అన్వేషించండి

Meghasandesam Serial Today June 14th: ‘మేఘసందేశం’ సీరియల్‌: కేపీకి నిజం చెప్పిన శారద – షాక్‌లో పడిపోయిన కేపీ  

Meghasandesam Today Episode: గగన్‌ పెళ్లి  జరగాలంటే మనం విడాకులు తీసుకోవాలని ఈ కండీషన్‌ శరత్ చంద్ర పెట్టాడన్న నిజం శారద, కేపీకి చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.     

Meghasandesam Serial Today Episode: విడాకుల పేపర్స్‌ మీద గగన్‌ బలవంతంగా కేపీతో సంతకం చేయించాలని చూస్తాడు. కేపీ చేయడు. తిరిగి గగన్‌ను కొడతాడు. దీంతో అందరూ షాక అవుతారు. గగన్‌ కోపంగా చూస్తుంటాడు.

కేపీ: తెంపుకుంటే బంధాలు తెగిపోతాయా..?

గగన్‌: తెగిపోతాయి..

కేపీ: కాసేపు నేను ఈ పేపర్స్‌ మీద సంతకం పెట్టాను అనుకుందాం. కోర్టు నాకు మీ అమ్మకు విడాకులు మంజూరు చేసింది అనుకుందాం. అంటే మేము ఇద్దరం విడిపోయినట్టే కదా..? అలాంటప్పుడు మన మధ్య బంధం తెగిపోయినట్టే కదా..? నేను నిన్ను తిరిగి కొట్టాను కదా..? నువ్వు తిరిగి నన్ను కొట్టరా..? కొట్టు తెంపుకుంటే తెగిపోయే బంధాలు కాదురా..? బజారులో వస్తువులు

అంటూ విడాకుల పేపర్స్‌ చింపేసి కేపీ వెళ్లిపోతాడు. మరోవైపు సాధన కోపంగా భూమి చేసిన అవమానం గుర్తు చేసుకుని రగిలిపోతుంది. ఇంతలో అక్కడకు అపూర్వ వస్తుంది.

సాధన: రండి మీ కోసమే ఎదురుచూస్తున్నాను. మీరేదో గొప్పోళ్లని డబ్బులు ఇచ్చాను కదా ఎందుకు ఇచ్చనా అనుకుంటూ బాధ పడుతున్నాను.

సుజాత: అదేంటి అమ్మాయి నువ్విచ్చిన డబ్బులతో మా అమ్మాయి ఏదో కోటలు కట్టినట్టు అంటున్నావు. మేమేమైనా దేహి అంటే ఇచ్చావా..? నీకు అవసరం అయి ఇచ్చావు.

సాధన: ఇచ్చాను మరి మీరు ఏం చేస్తున్నారు.

అపూర్వ: సాధన పొగరుకు ప్రతిరూపాన్ని నేను నా ముందే ఇంకొకరు పొగరుగా మాట్లాడుతుంటే నేను అసలు తట్టుకోలేను. నేను నా పొగరు చూపిస్తే అసలు తట్టుకోలేను. విషయానికి రా

సాధన: ఓ మీకు ఈ చిన్న విషయం కూడా తెలియదన్నమాట. డాన్స్‌ అకాడమీకి మీ ఆయన్ని భూమి ఒప్పించింది.

అపూర్వ: తెలుసు..

సాధన: తెలుసా..? తెలిసే ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నారా..? అవునులే ఆవిడ డాన్స్‌ అకాడమీ పెడితే మీకు పోయేదేముంది. ఇక్కడ డాన్స్‌ అకాడమీ పెట్టుకున్న నేను అడుక్కు తినాలి.

సుజాత: అడుక్కుంటే.. ఇక్కడ అబిడ్స్‌లో ఎక్కువ కలెక్షన్‌ ఉంటుందా..? అక్కడ జగదాంబ సెంటర్‌లో ఎక్కువ ఉంటుందా..?

సాధన: నా సిచ్యుయేషన్‌ మీకు కామెడీలా అనిపిస్తుందా

సుజాత: లేదు సీరియస్‌ గానే అనిపిస్తుంది.

అపూర్వ: పిన్ని కూడా కరెక్టు గానే అంది కదా సాధన. ఆ భూమి ఉన్న ఆస్థి అంతా డాన్స్‌ కే కరిగించేస్తే మేము అడుక్కు తినాలి. నీ కంటే ఎక్కువ నష్టం నాకే. కనక దాన్ని అకాడమీ పెట్టకుండా ఆపాల్సిన అవసరం నాకే ఎక్కువ. అవసరం అయితే దాన్ని లేపేస్తాను.

సాధన: మీరిలా మాట్లాడుతుంటే నాకు ధైర్యంగా ఉంది. అమ్మను చంపిన చేతితో కూతురును చంపటం లెక్కా..?

అంటూ మీ మీద నమ్మకంతోనే డాన్స్‌ అకాడమీ ఏర్పాటు చేసుకుంటాను అని చెప్పి వెళ్లిపోతుంది సాధన. తర్వాత శారద దగ్గరకు వెళ్లిన కేపీ కోపంగా మాట్లాడుతుంటాడు.

కేపీ: ఇన్నాళ్లు నా  కొడుకు పక్కన నిలబడే అవకాశం కూడా నాకు దక్కలేదు. కనీసం ఈ పెళ్లి ద్వారా అయినా ఆ అవకాశం నాకు దక్కనివ్వు శారద.

శారద: దక్కదు. మీరు తండ్రిగా వాడి పెళ్లిలో నిలబడతాను అంటే అసలు ఈ పెళ్లే జరగదు.

కేపీ: ఏంటీ నేన తండ్రిగా పెళ్లిలో నిలబడితే ఈ పెళ్లే జరగదా..? సరిగ్గా వాడి పెళ్లికి ముందే ఈ కండీషన్‌ ఎందుకు పెట్టాడు శారద.

శారద: కండీషన్‌ పెట్టింది వాడు కాదండి..

కేపీ: వాడు చెప్పలేదు. నీకు ఇష్టం లేదు మరి ఎవరు చెబితే ఈ నిర్ణయం తీసుకున్నావు

అని కేపీ గట్టిగా అడగ్గానే శారద ఏడుస్తూ అసలు నిజం చెప్తుంది. ఈ కండీషన్‌ పెట్టింది శరత్‌ చంద్ర, అపూర్వ అని చెప్పగానే కేపీ షాక్‌ అవుతాడు. వాడి పెళ్లి కోసం నాకు విడాకులు ఇవ్వండి అని శారద వేడుకుంటుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Oh Na Siddayya Song: చెమట సుక్కలను తుడిసే కొంగయితనే... తెలంగాణ ప్రైవేట్ ఆల్బమ్ ఓ నా సిద్ధయ్య సాంగ్ లిరిక్స్ వైరల్
చెమట సుక్కలను తుడిసే కొంగయితనే... తెలంగాణ ప్రైవేట్ ఆల్బమ్ ఓ నా సిద్ధయ్య సాంగ్ లిరిక్స్ వైరల్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కుప్పకూలిపోయిన సహస్ర..! కఠిన దీక్ష పూర్తి చేసేదెవరు?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కుప్పకూలిపోయిన సహస్ర..! కఠిన దీక్ష పూర్తి చేసేదెవరు?
Meghasandesam Serial Today October 31st: ‘మేఘసందేశం’ సీరియల్‌: కేపీ, శారదలకు వార్నింగ్‌ ఇచ్చిన మీరా – వంశీ చెంప పగులగొట్టిన ఇందు  
‘మేఘసందేశం’ సీరియల్‌: కేపీ, శారదలకు వార్నింగ్‌ ఇచ్చిన మీరా – వంశీ చెంప పగులగొట్టిన ఇందు  
Nindu Noorella Saavasam Serial Today October 31st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సూసైడ్‌ చేసుకోబోయిన మను – భయపెట్టిన చంభా మాటలు  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: సూసైడ్‌ చేసుకోబోయిన మను – భయపెట్టిన చంభా మాటలు  

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget