అన్వేషించండి

Meghasandesam Serial Today January 26th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమితో ఎమోషనల్‌ అయిన గగన్‌ - శివ అంతు చూస్తానన్న సూర్య

Meghasandesam serial today episode January 26th: తనను ఎప్పటికీ అర్థం చేసుకోవని ఏడుస్తున్న భూమితో తన మనసులో మాట చెప్తాడు గగన్‌. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode: అపూర్వ రూంలోంచి తన ఫోన్‌ తీసుకుని పైకి వెళ్లి బిందు, శివతో మాట్లాడుతుంటే.. అపూర్వ చూస్తుంది. బిందును కొడుతూ కిందకు తీసుకొస్తుంది. బిందు ఏడుస్తుంటుంది. అపూర్వ.. శరత్‌చంద్ర, మీరాలను పిలుస్తుంది. ఇంతలో మీరా, శరత్‌ చంద్ర వస్తారు.

మీరా: అయ్యో ఏమైంది వదిన..?

అపూర్వ: ఏమైందా..? ఇది నా రూంలోంచి ఫోన్‌ కొట్టేసి పైకి వెళ్లి టెర్రస్‌ నుంచి ప్రియుడితో మాట్లాడుతుంది.

మీరా: మరి నాతో ఎందుకు బిందు ఫ్రెండ్‌కు ప్రాజెక్టు పంపించాలి ఫోన్‌ కావాలి అని అడుగుతున్నావు.

అపూర్వ: ఇంకా నీకు అర్థం కాలేదా..? బిందు. దీని కపట తెలివితో ఫోన్‌ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి నిన్ను పిచ్చి దాన్ని చేసింది.

శరత్‌: ఆ భూమి నన్ను పిచ్చి వాన్ని చేసి నాకు నచ్చని వాడితో వెళ్లిపోయింది. ఇప్పుడు దీని వంతు వచ్చిందా..?

అంటూ శరత్‌చంద్ర కోట్టబోతుంటే. మీరా, బిందు ఏడుస్తుంటారు. శరత్‌చంద్ర ఆగిపోతాడు.

అపూర్వ: నువ్వు బాధపడకు బావ వాడెవడో నేను దీని చేతే చెప్పిస్తాను.

మీరా: వదిన.. ఆగు ..

అపూర్వ మాత్రం బిందును కొడుతూ వాడు ఎవడో చెప్పవా..? అంటూ తిడుతుంది. బిందు ఏడుస్తుంది కానీ నిజం చెప్పదు.

అపూర్వ: పిన్ని దీన్ని పైన కొట్టినప్పుడు ఫోన్‌ కింద పడిపోయింది. ఎక్కడ పడిందో వెతికి తీసుకురాపో..?

శరత్‌: ఈ ఇంటికి ఏదో శాపం తగిలినట్టు ఉంది అపూర్వ. ఈ ఇంట్లో ప్రేమించిన ఆడపిల్ల మన పరువు తీస్తూ ప్రేమించిన వాడితో వెల్లడమే కాకుండా..? వెళ్లిన తర్వాత కూడా ప్రతిక్షణం పరువు తీస్తూనే ఉన్నారు. ఈరోజు ఆ భూమి జైలుకు వెళ్లడానికైనా సిద్దం అయింది కానీ ఆ గగన్‌ మీద తన పిచ్చి ప్రేమను మాత్రం వదులుకోవడం లేదు. ఆ పోలీసుల ముందు నా పరువు తీసింది. ఈ బిందుతో ఆ శాపం ఆగాలి అపూర్వ.

అపూర్వ: ఆగుతుంది బావ.. ప్రేమించిన వాడు ఎవడో తెలుస్తుంది కదా అప్పుడు అపేద్దాం..

అని చెప్తుంది. బయట ఫోన్‌ కోసం వెతుకుతున్న సుజాతకు ఫోన్‌ పగిలిపోయి కనిపిస్తుంది. దాన్ని అలాగే పగిలిపోయిన ముక్కలు చేతిలోకి తీసుకుని మూడు ముక్కలైంది.. అంత పైనుంచి పడితే ముక్కలు అవక ఏమౌతుంది అనుకుంటూ లోపలికి వెళ్తుంది.

సుజాత: అమ్మాయి అంత పై నుంచి పడితే ఫోన్‌ ముక్కలు అయింది.

అపూర్వ: ఏం పర్వాలేదు పిన్ని.. ఇప్పటికి తప్పించుకున్నాను అనుకుంటున్నావేమో..? కాల్‌ హిస్టరీ తీయిస్తా.. వాడెవడో తెలుసుకుంటా..? నీ అంతు వాడి అంతు ఒకేసారి తేల్చుకుంటా..? తేలుస్తానే..

అంటూ పగిలిపోయిన ఫోన్‌ అందులోని సిమ్‌ తీసుకుని అపూర్వ వెళ్లిపోతుంది. బిందు ఏడుస్తుంటే మీరా దగ్గరకు వెళ్లి ఓదారుస్తుంది. మరోవైపు ఎస్పీ సూర్య దగ్గర నుంచి భూమిని విడిపించుకుని కారులో వెళ్తుంటాడు గగన్‌. భూమి ఏమోషనల్‌ అవుతూ గగన్‌ను చూస్తుంది.

భూమి: అందరి కష్టాలను అర్థం చేసుకునే నీకు నా ప్రేమ ఎందుకు అర్థం అవడం లేదు బావ.

గగన్‌: నీ ప్రేమ నాకు అర్థం కావడం కాదు. నువ్వు నన్ను సరిగ్గా అర్తం చేసుకోవడం లేదు. నా కన్నీటితో అప్పుడప్పుడు నేనే పోరాడుతున్నాను. నువ్వు ప్రేమగా ఏం చేసినా అది పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు అని నువ్వు అనుకుంటున్నావే కానీ నా గుండెల్లోంచి వస్తున్న ప్రేమను నువ్వు చూడటం లేదు.

అంటూ గగన్‌ బాధపడుతుంటే భూమి కూడా ఏడుస్తూ.. ఐలవ్యూ చెప్తుంది. గగన్‌ కూడా టూ లవ్‌ అంటూ భూమిని హగ్‌ చేసుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
TV Actor Arrested: మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
Vanana Brundha: మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు
మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు
Godavari Serial Today July 11th: 'గోదావరి' సీరియల్: పెళ్లి కొడుకు గుట్టు బయటపెట్టిన జాను.. చివరి నిమిషంలో ఆగిన నందు పెళ్లి!
'గోదావరి' సీరియల్: పెళ్లి కొడుకు గుట్టు బయటపెట్టిన జాను.. చివరి నిమిషంలో ఆగిన నందు పెళ్లి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Embed widget