అన్వేషించండి

Meghasandesam Serial Today January 17th: ‘మేఘసందేశం’ సీరియల్‌: శరత్‌ చంద్ర ఇంటికి వెళ్లిన భూమి – కోపంతో తిట్టేసిన శరత్‌

Meghasandesam serial today episode January 17th: ఇంటికి వచ్చిన భూమిని ఇంట్లోంచి వెళ్లమని శరత్చంద్ర తిట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: తల నొప్పిగా ఉందని హాల్లో కూర్చుని ఉంటుంది అపూర్వ. ఇంతలో హలో అత్తయ్యా అంటూ చెర్రి వస్తాడు. చెర్రిని చూసిన సుజాత ఇదిగో అమ్మాయి నీ ఇంకో తల నెప్పి వస్తుంది అంటుంది చూస్తున్నానులే పిన్ని అంటుంది అపూర్వ. ఇంతలో చెర్రి దగ్గరకు వస్తాడు.

చెర్రి: అబ్బబ్బా.. ఒళ్లంతా ఒకటే నొప్పి గోరింటాకు.

సుజాత: బాబు పార పలుగు పట్టుకుని కూలికి వెళ్లి వచ్చిన కూలోడిలాగా అలా మాట్లాడతావేంటి..? బాబు రాత్రి సుఖంగా పడుకుని ఉదయాన్నే లేచినంత మాత్రానా ఒళ్లంతా నొప్పులు వస్తాయా ఏంటి..?

చెర్రి: పెళ్లి అయిన వాళ్లకు తెలుస్తాయి గోరింటాకు. నొప్పులు ఎప్పుడు ఎలా వస్తాయనేది. నీకు పెల్లి కాలేదు కదా..?

సుజాత: అంటే రాత్రి నువ్వు మా బేబీ..

చెర్రి: అయినా ఇంకా మీ బేబీ ఏంటి గోరింటాకు.. మీ బేబీ నా భార్య. భార్యాభర్తల మధ్య ఏమేం జరగాలో అన్ని జరుగుతున్నాయి.

అని చెర్రి చెప్పగానే.. అపూర్వ షాక్‌ అవుతుంది. ఇంతలో నక్షత్ర కాఫీ తీసుకుని వస్తుంది.

సుజాత: రామ్మా నక్షత్ర రా.. మీ అమ్మకు తగులుతున్న స్ట్రోక్ కు ఈ కాఫీ చాలా అవసరం.

నక్షత్ర: గోరింటాకు మా మమ్మీకో నీకో తేలేదు..  మా వారికి తీసుకొచ్చాను. తీసుకోండి..

చెర్రి: థాంక్యూ బంగారం..

సుజాత, అపూర్వ షాక్‌ అవుతారు. కాఫీ తాగి ఊసేస్తాడు చెర్రి.

నక్షత్ర: అయ్యో ఏమైందండి కాఫీ బాగా పెట్టలేదా..?

చెర్రి: చప్పగా ఉంది షుగర్‌ వేశావా..?

నక్షత్ర: మర్చిపోయానండి.. ఉండండి ఇప్పుడే వేసుకుని తీసుకుని వస్తాను.

అంటూ కాఫీ తీసుకుని నక్షత్ర కిచెన్‌లోకి వెళ్తుంది.

సుజాత: అమ్మాయి తాగిన కాఫీ కప్పును కూడా కిచెన్‌ సింక్‌లో వేయని మీ అమ్మాయి. చెర్రికి కాఫీ పెట్టుకుని వచ్చింది అమ్మాయి. చెర్రి కోప్పడుతుంటే తిరిగి భయపడపతుంది అమ్మాయి.

అపూర్వ: చూస్తున్నాను కదా పిన్ని.. తగిలిన గాయాన్నే మల్లీ నీ మాటలతో ఎందుకు గెలుకుతావు.

ఇంతలో మళ్లీ కాఫీ తీసుకుని వస్తుంది నక్షత్ర..

నక్షత్ర: ఇప్పుడు తాగండి..

చెర్రి: ఆహా సూపర్‌.. ఇప్పుడు కాఫీ అదిరిపోయింది.

నక్షత్ర: థాంక్యూ అండి..

చెర్రి: చూశావా.. ఇన్నాళ్లు మనం షుగర్‌ లేని కాఫీలా ఉండేవాళ్లం. కానీ ఈ షుగర్‌ వేశాక ఎంత బాగుందో అంత బాగున్నావు

నక్షత్ర: అవునా అండి..

చెర్రి: అవును బేబీ వేడి నీళ్లతో స్నానం చేయాలి గీజర్‌ ఆన్‌ చేశావా..?

నక్షత్ర: చేశాను అండి మీకు టిఫిన్‌ ఏం చేయమంటారు.

చెర్రి: నువ్వు ఇక్కడ టిఫిన్‌ చేస్తే అక్కడ నా వీపు ఎవరు రుద్దుతారు బంగారం..

నక్షత్ర: అవును కదూ మర్చేపోయాను సరే పదండి..

అనగానే.. అపూర్వ అయ్యో అనుకుంటూ చెవులు మూసుకుంటుంది. చెర్రి, నక్షత్ర అక్కడి నుంచి వెల్లిపోతారు. తర్వాత శరత్ చంద్ర ఇంటికి భూమి వస్తుంది. భూమిని చూసిన శరత్ చంద్ర కోపంగా మళ్లీ ఎందుకు వచ్చావని ఇంట్లోంచి వెల్లిపోమ్మని తిడతాడు. అదేమీ పట్టించుకోకుండా భూమి ప్రేమగా శరత్‌చంద్రతో మాట్లాడుతుంది. శివకు పూరికి నిశ్చితార్థం చేస్తున్నామని శివ తరపున తాంబూలాలు తీసుకోవడానికి మీరు పిన్ని రావాలి అని చెప్తుంది. దీంతో శరత్‌ కోపంగా తిట్టగానే.. అపూర్వ వచ్చి నిశ్చితార్థానికి వెళ్దాం బావ అని చెప్తుంది. అపూర్వ చెప్పడంతో శరత్‌ చంద్ర కూడా ఒప్పుకుంటాడు. అయితే అంతా విన్న బిందు మాత్రం రూంలోకి వెళ్లి ఏడుస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర మొదలైన ఫోన్ టెన్షన్? యమున పాత ఫోన్లో మహాకి అసలు నిజాలు తెలుస్తాయా?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర మొదలైన ఫోన్ టెన్షన్? యమున పాత ఫోన్లో మహాకి అసలు నిజాలు తెలుస్తాయా?
Godavari Serial Today November 28th: 'గోదావరి' సీరియల్: అమెరికా వెళ్లనున్న నందు! సంజు ఆఫీస్‌లో జాను అల్లరి! గౌతమి వెంట అజయ్!
'గోదావరి' సీరియల్: అమెరికా వెళ్లనున్న నందు! సంజు ఆఫీస్‌లో జాను అల్లరి! గౌతమి వెంట అజయ్!
Nindu Manasulu Serial Today November 28th: నిండు మనసులు: బిగ్‌ షాకింగ్.. సిద్ధూ, ప్రేరణ ఇక లేరు! గణ కళ్లముందే బాంబ్‌ పేలి చనిపోయిన సిద్ధూ, ప్రేరణ!
నిండు మనసులు: బిగ్‌ షాకింగ్.. సిద్ధూ, ప్రేరణ ఇక లేరు! గణ కళ్లముందే బాంబ్‌ పేలి చనిపోయిన సిద్ధూ, ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 28: తాగిన మత్తులో భరత్‌కు నిజం చెప్పేసిన విక్కీ..దమయంతి వాళ్లతో చేతులు కలిపిన భరత్
నువ్వులేక నేను లేను: తాగిన మత్తులో భరత్‌కు నిజం చెప్పేసిన విక్కీ..దమయంతి వాళ్లతో చేతులు కలిపిన భరత్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
India Hat Trick Asian Champions Trophy Title: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
Mohammed Siraj Omission:  సిరాజ్ ను త‌ప్పించ‌డంలో జట్టు మేనేజ్‌మెంట్ తీరుపై అశ్విన్, మురళీ కార్తీక్ అస‌హ‌నం, ఎంపిక చేయనప్పుడు స్క్వాడ్ లోకి ఎందుకు తీసుకెళ్లారని ఆవేదన
సిరాజ్ ను త‌ప్పించ‌డంలో జట్టు మేనేజ్‌మెంట్ తీరుపై అశ్విన్, మురళీ కార్తీక్ అస‌హ‌నం, ఎంపిక చేయనప్పుడు స్క్వాడ్ లోకి ఎందుకు తీసుకెళ్లారని ఆవేదన
Bigg Boss Season 10 Today November 28th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డబుల్ ఎలిమినేషన్! వంశీ అవుట్! విషం చిమ్మేసిన కంటెస్టెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డబుల్ ఎలిమినేషన్! వంశీ అవుట్! విషం చిమ్మేసిన కంటెస్టెంట్స్!
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
Embed widget