అన్వేషించండి

Meghasandesam Serial Today July 9th: ‘మేఘసందేశం’ సీరియల్‌: తిరిగి వచ్చిన భూమి – ఆనందంలో తాళి కట్టబోయిన గగన్‌

Meghasandesam Today Episode:  డాన్స్‌ కాంపిటీషన్‌లో మొదటి ఫ్రైజ్‌ గెలుచుకుని భూమి నేరుగా పెళ్లి మండపానికి రావడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: భూమి గగన్‌ల పెళ్లికి అంతా సిద్దం అయి ఉంటుంది. గగన్‌ మండపంలో కూర్చుని ఉండగా పంతులు మంత్రాలు చదువుతుంటాడు. చుట్టాలు, బంధువులు పెళ్లి వస్తుంటారు. ఇంతలో పెళ్లి కూతురును తీసుకురమ్మని పంతులు చెప్తాడు. సుజాత వెళ్లి రూంలోంచి కంగారుగా వస్తుంది.

సుజాత: అమ్మాయి పెళ్లి కూతురు కనబడటం లేదు. అవును గదిలో పెళ్లి కూతురు లేదమ్మాయి..

అందరూ షాక్‌ అవుతారు. నక్షత్ర, అపూర్వ నవ్వుకుంటారు.

కేపీ:  కనిపించకపోవడం ఏంటండి అందరిని కంగారు పెట్టకండి..

సుజాత: లేదు నేను అంతా చూశాను.

కేపీ: వెళ్లి అంతా వెతకండి.. వెళ్లండి..

సుజాత: లేదు అని చెప్తున్నాను కదా..?

కేపీ, చెర్రి భూమిని వెతుక్కుంటూ వెళ్తారు. అందరూ అయోమయంగా చూస్తుంటారు. శరత్‌చంద్ర చిన్నగా నవ్వుకుంటాడు. గగన్‌ షాకింగ్‌గా చూస్తుంటాడు. కేపీ, చెర్రి మొత్తం వెతికి మండపంలోకి వస్తారు.

కేపీ: భూమి నిజంగానే కనిపించడం లేదు.

ముత్తైదువ: అనుకున్నాను నేను ముందే అనుకున్నాను. మగ దిక్కు లేని ఇంటికి ఏ ఆడపిల్ల కోడలుగా వెళ్తుందా అని ముందే అనుకున్నాను. అది శరత్‌చంద్ర గారి ఇంటి నుంచి ఈ ఇంటి కోడలిగా వెళ్లడం ఏంటని ముందే అనుకున్నాను. అనుకున్నదే అయింది.

కేపీ: ఏవండి ఇంక ఆపండి..

శరత్‌: వాళ్లను ఆపే రైట్‌ మనకు లేదు. ఎందుకంటే వాళ్ల కుటుంబం అలాంటిది.

ముత్తైదువ: బాగా చెప్పారండి ఈ పెళ్లి జరగదని నాకు మొదటి నుంచే అనిపిస్తుంది. చివరి నిమిషంలో ఈ ఇంటికి నేను కోడలు ఏంటని భూమి వెళ్లిపోయినట్టు ఉంది.

వ్యక్తి: అట్టర్‌ ప్లాప్‌ సినిమాకు బ్లాక్‌లో టికెట్లు కొనుక్కుని వచ్చినట్టు ఉంది మన పరిస్థితి. ఇంకెందుకు టైం వేస్ట్‌ వెళ్దాం పదండి. లేవండి.. వెళ్దాం..

గగన్‌: ఆగండి.. ఈ పెళ్లి ఆగిపోయిందని మీకు మీరే నిర్దారించుకుని వెళ్లిపోకండి. భూమితో నా పెళ్లి జరుగుతుంది.

అంటూ గగన్‌ కరాకండిగా చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. శారద ఏడుస్తుంది. మరోవైపు డాన్స్‌ కాంపిటీషన్‌ లో పాల్గొనేందుకు వెళ్లిన భూమి తన చాన్స్‌ కోసం ఎదురుచూస్తుంది. చివరి రౌండ్‌లో భూమి ప్రదర్శన చాలా గొప్పగా చేస్తుంది. భూమి డాన్స్‌ కాంపిటీషన్‌కు రావడంతో కావ్య షాక్ అవుతుంది. అపూర్వ చెప్పింది గుర్తు చేసుకుని కోపంతో ఊగిపోతుంది. ఇప్పుడెలాగైనా భూమిని గెలవకుండా చేయాలని కుట్రలు చేయాలని చూస్తుంది. కానీ కాంపిటీషన్‌లో భూమి డాన్స్ చేస్తుంది. భూమి డాన్స్ జడ్జీలే కాదు. ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడతారు. భూమి డాన్స్‌ చేశాక ఫైనల్‌ రౌండ్‌ ముగిసిందని భూమిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి బహుమతి తీసుకుని భూమి నేరుగా పెళ్లి మండపానికి వస్తుంది. అప్పటి దాకా మండపంలోనే అందరూ వెయిట్‌ చేస్తుంటారు.

చెర్రి: అదిగో భూమి వస్తుంది.

గగన్‌ ఏడుస్తూ వెళ్లి భూమిని హగ్‌ చేసుకుంటాడు.

గగన్‌: నా భూమి వచ్చింది చూడండి.. మా ప్రేమ నిజం అని నిరూపిస్తూ భూమి వచ్చింది. థాంక్స్‌ భూమి

అంటూ హగ్‌ చేసుకుంటాడు. వెంటనే రెడీ అయి రమ్మని భూమికి చెప్తాడు. భూమి రూంలోకి వెళ్తుంది. గగన్‌ వెళ్లి పెళ్లిపీటల మీద కూర్చుంటాడు. మొదలుపెట్టినప్పటి నుంచి ఈ పెళ్లి ఆగిపోతుందనుకుని ఆనందించిన అందరూ మా పెళ్ళిని చూడండి అంటాడు. ఇంతలో భూమి మండపంలోకి వస్తుంది. గగన్ తాళికట్టబోతుంటే.. ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 10th:జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని అడుగడుగునా అడ్డుకుంటున్న శకుంతల! విహారి ఇంటికి లక్ష్మీ చేతి వంట!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని అడుగడుగునా అడ్డుకుంటున్న శకుంతల! విహారి ఇంటికి లక్ష్మీ చేతి వంట!
Yashaswini Swami: తెలుగు బుల్లితెరపై రాణిస్తోన్న కన్నడ బబ్లీ గర్ల్.. యశస్విని స్వామి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
తెలుగు బుల్లితెరపై రాణిస్తోన్న కన్నడ బబ్లీ గర్ల్.. యశస్విని స్వామి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Godavari Serial Today July 10th: 'గోదావరి' సీరియల్: ఫేక్ పెళ్లి కొడుకుకి ముందే పెళ్లైందా! కొడుకు ఉన్నాడా! కల్యాణ్ కూడా ఫ్రాడేనా!
'గోదావరి' సీరియల్: ఫేక్ పెళ్లి కొడుకుకి ముందే పెళ్లైందా! కొడుకు కూడా ఉన్నాడా! కల్యాణ్ ఫ్రాడేనా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Embed widget