదా.

భూమి: వినకపోతే చెంప పగులుతుంది.

మీరా: ఏంటి నువ్వు కొడతావా?

భూమి: కాదు నేను కాదు. అమ్మ మళ్లీ నా ఒంట్లోకి రావొచ్చు..ఇవాళ కొట్టినట్టే మళ్లీ కొడుతుంది.

అని భూమి చెప్పగానే మీరా అవును నిజమే కదా? అంటూ నాకు ఇంత సాయం చేసిన ఆ వదినకు ఒక ముద్దు పెట్టాలి అని భూమిని ముద్దు పెట్టుకుని వెళ్లిపోతుంది. మరోవైపు భూమి కొట్టిందని బాధపడుతున్న అపూర్వ దగ్గరకు శరత్‌చంద్ర వస్తాడు.

శరత్‌: అపూర్వ ఎంటి అలా ఉన్నావు..?

అపూర్వ: ఎలా ఉన్నావని అడుగుతావేంటి? బావ. భూమి నన్ను కొట్టింది. నా బావ ముందు. నా నట్టింట్లో..

శరత్‌: కొట్టింది భూమి కాదు శోభ. అవును నా శోభ ఈ ఇంటి పరువు పోవడం ఇష్టం లేకే కొట్టింది.

అపూర్వ: అయ్యో అది నాటకాలు ఆడటమేంటి? బావ. అది అందరి ముందు నన్ను కొట్టి నా పరువు తీసింది.

శరత్‌: లేదు శోభ వచ్చింది. శోభ కొట్టింది. అపూర్వ శోభ రాలేదని మాత్రం అనకు నాకు బాధగా ఉంది.

అపూర్వ: అంత నమ్మకం ఏంటి బావా నీకు..

శరత్‌: నన్ను చంద్రా అని పిలిచేది. ఆ విషయం నీకు తెలుసు కదా? అందుకే భూమి ఒంట్లోకి శోభ వచ్చిందని నేను నమ్ముతున్నాను.

 అని చెప్పగానే అపూర్వ బాధపడుతుంది. ఇన్ని తెలుసుకున్న దానికి ఆ విషయం తెలుసుకోవడం పెద్దవిషయం కాదు అనుకుంటుంది. ఇదంతా భూమి ఆడుతున్న నాటకం అని అపూర్వ అంటే అపూర్వను తిట్టి వెల్లిపోతాడు శరత్‌ చంద్ర. మరోవైపు చెర్రి ప్రసాద్‌ కోసం వెతుకుతుంటాడు. శారదకు ఫోన్‌ చేసి ఏం జరిగిందని అడుగుతాడు. గుడిలో జరిగిన విషయం చెప్తుంది శారద. దీంతో చెర్రి కోప్పడతాడు. అన్నయ్యకు తెలిస్తే దాన్ని చంపేస్తాడని అంటాడు. గగన్‌కు చెప్పొద్దని శారద చెప్తుంది. తర్వాత ప్రసాద్‌ ఫుల్లుగా తాగి గగన్‌ కారుకు ఎదురు వెళ్లి కింద పడిపోతాడు. గగన్‌ వచ్చి ప్రసాద్‌ను పైకి లేపుతాడు.

ప్రసాద్‌: హలో నా కొడుకులా ఉన్నావు.. కాదులే నా కొడుకైతే కారు ఎక్కించి అవతలికి పోయి ఉన్నాన్నా పోయానా అని చూస్తాడు. వాడికి నేనంటే అంత కోపం అయినా కొడుక్కి ప్రేమ ఉండాలి కానీ కోపం ఎందుకు అనుకుంటున్నావా? బాబు వాడు మంచోడే.. అంతా నా తలరాత.

 అంటూ తాగిన మైకంలో శారదకు గుడిలో  జరిగిన అవమానం గురించి చెప్పబోతుంటే చెర్రి వస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! 

 

టాప్ హెడ్ లైన్స్

Abhishek Yannam: 'ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
Jaya Chiravuri: యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget