అన్వేషించండి

Meghasandesam Serial Today December 9th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ ఫోన్‌ హ్యాక్‌ చేసిన నక్షత్ర – గగన్‌ కు ఫోన్‌ చేయమని భూమికి చెప్పిన ప్రసాద్‌

Meghasandesam Today Episode:   పూరి మీదకు పాము వేసి ఇంట్లోకి వెళ్లి గగన్‌ ఫోన్‌ ను హ్యాక్‌ చేస్తుంది నక్షత్ర. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode:  నువ్వు మాట్లాడకుండా వెళ్లిపోయావని వాడు అపార్థం చేసుకుంటే నీ పరిస్థితి ఏంటని అడుగుతాడు ప్రసాద్‌. అదే కదా మామయ్య నా భయం నా ఈ పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు మామయ్యా అంటూ భూమి ఏడుస్తుంది.  భూమిని ప్రసాద్‌ ఓదారుస్తాడు. మరోవైపు ఫ్రెండ్స్ తో కలిసి టీ తాగుతుంది నక్షత్ర. దీంతో లవ్‌ ఫెయిల్‌ అయితే ఇలా తీసుకొచ్చి టీ తాగించే వాళ్లను నిన్నే చూస్తున్నాము అంటారు. నా లవ్‌ ట్రాక్‌ వేరే ఎప్పుడూ కొట్టుకునే తిట్టుకునే వాళ్లు ఒక్కటి అయ్యారంటే ఇక వాళ్లను లైఫ్‌లాంగ్‌ ఎవ్వరూ విడదీయలేరు. నెగటివ్‌తో మొదలై పాజిటివ్‌గా మారే ప్రేమకథ లైఫ్‌లాంగ్‌ ఉంటుంది అని నక్షత్ర చెప్తుంది. పూరి నాట్యం చేస్తుంది. ఇంట్లో ఆలోచిస్తూ కూర్చున్న గగన్‌.. చెర్రి మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో శారద జ్యూస్‌ తీసుకొస్తుంది.

గగన్‌: వద్దమ్మా..

శారద: ఏమైందిరా..

గగన్: ఏం లేదు అమ్మా..

శారద: ఏదో ఇంపార్టెంట్‌ పని అన్నావు. దేవుడికి దండం పెట్టుకుని మరీ వెళ్లావు ఏమైంది నాన్నా ఆ పని.

గగన్‌: అదే అమ్మా అర్థం కావడం లేదు. నేనైతే ప్రపోజ్‌ చేశాను. అటు వైపు నుంచి రిప్లై వచ్చే లోపే పెద్ద డిస్టబెన్స్‌..  

శారద: ఏం డిస్టబెన్స్‌ .. అసలు ఏం ప్రపోజ్‌ చేశావు. ఎవరికి ప్రపోజ్‌ చేశారు.

గగన్‌: అదే బిజినెస్‌ ప్రపోజల్‌ అమ్మా.. ఒక మెయిల్‌ పెట్టాను అటు నుంచి రిప్లై రావాలి. ఈ లోపు ఒక పెద్ద వైరస్‌ వచ్చి మొత్తం సిచ్యుయేషన్‌ పాడు చేసింది.

శారద: సిచ్యుయేషన్‌ నా…

గగన్‌: సిచ్యుయేషన్‌ కాదు అమ్మా.. సిస్టం.. సిస్టమ్స్‌కు అన్నింటికీ వైరస్‌ వచ్చింది.

అంటూ గగన్‌ ఏదో పిచ్చిపిచ్చిగా చెప్తుంటే ఏదోరా నీ ఆఫీసు గోల ఏంటో నాకు అర్థం కాలేదు అంటుంది. ఇంతకీ పూరి ఎక్కడ అని గగన్‌ అడగ్గానే బయట డాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తుంది అని చెప్తుంది. ఇంతలో నక్షత్ర వస్తుంది. పూరి డాన్స్‌ చూసి రబ్బరు పామును పూరి మీదకు వేస్తుంది. లోపల నుంచి గగన్‌, శారద బయటకు  పరిగెత్తుకొస్తారు. నక్షత్ర దొంగచాటుగా లోపలికి వెళ్లి గగన్‌ ఫోన్‌ తీసుకుని ఏదో చేసి ప్లాన్‌ వర్కవుట్‌ అయింది. ఇప్పుడు మొదలవుతుంది గగన్‌ బావ ఈ నక్షత్ర గేమ్‌ అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సుజాత, అపూర్వ గేమ్‌ అడుతుంటారు. మీరా, బిందు వస్తారు.

మీరా: వదిన మన నక్షత్ర బర్తుడేకు బిందు కూడా బాగా రెడీ అవుతుందట.

అపూర్వ: అందుకు నేనేం చేయాలి. తను ఎటు వెళితే అటు ఫోకస్‌ లైట్‌ వేయిద్దామా..?

బిందు: అది కాదు అత్తయ్యా ఒక కొత్త డ్రెస్‌ వేసుకుందామని..

అపూర్వ: ఒకటి ఎందుకు పది వేసుకో..

బిందు: థాంక్యూ అత్తయ్యా.. మరి డబ్బులు..

అపూర్వ: డబ్బులు ఎందుకు మీ అక్క డ్రెస్సులు ఉన్నాయి కదా.. అవి వేసుకో

బిందు: అవి పాతవి కదా అత్తయ్య..

అపూర్వ: నువ్వు వేసుకుంటే అవి కొత్తవి అవుతాయిగా..

అని అపూర్వ చెప్పగానే మీరా అవును కదా వదిన నాకు ఈ ఐడియా రాలేదేంటి  పద బిందు అంటూ బిందును తీసుకుని వెళ్లిపోతుంది. మరోవైపు భూమి ఏడుస్తుంది. ప్రసాద్‌ వచ్చి భూమిని ఓదారుస్తాడు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం వస్తుందని నేను నీలాగే అనుకున్నాను. కాలంతో పాటు మా మధ్య దూరం పెరిగిపోయింది. నువ్వు తన మనిషివే అన్న నమ్మకం గగన్‌కు కలగాలి అందుకు కోసం నువ్వు గగన్‌కు ఫోన్‌ చేయ్‌ అని ప్రసాద్‌ చెప్తాడు.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రని తోసేసిన మహా! సహస్రని మిస్ లీడ్ చేసిన అంబిక
కలవారి కోడకలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రని తోసేసిన మహా! సహస్రని మిస్ లీడ్ చేసిన అంబిక
Godavari Serial Today November 12th: 'గోదావరి' సీరియల్: జానుకి సంజయ్ వెరైటీ సారీ! నందుపై ఆకర్ష్‌ స్పెషన్ కేర్! మురళీకి నో చెప్పిన నందు!
'గోదావరి' సీరియల్: జానుకి సంజయ్ వెరైటీ సారీ! నందుపై ఆకర్ష్‌ స్పెషన్ కేర్! మురళీకి నో చెప్పిన నందు!
Nindu Manasulu Serial Today November 12th: నిండు మనసులు: సిద్ధూ ముందు తలదించుకున్న ప్రేరణ! అన్నాచెల్లెళ్లకి నిజం తెలుసని రచ్చ చేసిన విజయానంద్!
నిండు మనసులు: సిద్ధూ ముందు తలదించుకున్న ప్రేరణ! అన్నాచెల్లెళ్లకి నిజం తెలుసని రచ్చ చేసిన విజయానంద్!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 12:అనసూయ,రామలింగం ప్రేమవిషయం విక్కీకి తెలిసిందా లేదా..?ఇప్పుడు రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..?
నువ్వులేక నేను లేను: అనసూయ,రామలింగం ప్రేమవిషయం విక్కీకి తెలిసిందా లేదా..?ఇప్పుడు రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget