అన్వేషించండి

Meghasandesam Serial Today January 24th: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వ రూంలోకి వెళ్లిన బిందు – నిజం చెప్పిన శివ

Meghasandesam serial today episode January 24th: బిందు ఎవ్వరికీ చెప్పకుండా అపూర్వ రూంలోకి వెళ్తుంది. తర్వాత ఏం జరిగిందనేది ఇవాళ్టీ ఏపిసోడ్‌లో చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode: మీరా కిచెన్‌లో వంట చేస్తుంటే బిందు వెళ్తుంది. డల్లుగా అమ్మా అని పిలవగానే మీరా ఏంటి బిందు నీకు నచ్చింది ఏదైనా వండి పెట్టమంటావా..? అని అడుగుతుంది.  దీంతో బిందు అది కాదు అమ్మ అంటుంది.

మీరా: అది కాకపోతే నా వల్ల ఇంకేం కాదు. ఫోన్‌ అయితే ఇవ్వను.. డబ్బులు అయితే నా దగ్గర ఉండవు. నువ్వు బయటకు వెళ్లాలంటే ఆ పర్మిషన్ ఇచ్చే అధికారం నాకు లేదు. మీ అత్తయ్యా ఒప్పుకోదు.

బిందు: నాకు ఫోనే కావాలమ్మా..

మీరా: ఇవ్వనని చెప్తున్నాను కదా బిందు..

బిందు: నీ ఫోన్‌ కాదమ్మా..? నా ఫోన్‌ కావాలి. అందులో నా ఫ్రెండ్‌ చేసిన ప్రాజెక్టు ఒకటి ఉంది. నేను ఎగ్జామ్‌కు వెళ్లాను కదా అప్పుడు చెప్పింది. దాని ఫోన్‌లో ఉన్న ప్రాజెక్టు కరెప్ట్‌ అయిపోయిందట. దానికి ఆ ప్రాజెక్టు తిరిగి పంపించమని అడిగిందమ్మ. మరి నాకు ఆ ప్రాజెక్టు విషయంలో హెల్ప్‌ చేసిందమ్మా తిరిగి నేను పంపించకపోతే తను నన్ను తప్పుగా అనుకుంటుంది కదా..? ఒక్కసారి ఫోన్‌ ఇవ్వమ్మా.. నీ కళ్ల ముందే నా ఫ్రెండ్‌కు ప్రాజెక్టు సెండ్‌ చేసి మళ్లీ నీకు తిరిగి ఇచ్చేస్తాను అమ్మ.. ఫ్లీజ్‌..

మీరా: బిందు నీ ఫోన్‌ నా దగ్గర ఎక్కడుందే..? మీ అత్తయ్యే తన రూంలో ఎక్కడో దాచేసింది. వెళ్లు ఇప్పుడు నాకు చెప్పిందంతా మీ అత్తయ్యకు చెప్పి ఇస్తే తీసుకుని మళ్లీ తిరిగి ఇచ్చేయ్‌ సరేనా..?

బిందు: సరే అమ్మా..

అంటూ బిందు అక్కడి నుంచి వెళ్తుంది. అపూర్వ, సుజాత బయట మాట్లాడుకుంటూ ఉండగా దొంగచాటుగా అపూర్వ రూంలోకి వెళ్తుంది బిందు. రూంలో ఫోన్‌ కోసం వెతుకుతుంటుంది. రూంలో అంతటా వెతికినా ఫోన్‌ దొరకదు. అసహనంగా బయటకు వస్తూ అనుమానంగా తలగడ లోపలికి చేయి పెట్టి చూస్తుంది. అందులో తన ఫోన్‌ ఉంటుంది. హ్యాపీగా ఫోన్‌ తీసుకుని మెల్లగా బయటకు వచ్చేస్తుంది బిందు. వెంటనే మేడ మీదకు వెళ్లి ఫోన్‌ ఆన్‌ చేసి శివకు కాల్‌ చేస్తుంది బిందు.  ఏడుస్తూ ఇంట్లో కూర్చున్న శివ వెంటనే కాల్‌ లిఫ్ట్‌ చేస్తాడు.

శివ: హలో బిందు..

బిందు: శివ ఎలా ఉన్నావు..? నీ ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందా..? మీ వాళ్లు అంతా హ్యాపీయేనా..?

శివ: ఏమి హ్యాపీ బిందు..  ఇంట్లో ఎవ్వరం హ్యాపీగా లేము..? నా ఎంగేజ్‌మెంట్‌ ఆగిపోయింది.

బిందు: ఏంటి ఎంగేజ్‌మెంట్‌ ఆగిపోతే నువ్వు హ్యాపీగా లేవా..? నీ ఎంగేజ్‌మెంట్‌ రోజే నన్ను మర్చిపోయావా..? చచ్చేంత ప్రేమ ఉంది అని చెప్పిన నీ ప్రేమకు నేను ఏ పేరు పెట్టాలి.

శివ: అయ్యో బిందు నీకు అలా అర్థం అయిందా..? నేను హ్యాపీగా లేనిది.. బాధతో ఏడుస్తుంది.  ఎంగేజ్‌మెంట్‌ ఆగిపోయినందుకు కాదు. మా అక్క భూమి అరెస్ట్‌ అయినందుకు

అంటూ శివ నిజం చెప్పి ఏడుస్తుంటే.. బిందు షాక్‌ అవుతుంది. భూమి అరెస్ట్‌ కావడం ఏంటి..? శివ అంటూ కంగారుపడుతుంది. అసలు ఏం జరిగింది శివ.. ఎందుకు అరెస్ట్‌ అయింది. ఇంతకీ ఏమైంది..? శివ చెప్పు అంటూ అడుగుతుండగానే.. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 6th: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
జగద్ధాత్రి సీరియల్: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
Godavari Serial Today August 6th: 'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget