అన్వేషించండి

Meghasandesam Serial Today May 8th: ‘మేఘసందేశం’ సీరియల్‌: శారదకు వార్నింగ్‌ ఇచ్చిన తార – తారను మెచ్చుకున్న పూరి

Meghasandesam serial today episode May 8th: భూమి విషయంలో తార కోపంగా శారదకు వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode: మేఘసందేశం సీరియల్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. పెళ్లి కాకముందే తార శారదకు వార్నింగ్‌ ఇస్తుంది.  శారద ఇంట్లో దేవుడి ముందు నిలబడి మొక్కుతూ ఉంటే.. అప్పుడే ఇంట్లోకి తార వస్తుంది. శారదను చూసి దగ్గరకు వెళ్లి అత్తయ్యా అని పిలుస్తుంది. దేవుడిని మొక్కుతున్న శారద తిరిగి చూస్తుంది. దీంతో ఇవాళ్టీ మేఘసందేశం సీరియల్ ఏపిసోడ్‌ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

తార: ఏంటి అత్తయ్యా నాకు తార వద్దు.. నాకు భూమియే కోడులుగా కావాలని చెప్పి ఆ భూమి కోసం పూజలు చేస్తున్నారా..? నాకు తెలుసు అత్తయ్యా మీ మనసులో ఏముందో.. మీ అబ్బాయి వద్దంటున్నా కూడా మీరు మాత్రం కోడలుగా ఆ భూమి మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఇక ఆ అవకాశం లేదు లేండి.. ఆ భూమి ఈ ఇంటికి రాదు.

శారద: ఏం చేశావు..

తార: నేను ఆ ఇంటికి వెళ్లాను. కానీ అది తప్పించుకుంది. ఉండి ఉంటే నా చేతులతో నేనే చంపేసేదాన్ని.. అపూర్వ ఆంటీతో చెప్పాను. వాళ్ల నాన్నతో చెప్తాను అంది. వాళ్ల నాన్న ఈ ఇంటికి రావొద్దని ఆల్‌రెడీ వార్నింగ్‌ ఇచ్చాడట. అయినా వచ్చింది కదా..? వాళ్ల నాన్న దాని పని చెప్తాడు లేండి..

పూర్ణి: మంచి పని చేశావు వదిన నేను నీ నుంచి కోరుకునేది ఇదే..

గగన్‌: మీరు ఆ ఇంటికి వెళ్లారా..?

తార: అవును వెళ్లాను. అది ఈ ఇంటికి వచ్చింది. మీరు నాకు కాబోయే భర్త. ఇది నా అత్తారిల్లు.. అది వచ్చి ఈ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే నేను ఊరుకుంటానా.. అందుకే వెళ్లి చెప్పేశా..? ఇక అది మన మధ్య అడ్డుగా ఉండదు. ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు.. బాయ్‌ గగన్ గారు.. బాయ్‌ పూరి ఉంటాను అత్తయ్య..

పూరి: నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నయ్యా..?

శారద: గగన్‌ ఏంట్రా ఇది.. తనను ఎవరు వెళ్లమన్నారు అక్కడికి…

గగన్‌: నాకు కూడా తెలియదు అమ్మా.. అసలు భూమి ఇంటికి వచ్చిందని అసలు తారకు చెప్పింది ఎవరు..?

పూరి: నేనే చెప్పాను..

శారద: నువ్వు చెప్పావా..? బుద్ది ఉందా నీకు

పూరి: ఆ బుద్ది తనకు ఉండాలి. మన ఇంటికి రావొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వస్తుంది అమ్మా

గగన్‌: ఏంటి భూమి అందుకని తారకు వెళ్లి కంప్లైట్‌ ఇస్తావా..?

పూరి: ఇవ్వాలి కదా అన్నయ్య.. లేదంటే మన పెళ్లిళ్లు జరగనివ్వదు ఆ భూమి. తార మంచి పని చేసింది అన్నయ్య.

శారద: పూరి.. భూమి వాళ్ల నాన్నకు మనం అంటే ఎంత కోపమో తెలుసుకదా..? గగన్‌ మీరు ఇద్దరు కలవడమే ఆయనకు ఇష్టం లేదు. మీరు ఇద్దరూ విడిపోతున్నారని విడాకులు తీసుకుంటున్నారని తెలిసిన తర్వాత అసలు ఊరుకోడురా..?

పూరి: అయితే మనకేంటి అమ్మా.. వాళ్లు వాళ్లు కొట్టుకోని చావని.. నువ్వు ఎక్కువ రియాక్ట్‌ అవని..

శారద: నువ్వు ఎక్కువ మాట్లాడకు.. నా చేత్తో దెబ్బలు తింటావు..

గగన్‌: అమ్మా..?

శారద: గగన్‌ పాపంరా భూమి.. వెళ్లరా వెళ్లితనను ఎవ్వరూ ఏమీ అనకుండా చూడు..

పూరి: అన్నయ్య ఎందుకు వెళ్లాలి అమ్మా అన్నయ్య వెళ్లడు.. అన్నయ్య నువ్వు వెల్లడానికి వీల్లేదు.

శారద: అది కాదే అక్కడ పెద్ద గొడవ అవుతుంది. అందరూ భూమిని నిలదీస్తారు.. ఆ అపూర్వ ఇదే మంచి అవకాశం అని అందరి ముందు భూమి పరువు తీస్తుంది.

పూరి: తీస్తే తీయని.. పరువే తీస్తారో.. ప్రాణాలే తీసుకుంటారో మనకెందుకు..?

శారద: పూరి నువ్వు ఆగు.. గగన్‌ నువ్వు వెళ్లరా నా మాట విను..

పూరి: అన్నయ్య వెళ్లరు అమ్మా.. చంపితే చంపుతారు.. చంపని దరిద్రం వదలిపోతుంది.

శారద కోపంగా పూరి చెంప పగులగొడుతుంది.

గగన్‌: ఎందుకు కొడుతున్నావు అమ్మా..?

శారద: అన్నయ్యతో మాట్లాడుతున్నాను కదా..? పో లోపలికి..

గగన్‌: పూరి.. అమ్మా ఎందుకు అమ్మా అలా కొడుతున్నావు..

శారద: నా కూతురుని ఒక్క చెంప దెబ్బ కొడితేనే నువ్వు నన్ను అడిగావు. అక్కడ భూమి వాళ్ల నాన్న ఏం చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించు.. ఆ ఇంట్లో వాళ్లు రాబందులురా భూమిని పీక్కుతింటారు.. వెళ్లు గగన్‌. రేయ్ నువ్వు వెళ్తావా..? నన్ను వెళ్లమంటావా..?

గగన్‌: ఇప్పుడేంటమ్మా… ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను సరేనా..?

శారద: అక్కడికి వెళ్లగానే.. భూమితో నన్ను మాట్లాడించు..

అని చెప్పగానే.. గగన్‌ సరే అమ్మా అంటూ వెళ్లిపోతాడు. మరోవైపు శరత్‌ చంద్ర ఆఫీసులో ఆలోచిస్తూ కూర్చుంటే.. అపూర్వ వెళ్లి శరత్‌ చంద్రకు ఆ భూమి మళ్లీ  ఆ ఇంటి గడప తొక్కిందని చెప్తుంది. దీంతో శరత్ చంద్ర కోపంగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jaya Chiravuri: యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
Nindu Manasulu Serial Today July 25th: నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Embed widget