అన్వేషించండి

Meghasandesam Serial Today November 5th: ‘మేఘసందేశం’ సీరియల్‌:   గగన్‌ ను చంపేస్తానని చాలెంజ్‌ చేసిన శరత్‌ చంద్ర – శారదకు నిజం చెప్పిన భూమి

Meghasandesam Today Episode:   అపూర్వ రెచ్చగొట్టడంతో గగన్‌ ను చంపేస్తానని శరత్‌ చంద్ర కోపంగా హాస్పిటల్‌ నుంచి వెళ్లిపోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode:   ఎవడో వచ్చి ఇందు పెళ్లి చెడగొట్టి పోయాడని చెర్రి చెప్పగానే తనకు ఎవరో కాల్ చేసి ఎవరో చెప్పారని అది ఎవరిదో తెలుసుకుంటే ఆ పెళ్లి చెడగొట్టిన వాణ్ని పట్టుకోవచ్చని గగన్‌ చెర్రికి చెప్పి తనకు తెలిసిన పోలీసుకు ఫోన్‌ చేసి రమ్మంటాడు. గగన్‌ దగ్గరకు వచ్చిన పోలీసు వివరాలు తీసుకుని నేను కనుక్కుని వెంటనే నీకు చెప్తానని వెళ్లిపోతాడు. మరోవైపు భూమి ఏడుస్తూ ఇంటికి వస్తుంది.

పూరి: అమ్మా భూమి..

శారద: ఏమ్మా భూమి ఒకప్పుడు ఆ ఇంటికి వెళ్లాలి అంటేనే భయపడేదానివి ఇప్పుడు మన ఇంట్లో ఉండటం కంటే ఆ ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నావు. భూమి ఏమైంది.. ఆ కన్నీళ్లు ఏంటి.. ఏమైంది భూమి.

భూమి: ఇందు పెళ్లి ఆగిపోయింది ఆంటీ.

శారద: శుభమా అని పెళ్లి జరుగుతుంది అనుకుంటే ఆగిపోవడం ఏంటమ్మా..?

భూమి: ఆగిపోయింది ఆంటీ.. ఎవడో వచ్చి..

అంటూ భూమి జరిగింది మొత్తం చెప్తుంది.

శారద: ఎవడమ్మా వాడు.. గడప దాటి బయటకు కూడా రాని పిల్ల మీద అన్ని అబాండాలు వేశాడా..? వాడి మాటలు నమ్మి పెళ్లి వాళ్లు ఎలా వెళ్లిపోతారు.

భూమి: పెళ్లి ఆగిపోయిందని వాళ్లు బాధపడ్డం కన్నా ఆ పెళ్లిని గగన్ గారే చెడగొట్టారని అతన్ని గగన్‌ గారే పంపించారని అందరూ ఆయన్ని తిడుతున్నారు ఆంటీ. మీరా ఆంటీ అయితే శాపనార్థాలు పెట్టాడు.

శారద: పెళ్లి ఆగిపోవడానికి గగన్‌ కు సంబంధం ఏంటి అమ్మా వాడు ఆఫీసుకు వెళ్లాడు కదా..?

భూమి: లేదు ఆంటీ గగన్‌ అక్కడికి వచ్చాడు. ఆయనతో పాటు వాడు వచ్చాడని వీడియోలో క్లియర్‌ గా కనిపిస్తుంది. ఆయనతో వచ్చాడు కాబట్టి ఆయనే ఈ పెళ్లి ఆపడానికి అతన్ని పంపించాడని అందరూ అనుకుంటున్నారు.

శారద: అయ్యో ఓరి భగవంతుడా..? అసలు పెళ్లి జరగడమే ఆ పెళ్లికి ఎందుకు వచ్చాడు. నా బిడ్డ మీద ఈ నిందలు ఏంటి..?

 అంటూ ఏడుస్తూ శారద కుప్పకూలిపోతుంది. భూమి వచ్చి శారదను ఓదారుస్తుంది. ఇంతలో ఇద్దరూ కలిసి ఏడుస్తుంటారు. మరోవైపు హాస్పిటల్‌ లో ఇందుకు డాక్టర్లు ట్రీట్ మెంట్‌ చేస్తుంటారు. బయట అందరూ కూర్చుని ఏడుస్తుంటారు.  

అపూర్వ: పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన మన ఇందును హాస్పిటల్ పాలు చేసింది ఆ గగన్‌ గాడే. పచ్చని పందిట్లోకి వాణ్ని ఎవడినో పంపించి ఇందు ఇలా చచ్చి బతికేలా చేసింది వాడే.

మీరా: ఆ గగన్‌ కు నేను ఏం ద్రోహం చేశానండి. నా బిడ్డేం చేసింది.

అపూర్వ: వాడు మన ఇంటికి వచ్చి నన్ను చంపాలని చూశాడు. పెళ్లి పందిట్లోకి వచ్చి మన పరువు తీయాలని చూశాడు. మన ఇంటి ఆడపిల్ల ప్రాణం తీయాలని చూశాడు. వాడు ఎన్ని చేసినా చేతకాని వారిలా ఉండాల్సిందేనా..?

శరత్: అంత చేతకాని వాళ్లు ఎవరూ లేరు అపూర్వ.

అపూర్వ: మనం ఏం చేయగలం బావ ఏడవడం తప్పా..

శరత్‌: తప్పు చేశాను. వాడు మన ఇంటికి వచ్చి నిన్ను చంపాలని చూసినప్పుడే వాణ్ని చంపేయాల్సింది. చంపేస్తాను.

  అని శరత్‌ చంద్ర వెళ్లబోతుంతో ప్రసాద్‌ ఆపాలని చూస్తాడు. వినకుండా వెళ్లిపోతాడు శరత్‌చంద్ర. ఆయన వెనకాలే ప్రసాద్‌ వెళ్లిపోతాడు. ఇంటికి డల్లుగా వచ్చిన గగన్‌ చూసి శారద ఏడుస్తూ.. ఇందు పెళ్లి ఆగిపోయిందట. దానికి నువ్వు కారణం అంటున్నారట అసలు ఏం జరిగింది వాడు నీకెలా పరిచయం నీతో వాడు ఎందుకు వచ్చాడు అని అడుగుతుంది. దీంతో గగన్‌ నాకేం తెలియదని జరిగిన విషయం చెప్తాడు గగన్‌. ఇంతలో అపూర్వ ఫోన్‌ చేసి భూమితో మాట్లాడాలి రమ్మని పిలుస్తుంది.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 6th: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
జగద్ధాత్రి సీరియల్: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
Godavari Serial Today August 6th: 'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget