అన్వేషించండి

Meghasandesam Serial Today January 29th: ‘మేఘసందేశం’ సీరియల్‌: చెర్రిని కొట్టిన అపూర్వ – అపూర్వను తిట్టిన శరత్‌ చంద్ర

Meghasandesam serial today episode January 29th: చెర్రి నక్షత్రను కొడుతుంటే చూసిన అపూర్వ వెళ్లి చెర్రిని కొట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: బయట పార్టీ నుంచి ఇంటికి వస్తారు చెర్రి, నక్షత్ర. బాగా టైడ్‌ అయిపోయాను అని నక్షత్ర చెప్పగానే.. చెర్రి వెటకారంగా చూస్తాడు. ఏంటి అంటాడు. అదే నేను టైడ్‌ అయిపోయాను అంటుంది నక్షత్ర. నువ్వు టైడ్‌ అయితే ట్యూబ్‌ అయ్యానా..? నేను టైడ్‌ అయ్యానులే కానీ పద లోపలికి అనగానే.. భర్త వెనకాలే భార్య నువ్వు ముందు పద అంటుంది ఇద్దరూ లోపలికి వెళ్లిపోతారు.

చెర్రి: ఏంటో కాస్త తలనొప్పిగా అనిపిస్తుంది. నక్షూ కొంచెం టీ పెట్టుకుని తీసుకురామ్మా..?

నక్షత్ర: ఇప్పుడే కదా చెర్రి బాగా టైడ్‌గా ఉన్నానని చెప్పాను. అంత తలనొప్పిగా ఉంటే ఆ టీ నువ్వే పెట్టుకుని నాక్కూడా కాస్త ఇవ్వు..

చెర్రి: ఏంటి ఏంటి..? నేను టీ పెట్టి ఇవ్వాలా..?

నక్షత్ర: ఏం ఇస్తే తప్పేంటి..? ఇంతకుముందు చెప్పు కింద తేలులా ఉన్నావు. ఇప్పుడు తలపై పడిన రాయిలా తయారయ్యావు.

చెర్రి: ఏం కూశావే..

అంటూ చెర్రి నక్షత్రను కొడతాడు. నక్షత్ర కోపంగా చెర్రి అంటుంది. ఆ ఏంటో నువ్వు మర్చిపోతున్నట్టు ఉన్నావే నిన్న మొన్నటి గతాన్ని అంటూ మళ్లీ కొట్టబోతుంటే.. అపూర్వ చూసి గట్టిగా చెర్రి అంటూ వెళ్లి కొడుతుంది. ఇంతలో అందరూ వస్తారు అపూర్వను ఆపేస్తారు.

అపూర్వ: అసలు నీకు అర్థం కావడం లేదు బావ. వీళ్లవి మనం పడేసిన ఎంగిలి బతుకులు.

కేపీ: అపూర్వ ఏం మాట్లాడుతున్నారు. మాటలు మర్యాదగా రాని..

అపూర్వ: ఏంటి మీకిచ్చే మర్యాద. ఏం నా మాటలు నిజం కాదు..

శరత్‌: అపూర్వ కేపీ మాటే నా మాట కూడా నీ మాట మర్యాద దాటేసింది. నీ ఆవేశం హద్దులు దాటుతుంది. కేపీ నా చెల్లెలు భర్త. చెర్రి తన కొడుకు ఒకప్పుడు మన ఇంటి  మేనల్లుడు. ఇప్పుడు మన ఇంటి అల్లుడు.

అపూర్వ: ఇదే బావ ఈ మంచి తనమే మన ఇంటినే ముంచేసే మనుషులుగా వీళ్లను మారుస్తుంది బావ. నువ్వు నాకు ఒక మాట చెప్పు. నీకు మన కూతురు నక్షత్ర ఎక్కువ. లేకపోతే మన మేనల్లుడు చెర్రి ఎక్కువ..? ఇద్దరూ సమానం అని మాత్రం చెప్పకు. సూటిగా కళ్లల్లోకి చూస్తూ ఇద్దరిలో ఎవరు ఎక్కువో చెప్పు బావ.

సుజాత: బాగా అడిగావు అమ్మాయి. త్వరగా చెప్పేయండి అల్లుడు గారు.

శరత్: అసలు ఏమైంది అపూర్వ.

అపూర్వ: చూశావా.. బావ. నా ప్రశ్నకు సమాధానం చెప్పలేక తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నావు.. బావ కన్నవాళ్లకు ఎవరికైనా సరే కన్న పిల్లల కన్నా ఎవ్వరూ ఎక్కువ కాదు.

సుజాత: బాగా చెప్పావు అమ్మాయి.

శరత్‌: ముందు ఏం జరిగిందో అది చెప్పు అపూర్వ..

అపూర్వ: ఇంకా ఎం కావాలి బావ. అసలు ఈ చెర్రి గాడు మన నక్షత్ర మెడలో చెప్పకుండా తాళి కట్టినప్పుడే వీడి చేతులు నరకాల్సింది. నువ్వేమో ఉపేక్షించావు. ఇప్పుడు అవే చేతులు మన నక్షత్రను కొడుతున్నాయి బావ.

శరత్: ఏరా చెర్రి నా కూతురు మీద చేయి చేసుకున్నావా..?

చెర్రి: నేనా మామయ్య నక్షత్రను కొట్టడమా..? నక్షూ నేను నిన్ను కొట్టానా..?

అపూర్వ: చెప్పవే.. చెప్పు వాడు నిన్ను కొట్టాడుగా..?

చెర్రి: చెప్పు నక్షత్ర లేకపోతే అందరూ నేను నిన్ను కొట్టాను అనుకుంటారు.

అపూర్వ: చెప్పవే.. చెప్పు..

నక్షత్ర: ఆయన నన్ను కొట్టలేదు డాడీ.. ఆయన ప్రేమకు ఆయన నన్ను చూసుకుంటున్న విధానానికి నా కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి డాడీ. అది చూసి మమ్మీ కొట్టాడనుకుని అపోహ పడుతుంది.

అపూర్వ: ఓసేయ్‌ నీకు ఏమైందే..? ఆ చెర్రి గాడు నీకు ఏం మందు పెట్టాడే..?  బావ అబద్దం బావ.. అసలు ఆ చెర్రి గాడు మన నక్షత్రను ఒక్కసారి కాదు రెండు సార్లు కొట్టాడు. ఇది అబద్దం ఆడుతుంది బావ.

నక్షత్ర: మమ్మీ నేనెందుకు అబద్దం ఆడతాను మమ్మీ. నువ్వే అబద్దం ఆడుతున్నావు. నువ్వు డాడీని ఎంత బాగా చూసుకుంటావో నన్ను అంత బాగా చూసుకుంటున్నారు. నువ్వు డాడీని ఎంతలా ప్రేమిస్తున్నావో ఆయన నన్ను అంతలా ప్రేమిస్తున్నారు మమ్మీ. అలాంటి ఆయన నన్ను ఎందుకు కొడతారు మమ్మీ

అని నక్షత్ర చెప్పగానే.. చెర్రి కూడా మొదటి నుంచి నేను మీకు అల్లుడు కావడం అత్తయ్యకు ఇష్టం లేదు మామయ్య.. అని చెప్పగానే.. అపూర్వ కోప్పడుతుంది. దీంతో అపూర్వను శరత్‌ చంద్ర తిడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రోడ్డు మీద ప్రమిదలు అమ్ముతున్న క్రిష్! కొడుకుని పట్టుకొని వెక్కివెక్కి ఏడ్చేసిన మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రోడ్డు మీద ప్రమిదలు అమ్ముతున్న క్రిష్! కొడుకుని పట్టుకొని వెక్కివెక్కి ఏడ్చేసిన మహా!
Godavari Serial Today November 10th: 'గోదావరి' సీరియల్: సంజయ్ గతం ఇదే! సంజు కోసం మనసు మార్చుకున్న జాను!
'గోదావరి' సీరియల్: సంజయ్ గతం ఇదే! సంజు కోసం మనసు మార్చుకున్న జాను!
Nindu Manasulu Serial Today November 10th: నిండు మనసులు: ప్రేరణ కోసం సిద్ధూని బతిమాలిన గణ! ప్రేరణని ప్రశ్నించిన సిద్ధూ!
నిండు మనసులు: ప్రేరణ కోసం సిద్ధూని బతిమాలిన గణ! ప్రేరణని ప్రశ్నించిన సిద్ధూ!
Illu Illalu Pillalu Serial Today November 10th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: మాజీ లవర్ అంజలి దగ్గర చందు! తండ్రికి ప్రామిసరీ నోట్ ఇచ్చిన ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: మాజీ లవర్ అంజలి దగ్గర చందు! తండ్రికి ప్రామిసరీ నోట్ ఇచ్చిన ధీరజ్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
YSRCP On Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
KA Paul: నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
Makhana Benefits : రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
Pawan Kalyan Divorce: పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
Car Engine Problems: మిస్‌ఫైరింగ్ నుంచి 'చెక్ ఇంజిన్' లైట్ వరకు.. ఇంజిన్‌కు ప్రమాదం తెచ్చే 3 సమస్యలు ఇవే
కారు ఇంజిన్‌లో ఈ 3 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వెళ్లండి
Weight Loss Recipe : బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
Congress Politics: 9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
Embed widget