Meghasandesam Serial Today December 28th: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ ను రూంలోకి లాక్కెళ్లిన నక్షత్ర – సుజాతతో జ్యూస్ తాగించిన గగన్
Meghasandesam Today Episode: గగన్‌కు జ్యూస్‌లో మోషన్ టాబ్లెట్ కలిపి ఇస్తుంది అపూర్వ. అ జ్యూస్‌ను సుజాతతో తాగిస్తాడు గగన్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఫన్నీగా జరిగింది.
Meghasandesam Serial Today Episode: మా అన్నయ్య ప్రేమిస్తుంది నిన్నా అని అడుగుతాడు చెర్రి. భూమి షాక్ అవుతుంది. అక్కడెక్కడో మా అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించి ఇక్కడ నిన్ను వెతుకుతున్నాడు. ఇక్కడ ఉన్న నువ్వు అక్కడ గుడిలో జరిగిన విషయం నువ్వు చెప్తున్నావు అంటూ మా అన్నయ్య ప్రేమిస్తుంది నిన్నేనా అంటాడు. దీంతో మీ అన్నయ్యా నన్ను ప్రేమిస్తున్నాడని నీకు చెప్పాడా..? అని భూమి అడుగుతుంది. లేదని చెర్రి చెప్పగానే భూమి ఊపిరి పీల్చుకుని మరి నన్నేందుకు ప్రేమిస్తున్నట్టు అంటూ చెప్తుంది భూమి. మరి అన్నయ్యా నీకోసం ఎందుకు వచ్చాడు అని చెర్రి అడగ్గానే ఇంత చిన్న విషయం కూడా నువ్వు గెస్ చేయలేవా అనగానే వద్దు ఇక నువ్వు చెప్పొద్దులే అంటాడు చెర్రి. మరోవైపు భూమిని వెతుకుతున్న గగన్‌ను రూంలోకి లాక్కెళుతుంది నక్షత్ర. బయట నుంచి చూసిన సుజాత షాక్ అవుతుంది.
సుజాత: అమ్మో తలుపులు వేసుకుని లోపల ఏం చేస్తున్నారో..
నక్షత్ర: బాగుంది కదా.. బావ..
గగన్: అసలు నీకు సిగ్గుందా..?
నక్షత్ర: ప్రేమ కూడా ఉంది. నువ్వు బలే టిపికల్‌గా బిహేవ్ చేస్తావు బావ. నాకోసం వస్తావు. దగ్గరకు వస్తే దూరంగా జరుగుతావు.
గగన్: నేనేం నీకోసం రాలేదు.
నక్షత్ర: మన లవ్ స్టోరీ బలే గమ్మత్తుగా స్టార్ట్ అవుతుంది. బలే ఇగో బావ నీకు. శత్రవు కూతురుని అని చెప్పి నేనంటే ఇష్టం అని చెప్పడానికి నీకు ఈగో అడ్డం వస్తుంది.
సుజాత: ఇదేదో చేసేలా ఉంది. వెంటనే వెళ్లి అపూర్వకు చెప్పాలి..
గగన్: చెప్తున్నాను కదా..? నేను నీకోసం రాలేదు.
నక్షత్ర: మరి ఎవరి కోసం వచ్చావు..
అంటూ అడిగి గగన్‌ను కిస్ చేస్తుంది నక్షత్ర. మరోవైపు గగన్‌కు జ్యూస్ చేయడానికి వెళ్లిన అపూర్వ.. గగన్‌ను తిడుతుంది. ఇంతలో సుజాత వెళ్లి నక్షత్ర, గగన్ రూంలోకి వెళ్లిన విషయం చెప్తుంది. అపూర్వ కోప్పడుతుంది. ఇంతలో సుజాత మోషన్ టాబ్లెట్ తీసుకొచ్చి అపూర్వకు ఇస్తుంది. ఈ టాబ్లెట్ కలిపి జ్యూస్ ఇవ్వు వాడు ఇక్కడి నుంచి పారిపోతాడు అని చెప్తుంది. టాబ్లెట్ వేసి కలిపి జ్యూస్ చేస్తుంది అపూర్వ. రూంలోంచి బయటకు వచ్చిన గగన్ భూమి కోసం వెతుకుంటే గగన్ చెంపకు ఉన్న లిప్ స్టిక్ గుర్తు చూసి అందరూ నవ్వుకుంటారు.
సుజాత: బాబు గగన్ బాబు ఇలా రండి..
గగన్: మీరు భూమిని ఎక్కడైనా చూశారా..?
సుజాత: బాబు ఒకసారి అటు తిరుగు బుగ్గ చూపించు..
గగన్: దేనికీ..?
సుజాత: క్లారిటీ కోసం..
గగన్: నా బుగ్గ చూపిస్తే మీకేం క్లారిటీ వస్తుంది.
సుజాత: గదిలో ఏం జరిగిందో అన్న క్లారిటీ..
గగన్: ఏం క్లారిటీ
సుజాత: నువ్వు ఇన్ని ప్రశ్నలు వేస్తే ఆన్సర్ చెప్పడం కష్టంలే కానీ ఇదిగో ఈ జ్యూస్ తీసుకో బాబు.
అని జ్యూస్ ఇవ్వబోతుంటే.. మీరెందుకు తీసుకొచ్చారు అని అడుగుతూ.. జ్యూస్ చేతిలోకి తీసుకుని ఏం కలిపింది అని అడుగుతాడు. సుజాత షాక్ అవుతుంది. ఏం కలపలేదు అని చెప్తుంది. నీ మాటలు వింటుంటే నాకెందుకో డౌటు కొడుతుంది. అందుకే ఈ జ్యూస్ మీరే తాగాలి అంటాడు. సుజాత నేను తాగను అంటుంది. అయితే ఈ జ్యూస్ మీరు తాగకపోతే మినిస్టర్ గారికి ఇస్తాను అంటాడు. దీంతో భయంతో సుజాత జ్యూస్ తీసుకుని తాగుతుంది. తర్వాత శారద, గగన్‌కు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు అని అడుగుతుంది. నేనొక ఫంక్షన్‌కు వచ్చాను తర్వాత చేస్తాను అని చెప్పగానే నువ్వు నక్షత్ర బర్తుడే ఫంక్షన్‌కు వెళ్లావట అక్కడికి ఎందుకు వెళ్లావు అని అడగ్గానే మంత్రితో కలిసి రావాల్సి వచ్చిందని ఇంటికి వచ్చి మాట్లాడతాను అని ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత గగన్ బుగ్గ మీద ఉన్న లిఫ్టిక్ చూస్తుంది భూమి. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!