Meghasandesam Serial Today April 28th: ‘మేఘసందేశం’ సీరియల్: జైలు నుంచి బయటకు వచ్చిన చెర్రి – హాస్పిటల్ లో జాయిన్ అయిన గగన్
Meghasandesam serial today episode April 28th: లిల్లీ నిజం చెప్పడంతో చెర్రిని నిర్దోషిగా కోర్టు రిలీజ్ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: కోర్టుకు వెళ్లిన లిల్లీ తానే అనవసరంగా చెర్రి మీద నింద మోపానని చెప్తుంది. వాళ్ల నాన్నను చంపేస్తానని బెదిరించి తన చేత ఈ కేసు పెట్టించారని.. చెర్రిని ఎలాగైనా జైలు పాలు చేయాలని ఇలా చేయించారని.. చెర్రిని గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లింది తానేనని తన చేత ఈ కేసు పెట్టించారని చెప్తుంది. అక్కడే కోర్టులో ఉన్న అపూర్వ, నక్షత్ర షాక్ అవుతారు.
జడ్జి: అసలు ఇదంతా ఎవరు చేయించారు. ఈ కుట్ర వెనక ఉన్నది ఎవరు..?
అని అడగ్గానే.. లిల్లీ, అపూర్వ వైపు చేయి చూపిస్తూ.. స్పృహ తప్పి పడిపోతుంది.
జడ్జి: కానిస్టేబుల్ ఈ అమ్మాయిని హాస్పిటల్‌కు తీసుకెళ్లండి.
అని చెప్పగానే.. కానిస్టేబుల్స్ వచ్చి లిల్లీని తీసుకెళ్తారు.
లాయరు: యువరానర్ ఇప్పటికైనా అర్థం అయిందా… ఆ అమ్మాయి పశ్చాత్తాపంతో ప్రాణాలు పోతున్నా కూడా వచ్చి నిజం చెప్పింది. నా క్లయింట్ నిర్దోషి.
జడ్జి: ఈ కేసులో ఫిర్యాదు చేసిన బాధితురాలే తన ముందస్తు ఆరోపణలు వెనక్కి తీసుకుంటూ ముద్దాయి నిర్దోషి అని ఈ న్యాయస్థానం ముందుంచిన నేపథ్యంలో ఈ కోర్టు అభిప్రాయం ప్రకారం ముద్దాయి చెర్రిపై మోపబడిన ఆరోపణలు స్థిరంగా నిరూపించబడలేదు. కాబట్టి ముద్దాయి చెర్రిని నిర్ధోషిగా పేర్కోంటూ ఈ కోర్టు విడుదల చేయడం అయింది. అదే విధంగా బాధితురాలికి తగిన పోలీస్ రక్షణ కల్పించాలని ఆదేశిస్తూ.. అదే విధంగా ఈ కుట్ర వెనక ఉన్న వ్యక్తులపై బాదితురాలు స్పృహలోకి వచ్చిన తర్వాత తగిన ఆధారాలు సేకరించాలని పోలీస్ శాఖను ఆదేశించడం అయింది.
అంటూ జడ్జి తీర్పు ఇవ్వగానే.. చెర్రి ఎమోషనల్ అవుతూ భూమి వైపు చూస్తూ.. మొక్కుతాడు. వద్దు అన్నట్టు భూమి ఎమోషనల్ అవుతుంది. తర్వాత అందరూ కలిసి హాస్పిటల్‌కు వెళ్తారు. హాస్పిటల్ లో గగన్‌కు బుల్లెట్ తగిలిన చోట ట్రీట్‌మెంట్ చేస్తుంటారు. అందరూ కంగారు పడుతుంటారు. ఇంతలో డాక్టర్ బయటకు వస్తాడు. అందరూ ఎలా ఉందని అడుగుతారు. బ్లడ్ అవసరం ఉందని డాక్టర్ చెప్పగానే.. కేపీ తనది సేమ్ గ్రూప్ అని చెప్పి వెళ్లి బ్లడ్ ఇస్తాడు. బయట నిలబడిన శారద ఏడుస్తుంది.
శారద: భగవంతుడా నా బిడ్డ ఇన్నేళ్లు నన్ను నా కూతురును ప్రాణంగా చూసుకున్నాడు ఇప్పుడు వాడు చావు బతుకుల్లో ఉన్నాడు అవసరం అయితే నా ప్రాణాలు తీసుకో.. నా బిడ్డను బతికించు..
భూమి: బావకు ఏం కాదు అత్తయ్య. జీవితం ఇచ్చిన తండ్రే తన రక్తంతో మళ్లీ తనకు ప్రాణం పోస్తున్నాడు. బావకు తప్పకుండా బాగవుతుంది.
చెర్రి: అవును పెద్దమ్మ అన్నయ్య నిజాన్ని బతికించాలని అనుకున్నాడు. దేవుడు అన్నయ్యను బతికించడా..? తప్పకుండా బతికిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు పెద్దమ్మ.
అంటూ ఓదారుస్తాడు. ఇంతలో కేపీ బ్లడ్ ఇచ్చి బయటకు వస్తాడు.
కేపీ: నాన్నా రండి ఇక్కడ కూర్చోండి..
లోపల డాక్టర్ ఆపరేషన్ చేసి బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తాడు. మీరు వెళ్లి చూడొచ్చు అని చెప్పగానే.. కేపీ బయటే ఉంటాడు. శారద, భూమి, చెర్రి లోపలికి వెళ్తారు. బయటి నుంచి గగన్ ను చూస్తున్న కేపీ ఎమోషనల్ అవుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు






















