అన్వేషించండి

Meghasandesam Serial Today November 6th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  హాస్పిటల్‌లో రౌడీని చూసిన భూమి – గగన్‌కు నిజం చెప్పిన రౌడీ

Meghasandesam serial today episode November 6th: శారద మీద హత్యాయత్నం చేసిన రౌడీని గగన్‌ పట్టుకుని కొడతాడు. దీంతో అపూర్వే మీ అమ్మను చంపమంది అని నిజం చెప్తాడు రౌడీ

Meghasandesam Serial Today Episode: కేపీ కేసులో భూమి అనుమానిస్తుందని ఎస్పీ సూర్య వచ్చి శరత్‌చంద్ర, అపూర్వకు చెప్తాడు. దీంతో శరత్‌, అపూర్వ షాక్‌ అవుతారు. భూమికి ఈ విషయాలు ఎలా తెలిశాయని అడుగుతుంది అపూర్వ.

సూర్య: నాకు అర్థం కావడం లేదు మేడం.. ఆ స్పాట్‌లో ఉన్నది కేవలం మీ ఇద్దరే..? మీరే కేపీని కాల్చి చంపారని స్పాట్‌లోనే భూమి చూసి ఉంటే.. కేపీ డెడ్‌బాడీ ఇంటికి రాకముందే.. నా పై ఆఫీసర్‌కు కంప్లైంట్‌ ఇచ్చి నానా హంగామా చేసేది. అలా చేయలేదు అంటే తను చూడలేదు అని అర్థం. ఎలా తెలిసింది అని అడిగితే ఎస్పీగా మీరే తెలుసుకోండి అని నాకే చాలెంజ్‌ విసిరింది. తను మాట్లాడే కాన్ఫిడెంట్‌ చూస్తుంటే.. బుల్లెట్‌ తగిలే కేపీ చనిపోయాడన్న పక్కా ఇన్మఫర్మేషన్‌ తన దగ్గర ఉంది. కేపీ బుల్లెట్‌ తగిలి చనిపోయాడని తను నాకు కంప్లైంట్‌ ఇచ్చి ఉంటే నేను ఈ కేసు తొక్కేసే వాడిని.. కానీ గగన్‌ సపోర్ట్‌ తీసుకుని నా పై ఆఫీసర్లను కలుస్తుందేమోనని నాకు అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి.. ఇది చెబుదామనే వచ్చాను..

అపూర్వ: ఓకే ఎస్పీ గారు మా జాగ్రత్తలో మేము ఉంటాము.. కానీ ఎస్పీ గారు భూమి మీద మీరు కూడా ఒక కన్నేసి ఉంచండి. తన గురించి ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూ ఉండండి..

సూర్య: ఓకే.. చెప్తాను.. ఇక నేను వస్తాను..

అంటూ సూర్య వెళ్లిపోతాడు. శరత్‌ చంద్ర బాధపడుతుంటాడు.

శరత్: వద్దు అపూర్వ ఇక ఈ దొంగ పోలీస్‌ ఆట నేను ఆడలేను.. నేనే కేపీని చంపానని నా శత్రువును పెళ్లి చేసుకున్న ఆ భూమి నిరూపిస్తే అంతకంటే అవమానం నాకు ఉండదు.. అంతటి అవమానం కోసం క్షణాలు లెక్కపెడుతూ నేను ఎదురుచూడలేను. కేపీ చంపింది నేనే అంటూ పోలీసులకు లొంగిపోతాను.

అపూర్వ: పిచ్చి పట్టిన వాడిలా మాట్లాడకు బావ. నువ్వు లొంగిపోతే నీ వెనక నన్ను.. ఆ తర్వాత మనకు సాయం చేసిన ఎస్పీ గారిని కేసులోకి లాగుతారు.

శరత్‌: లేదు నేను మీ దాకా రానివ్వను.. నేను అప్రూవర్‌గా లొంగిపోయి మీకేం తెలియదని చెప్తాను.

అపూర్వ: ఎమోషన్‌లో విచక్షణ కోల్పోతున్నావు బావ. చిన్న అనుమానం వచ్చినా చాలు చివరి వేరు వరకు అది తవ్వుకుంటూ పోతుంది. బావ నువ్వు ఎక్కడుంటే అక్కడికి నేను రావడానికి సిద్దం బావ. కానీ మనకు హెల్ప్‌ చేసిన పాపానికి ఆ ఎస్పీని ఎందుకు లాగాలని చూస్తున్నావు..

శరత్‌: అపూర్వ దీని అంతిమ ఫలితం నువ్వు ఊహించలేకపోతున్నావు.. కేపీని చంపి మనం తప్పు చేశాం. మన తప్పును దాచి ఎస్పీ గారు తప్పు చేశారు. ఎదో ఒక రోజు మనం అందరం ఇరుక్కుపోవాల్సిందే.. అది కూడా మన శత్రువు భార్య అయిన భూమి వలన. అంతకంటే ముందు నేను లొంగిపోవడమే బెటర్‌ అని చెప్తున్నాను..

అపూర్వ: బావ నేను చెప్పేది ఒకసారి విను.. నేను ఉండగా.. ఆ భూమి నిన్ను టచ్‌ చేయలేదు.. ఫ్లీజ్‌ బావ నా మీద వేసిన ఒట్టు నిలబెట్టుకో..? నీకేం కాకుండా నేను నిలబడతాను..

శరత్‌: సరే అపూర్వ. నీ మీద నమ్మకంతో నేను ఎక్కడా నోరు జారను.. కానీ కేపీ బుల్లెట్‌ తగిలి చనిపోయాడని భూమికి ఎలా తెలిసింది.

అపూర్వ: ఈ ప్రశ్న ఇప్పుడే కదా మనకు ఎదురైంది.. నేను ఎలాగైనా కనుక్కుంటాను..కాఫీ పంపిస్తాను ఉండు బావ

అంటూ అపూర్వ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు హాస్పిటల్‌లో ఉన్న భూమి శారద మీద ఇంటికి వచ్చి అటాక్‌ చేసిన రౌడీని చూస్తుంది. వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. వాడు తప్పించుకుని పారిపోతుంటాడు.. భూమి వెనకాలే పరుగెడుతుంది. ఇంతలో గగన్‌ కారులో వస్తాడు. గగన్‌కు విషయం చెప్పగానే.. ఇద్దరూ కారులో వెళ్లి రౌడీని పట్టుకుంటారు. గగన్‌ రౌడీని కొట్టి ఎందుకు మా అమ్మను చంపాలనుకున్నావు అంటూ అడగ్గానే.. అపూర్వ చంపమంది అని చెప్తాడు. దీంతో గగన్‌ షాక్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
Godavari Serial Today August 5th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 5th:వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
నువ్వులేక నేను లేను: వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget