అన్వేషించండి

Meghasandesam Serial Today October 14th: ‘మేఘసందేశం’ సీరియల్‌: పోలీస్‌ కస్టడీలో కేపీ - కేపీని చూసి షాకైన భూమి   

Meghasandesam serial today episode October 14th: పోలీస్‌ కస్టడీలో ఉన్న కేపీని చూస్తుంది భూమి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: భూమికి ఏసీపీ సూర్య ఫోన్‌ చేస్తాడు. రూంలో ఉన్న భూమి ఏసీపీ ఫోన్‌ చూసి ఇప్పుడు చేస్తున్నారేంటి..? ఏదైనా క్లూ దొరికిందా..? అనుకుంటూ ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తుంది భూమి.

భూమి: నమస్తే ఎసీపీ గారు..? ఏంటి ఈ టైంలో కాల్‌ చేశారు. మీ అన్నయ్య మర్డర్‌ కేసులో ఏదైనా సాక్ష్యం దొరికిందా..? చెప్పండి

సూర్య: అదే కాదండి.. మా అన్నయ్యను మర్డర్‌ చేయించిన వాళ్లు.. మీ అమ్మను మర్డర్‌ చేసిన వాళ్లు ఒక్కరే వాళ్లను పట్టుకున్నాము. ఒక ప్లాన్‌ ప్రకారం స్కేచ్‌ వేసి పట్టుకున్నాము. మీరు వెంటనే వస్తే చూడొచ్చు.. మేము ఇంటరాగేషన్‌ చేస్తున్నాము. మర్డర్‌ చేశానని ఒప్పుకోవడం లేదు. తెల్లారేసరికి ఎలాగైనా నిజం ఒప్పిస్తాము..

భూమి: థాంక్యూ సార్‌ చాలా మంచి న్యూస్‌ చెప్పారు. నేను ఇప్పుడే ఆ మర్డర్‌ చేసిన వ్యక్తిని చూడాలి. నేను ఇప్పుడే వస్తున్నాను.. మీరు ఎక్కడున్నారో లోకేషన్‌ షేర్‌ చేయండి సార్‌.

సూర్య: ఆ భూమి గారు మీకు లోకేషన్‌ షేర్‌ చేస్తాను. కానీ ఈ విషయం ఎవ్వరికీ  చెప్పొద్దు.. అలాగే లోకేషన్‌ కూడా ఎవ్వరికీ షేర్‌ చేయ్యోద్దు. చాలా కాన్పిడెంన్షియల్‌ మ్యాటర్‌.. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.

భూమి: అయ్యో సార్‌ నేనెందుకు చెప్తానండి.. అసలు ఎవ్వరికీ చెప్పను ఇంకా  చెప్పాలంటే.. మా ఇంట్లో వాళ్లకు కనీసం మా బావకు కూడా చెప్పకుండా వస్తాను. మీరేం వర్రీ కావొద్దు సార్‌..

సూర్య: ఓకే మీకు ఇప్పుడే లోకేషన్‌ షేర్‌ చేస్తున్నాను

అని సూర్య చెప్పగానే.. సరే అంటూ భూమి బయలుదేరుతుంది. ఇంతలో శారద వస్తుంది. భూమి బయటకు వెళ్లడం చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. దీంతో భూమి శారదకు నిజం చెప్పకూడదని ఏదో అబద్దం చెప్తుంది. అయితే భూమిలో కంగారు చూసిన శారద అనుమానిస్తుంది.

శారద: భూమి నేను నీ అత్తయ్యను ఎందుకు కంగారు పడుతున్నావు. అయినా నువ్వేదో టెన్షన్‌లో ఉన్నావని అర్థం అవుతుంది. ఏంటో చెప్పమ్మా..?

భూమి: ఏం లేదు అత్తయ్యా.. చిన్న పని ఉంది డాన్స్‌ స్కూల్‌ దాకా వెళ్లొస్తాను.. అంతే..

శారద: డాన్స్‌ స్కూల్‌ లేదని గగన్‌ చెప్పాడు. ఇవాళ హాలిడే అన్నాడు కదమ్మా.. నువ్వేదో దాస్తున్నావు నిజం చెప్పు భూమి..

భూమి: అత్తయ్య అదేం లేదు.. నేను చెప్తున్నాను కదా..? వెళ్లొచ్చాక అంతా చెప్తాను. ఇప్పుడు నన్నేమీ అడగొద్దు అత్తయ్యా

అంటూ భూమి చెప్పగానే.. సరే భూమి కానీ జాగ్రత్త అంటూ శారద చెప్పగానే.. భూమి పరుగు పరుగున సూర్య దగ్గరకు వెళ్లిపోతుంది. స్టేషన్‌లోకి వెళ్లి సూర్య గురించి అడగ్గానే కానిస్టేబుల్‌ సెల్‌లో ఉన్న సూర్య దగ్గరకు తీసుకెళ్తుంది. భూమిని చూసిన సూర్య కోపంగా మాట్లాడతాడు.

సూర్య: మా అన్నయ్యను మీ అమ్మను చంపిన క్రిమినల్‌ ఎవరో తెలుసా..? ఇదిగో వీడే..

అంటూ సూర్య కోపంగా కుర్చిలో కట్టేసిన కేపీని తల పైకెత్తి చూపిస్తాడు. కేపీని చూడగానే భూమి షాక్ అవుతుంది. ఒళ్లంతా దెబ్బలతో కేపీ మూలుగుతుంటాడు.  భూమి ఏడుస్తూ కేపీ కాళ్ల దగ్గర కూర్చుంటుంది.

భూమి: మిమ్మల్ని నేను ఇలా చూడలేకపోతున్నాను. నేను ఏదో ఒకటి చేసి నేను మిమ్మల్ని విడిపించుకుంటాను. విడిపించుకుంటాను.

అంటూ భూమి ఏడుస్తూ చెప్తుంది. కేపీ కూడా ఏడుస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Today July 6th: 'గోదావరి' సీరియల్: నందు పెళ్లి క్యాన్సిల్! కాళ్లు పట్టుకున్న మురళీ! సూర్యకి ప్రపోజ్ చేసిన జాను!
'గోదావరి' సీరియల్: నందు పెళ్లి క్యాన్సిల్! కాళ్లు పట్టుకున్న మురళీ! సూర్యకి ప్రపోజ్ చేసిన జాను!
Godavari Serial Today July 6th: 'గోదావరి' సీరియల్: ప్రేరణ తాళి తెంపేసిన ఈశ్వరి! ఆ పని చేసే మళ్లీ పెళ్లి చేసుకుంటామని సిద్ధూ, ప్రేరణ ఛాలెంజ్!
'గోదావరి' సీరియల్: ప్రేరణ తాళి తెంపేసిన ఈశ్వరి! ఆ పని చేసే మళ్లీ పెళ్లి చేసుకుంటామని సిద్ధూ, ప్రేరణ ఛాలెంజ్!
Karthika Deepam 2 Serial Today July 6th: కార్తీకదీపం 2 సీరియల్: దక్షిణామూర్తికి సూరజ్‌కి నిజంగా సంబంధం ఉందా! పెద్దాయన సూరజ్‌ని కొట్టడానికి కారణం అదేనా!
కార్తీకదీపం 2 సీరియల్: దక్షిణామూర్తికి సూరజ్‌కి నిజంగా సంబంధం ఉందా! పెద్దాయన సూరజ్‌ని కొట్టడానికి కారణం అదేనా!
Nuvvu leka Neanu Lenu Serial Today July 6th:రామచంద్రానికి రక్తం ఇవ్వడానికి వచ్చిన రాధ... రాధను గదిలో పెట్టి తాళం వేయించిన దమయంతి...
నువ్వులేక నేను లేను: రామచంద్రానికి రక్తం ఇవ్వడానికి వచ్చిన రాధ... రాధను గదిలో పెట్టి తాళం వేయించిన దమయంతి...

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
This Week Theatrical Releases : లెనిన్ To ఐ నొబడీ - ఈ వారం మాస్ యాక్షన్ మైథలాజికల్ మూవీస్... డోంట్ మిస్
లెనిన్ To ఐ నొబడీ - ఈ వారం మాస్ యాక్షన్ మైథలాజికల్ మూవీస్... డోంట్ మిస్
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Best Cars for Daily Commute:రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారికి ఈ 5 కార్లు బెస్ట్.. ఇందులో మీ కారు ఉందా ? లిస్ట్ చూశారా
రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారికి ఈ 5 కార్లు బెస్ట్.. ఇందులో మీ కారు ఉందా ? లిస్ట్ చూశారా
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Embed widget