అన్వేషించండి

Meghasandesam Serial Today November 2nd: ‘మేఘసందేశం’ సీరియల్‌:  గగన్‌ను గల్లా పట్టి మండపంలోంచి తోసేసిన శరత్ -  మళ్లీ కొత్త ప్లాన్‌ వేసిన అపూర్వ

Meghasandesam Today Episode:  పెళ్లి మండపానికి వచ్చిన గగన్‌ను గల్లా పట్టి బయటకు లాక్కెళతాడు శరత్‌చంద్ర. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode:  ఇందు పెళ్లిలో అందరూ హడావిడిగా ఉంటారు. భూమి అందరికీ డ్రింక్స్‌ ఇస్తుంది. ఇంతలో భూమిని చూసిన అపూర్వ సెట్‌ చేసిన రౌడీ.. వచ్చి సాయంత్రం నాతో కలిసి బయటకు వస్తావా..? అంటూ అడుగుతాడు. దీంతో భూమి వాడిని తిడుతూ.. డ్రింక్‌ తీసి వాడి మీద పోయబోతుంటే ఇంతలో గగన్‌ వస్తాడు. డ్రింక్‌ గగన్‌ మీద పడుతుంది. రౌడీ తప్పించుకుని పోతాడు. అంతా చూసిన శరత్‌చంద్ర, అపూర్వ అందరూ వస్తారు.

శరత్‌: మంచి పని చేశావు. పిలవని పేరంటానికి వస్తే ఎలాంటి మర్యాద దక్కుతుందో వాడికి అర్థం అయ్యేలా చేశావు. ఆ రోజు చెంప పగులగొట్టావు. ఈరోజు ముఖం మీద నీళ్లు కొట్టావు. ఏరా నీకు అసలు సిగ్గు అనేదే లేదా.. ఏ ముఖం పెట్టుకుని వచ్చావురా..? నేను ఇంట్లో లేనప్పుడు చూసి వచ్చి గొడవ చేవావంటా..? అపూర్వను చంపేస్తాననన్నావట. నువ్వు చేసిన పనికి నిన్ను ఇక్కడే చంపేయాలని ఉంది. కానీ పచ్చని పెళ్లి మండపంలో గొడవ చేయకూడదనే నిన్ను వదిలేస్తున్నాను. పోరా బయటకు.

బామ్మ: నువ్వు రావడం వల్ల అవమాన పడటం తప్పా ఏమీ ఉండదని తెలిసి ఎందుక వచ్చావయ్యా..?

శరత్: అవమానాలకు అలవాటు పడపోయిన బతుకులు వాళ్లవి. అరేయ్‌ నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకే నచ్చని బతుకురా నీది. భూమి నీ ముఖం పగులగొట్టింది అంటే ఏం బతుకురా నీది. ఇంకా ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నావురా..?

గగన్‌: చూడండి.. ఈ పెళ్లి చూడటానికి రాలేదు నేను. మీతో ఒక విషయం చెప్పి వెల్లిపోదామని వచ్చాను . సాయం చేయడానికే వచ్చిన మనిషిని అగౌరవ పరచడమే మీ సంస్కారమా..?

అపూర్వ: ఏంటి సాయం చేద్దామని వచ్చావా..? నువ్వు మాకు. విన్నావా..? బావ వీడు మనకు సాయం చేస్తాడట. ఏంటి నువ్వు చేసే సాయం. ఏదో ఒక గొడవ చేసి ఈ పెళ్లి ఆపడమా..?

గగన్‌: పెళ్లి ఆపాల్సిన అవసరం నాకేంటి..?

అపూర్వ: మరి ఎందుకు వచ్చావు. ఈ భూమి నీ చెంప పగులగొట్టినా ఎందుకు వచ్చావు.

బామ్మ: పెళ్లి ఎందుకు ఆపుతాడు అమ్మా.. ఇందు వాడికి కూడా చెల్లెలు కాదా..?

అపూర్వ: బావా సందేహమే లేదు. వీడు పెళ్లి ఆపడానికే వచ్చాడు.

గగన్‌: నేను ఆపడం కాదు. ఈ పెళ్లిని ఎవరో ఆపాలని చూస్తున్నారు.

అపూర్వ: చూశావా.. బావ.. ఎవరో ఆ పెళ్లి ఆపుతారట. వీడే ఆపాలని వచ్చాడు.

శరత్‌: నీ మాటలు నమ్మే పిచ్చి జనం ఎవరూ లేరిక్కడ పోరా బయటకు

అని శరత్‌చంద్ర కోపంగా గగన్‌ గల్లా పట్టుకుని బయటకు లాక్కెళతాడు. వద్దని భూమి వెనకాలే వస్తుంది. గగన్‌ బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. భూమి ఏడుస్తుంది. ప్రసాద్, చెర్రి బాధగా చూస్తుండి పోతారు.

సుజాత: అదేంటి అపూర్వ ఆ అబ్బాయిని పంపించేస్తే నీ ప్లాన్‌ చెడిపోదు.

అపూర్వ: వాడు ఎవరి కంట పడాలో వాళ్ల కంట పడ్డాడు పిన్ని. ఇక వాడితో అవసరం లేదు. మన ప్లాన్‌ ఇప్పుడు ఇంకా ఫర్ఫెక్టుగా అమలవుతుంది.

సుజాత: అవుతుంది అంటావా..?

అపూర్వ: అవుతుంది. ఎందుకంటే ఇది మాయ.. అపూర్వ మాయ. ఆ మయాలో పడి ఎవరైనా అడ్రస్‌ లేకుండా పోవాల్సిందే.

అని అపూర్వ చెప్పగానే సుజాత నవ్వుతుంది. మరోవైపు గగన్‌ దగ్గరకు వెళ్లిన భూమి మీరెందుకు ఇక్కడకు వచ్చారు అని అడుగుతుంది. మీరు ఇక్కడికి వచ్చారంటే ఏదో జరుగుతుంది. అని అడుగుతుంది. దీంతో గగన్‌ కోపంగా వెళ్లిపోతాడు.  మళ్లీ అపూర్వ.. గొంతు మార్చి గగన్‌కు ఫోన్‌ చేసి పెళ్లి ఆగిపోతుందని చెప్తుంది. మంటపంలో ప్రసాద్‌, మీరా ఇద్దరూ కలిసి వంశీకి కాళ్లు కడుగుతారు. కాళ్లు కడిగిన తర్వాత ప్రసాద్‌ ఎమోషనల్‌ అవుతాడు. తర్వాత గగన్‌, చెర్రికి ఫోన్‌ చేసి తనకు ఎవరో ఫోన్‌ చేసి పెళ్లి ఆగిపోతుందని చెప్పారు. ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు కానీ ఈ పెళ్లి ఆగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పి ఫోన్‌ కట్‌ చేస్తాడు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి దొరికిన లక్ష్మీ రింగ్‌! క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ కోసం మారువేషంలో లక్ష్మీ, హర్ష, క్రిష్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారికి దొరికిన లక్ష్మీ రింగ్‌! క్యాటరింగ్ కాంట్రాక్ట్‌ కోసం మారువేషంలో లక్ష్మీ, హర్ష, క్రిష్!
Godavari Serial Today July 13th: 'గోదావరి' సీరియల్: మురళీని పెళ్లి చేసుకోకపోతే చస్తాం నందు! పెళ్లి మండపంలో హైడ్రామా!
'గోదావరి' సీరియల్: మురళీని పెళ్లి చేసుకోకపోతే చస్తాం నందు! పెళ్లి మండపంలో హైడ్రామా!
Nindu Manasulu Serial Today July 13th: నిండు మనసులు: గణ జీవితంలో మర్చిపోలేని రోజు ఇదే..! పక్కా సాక్ష్యాలతో నిజం నిరూపించేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ జీవితంలో మర్చిపోలేని రోజు ఇదే..! పక్కా సాక్ష్యాలతో నిజం నిరూపించేసిన ప్రేరణ, సిద్ధూ!
Podarillu Serial Today July 13th:కేశవ్‌కు బ్రేకప్‌ చెప్పేసిన శైలూ...విడాకులు కోసం చక్రికి ఫోన్ చేసిన లాయర్‌
పొదరిల్లు: కేశవ్‌కు బ్రేకప్‌ చెప్పేసిన శైలూ...విడాకులు కోసం చక్రికి ఫోన్ చేసిన లాయర్‌

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ సంచలన ఆరోపణలు
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ ఆరోపణలు
187km రేంజ్‌తో కొత్త Vida VX2 Plus లాంచ్‌ - ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఆన్‌రోడ్ ధర వివరాలు ఇవే!
సింగిల్‌ ఛార్జ్‌తో దాదాపు 190km జర్నీ- భారీ బ్యాటరీతో Vida VX2 Plus లాంచ్‌, తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Embed widget