అన్వేషించండి

Krishna Mukunda Murari November 27th Episode : ఒకరికి ఒకరు తినిపించుకున్న కృష్ణ మురారి.. రేవతికి షాకిచ్చిన ముకుంద!

Krishna Mukunda Murari Today Episode : కృష్ణను తాను లేనప్పుడు ఎందుకు పిలిచారు అని మురారి భవానినీ నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

krishna mukunda murari serial today Episode : భవాని తనతో మాట్లాడిన మాటలు తలచుకొని కృష్ణ బాధ పడుతూ వస్తుంది. ఇంతలో అక్కడికి మురారి వచ్చి తన పెద్దమ్మ ఏం చెప్పింది అని ప్రశ్నించాడు. కృష్ణ కవర్ చేస్తుంది. అందుకు తన ఫ్యామిలానే అందరూ తన దగ్గర అన్ని దాచేస్తున్నారు అని మురారి బాధ పడతాడు. టిఫిన్ చేయమని తీసుకొస్తాడు. ఈ టిఫిన్ మీరు చేస్తూ ఉండండి నేను ఇంట్లో వాళ్లను అడిగి వస్తానని వెళ్తాడు. 

భవాని: మనసులో .. ఇప్పుడు మరారికి వాడికి అర్థమయ్యేలా అర్థం చేసుకునేలా ఈ విషయాన్ని చెప్పాలి. తప్పదు అనుకున్నా తప్పు అనుకున్నా అబద్ధం చెప్పి తీరాలి. వంద అబద్ధాలు ఆడి అయినా సరే ఓ పెళ్లి చేయమంటారు. వాడి జీవితం బాగు పడటానికి ఒకటి రెండు అబద్ధాలు చెప్పినా పర్లేదు.

రేవతి: అక్కా.. మీరు తీసుకున్న నిర్ణయం సరైందో కాదో ఒక్కసారి ఆలోచించండి అక్క

భవాని: రేవతి నేను ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికే ఎక్కవ ఆలోచిస్తాను తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేయడానికి అస్సలు ఆలోచించను. చూడు రేవతి నీ బాధ నేను అర్థం చేసుకోగలను. వాళ్లిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. నువ్వే కాదు, కృష్ణ మురారి జంట చూసి నేను కూడా మురిసి పోయాను. నందూని ఓ మనిషిని చేసి అది కోరుకున్న వాడితో నన్ను ఎదిరించి వాళ్ల పెళ్లి చేసి నందూ జీవితాన్ని సార్థకం చేసింది. మరి మురారి జీవితాన్ని ఏం చేసింది రేవతి. ఒకసారి ఆలోచించు

రేవతి: మీరు చెప్పినట్లు అన్ని మంచి పనులు చేసిన కృష్ణ కట్టుకున్న భర్త విషయంలో అలా ఎందుకు చేస్తుంది అక్క ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి.

భవాని: ఆలోచించకుండానే ఈ నిర్ణయం తీసుకుంటానా ఒక్క మాట అడుగుతాను రేవతి గుండెల మీద చేయి వేసుకొని సమాధానం చెప్పు. మురారి చనిపోయాడు అని వాడి బాడీని ఎందుకు పంపించినట్లు.. మనం అంటే ప్రాణం ఇచ్చే కృష్ణవేణి మురారి బతికిఉన్నాడు. వాడికి యాక్సిడెంట్ అయిందని మనకు ఎందుకు చెప్పలేదు. రేవతి ముకుంద కనిపెట్టకపోయింటే నీ కొడుకు ఫొటోకి..

రేవతి: అక్కా.. 

భవాని: కదా వినలేకపోయావు కదా మరి ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టిందో చెప్పు 

రేవతి: కానీ నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా అక్కా

భవాని: కొన్ని కొన్ని అంతే రేవతి అది వాళ్ల తప్పు కాదు నమ్మిన మన తప్పు

రేవతి: అవును రేపు మురారికి పెళ్లి అయిన తర్వాత గతం గుర్తొస్తే.

భవాని: అందుకేగా అమెరికా ప్లాన్ క్యాన్సిల్ చేసింది

మురారి: (అప్పుడే అక్కడికి వచ్చి) పెద్దమ్మ వేణిగారిని ఏమైనా అన్నారా అసలు ఎప్పుడూ లేనిది ఎందుకు తనని మన ఇంటికి టిఫిన్‌కు పిలిచారు. నేను లేని టైంలో. అంత రహస్యంగా ఎందుకు పిలవాల్సి వచ్చింది. ఎందుకు తనని బాధ పెట్టాల్సి వచ్చింది. నువ్వైనా చెప్పు అమ్మ వేణి గారిని ఎందుకు పిలిచారు. 

రేవతి: అదీ..

భవాని: నువ్వు ఉండు రేవతి 

మురారి: అదేంటి పెద్దమ్మ అమ్మని చెప్పనివ్వండి

భవాని: నేను చెప్తా అంటున్నా కదా

మురారి: అమ్మని చెప్పనివ్వండి పెద్దమ్మ

భవాని: ఏంటి మురారి ఆర్గ్యూ చేయడానికి ప్రిపేర్ అయి వచ్చినట్టున్నావ్. ఆ వేణిని నేను ఏం అనలేదు. అనాల్సిన అవసరం నాకు లేదు. తను చేసిన దానికి మళ్లీ ఇలా చేయకు అని అన్నాను అంతే. బ్రేక్ ఫాస్ట్ చేయకుండా వెళ్లి పోయింది.

మురారి: నా దగ్గర మీరు ఏదో దాస్తున్నారు

భవాని: అవును మురారి దాస్తున్నాం.. 

మురారి: ఎందుకు దాస్తున్నారు.. దాయాల్సిన అవసరం ఏంటి

భవాని: అవసరం ఉంది మురారి అన్నీ విషయాలు వివరంగా చెప్తా ఒక రెండు రోజులు ఆగు.. అప్పుడు మా పట్ల ఆ వేణి పట్లు నీకు అవగాహన వస్తుంది

మురారి: రెండు రోజులు ఎందుకు ఇప్పుడే చెప్పండి

మరోవైపు ఏసీపీ గారు కోపంగా ఉన్నారు. అక్కడ ఏం జరిగి ఉంటుందా ఏమో అని కృష్ణ, తన పిన్ని టెన్షన్ పడుతుంటారు. ఇక మురారి అక్కడికి రావడంతో ఏం జరిగింది అని కృష్ణ అడుగుతుంది. పెద్ద మేడంతో గొడవ పడ్డారా అని అడుగుతుంది. ఎంత అడిగినా పెద్దమ్మ ఏం చెప్పలేదని.. రెండు రోజులు ఆగమని చెప్పిందని చెప్తాడు

కృష్ణ: మనసులో.. ముకుందతో పెళ్లి అంటే మీరు ఏమైపోతారు సార్. మీరు నన్ను ఇష్టపడుతున్నారు అని తెలుసు. అభిమానిస్తున్నారు అని తెలుసు. ప్రేమిస్తున్నారు అని నాకు తెలుసు. ఈ విషయం నాకు తెలిసేలా మీరు నిత్యం ప్రయత్నిస్తున్నారు అని కూడా నాకు తెలుసు. ఇవన్నీ తెలిసి మీ ముందు మట్టి బొమ్మాలా నిల్చొన్న నేను ఇప్పుడు చేయాల్సింది ఈ పెళ్లి ఆపడం. ఇక ఇద్దరం టిఫెన్ తిందాం అని కృష్ణ మురారిని పిలుస్తుంది. ఇక ఇద్దరూ ఆరుబయట కూర్చొంటే మురారి కృష్ణకు టిఫిన్ తినిపిస్తాడు. కృష్ణ ఎమోషనల్ అవుతుంది. కృష్ణ కూడా మురారికి తినిపిస్తుంది. 

మరోవైపు నందూ తన గదిలో ఏడుస్తుంది. ఇక అప్పుడే గౌతమ్ అక్కడికి వచ్చి ఇంటి నుంచి వెళ్లి పోదానమని అంటాడు. దీంతో నందూ నువ్వు స్వార్థపరుడివి అంటుంది. మనకు ఇంత చేసిన కృష్ణ బాధ పడుతుంటే మనం వెళ్లి పోదాం అని ఎలా అంటావ్ అని అంటుంది. ఇక గౌతమ్ సారీ చెప్పి ఈ పెళ్లి ఎలా అయినా ఆపాలి అని నిర్ణయించుకుంటారు. 

ఇక తన కళ్లముందే తన బిడ్డ జీవితం నాశనం అయిపోతుంటే తాను ఏం చేయలేకపోతున్నా అని రేవతి బాధ పడుతుంది. కృష్ణ ఏ నేరం చేయలేదు అని రుజువు అయిన తర్వాతే ఈ పెళ్లి చేయాలని చెప్పాలి అని నిర్ణయించుకుంటుంది. ఇంతలో ముకుంద అక్కడికి వస్తుంది. 

ముకుంద: నన్ను చూస్తే చంపేయాలి అన్నంత కోపంగా ఉంది కదా అత్తయ్య. ఉంటుంది అత్తయ్య కానీ ఏం చేయలేని పరిస్థితి. మిమల్ని చూస్తేంటే నాకే కాదు ఎవరికైనా జాలిగానే ఉంటుంది.

రేవతి: ఆపుతావా చేసింది అంతా చేసి ఇప్పుడు ఈ నంగనాచి మాటలు మాట్లాడుతున్నావా. 

ముకుంద: నేనేం చేశాను అత్తయ్య మీ అబ్బాయిని ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించడం తప్పా. చెప్పండి

రేవతి: పెళ్లయిని వాడితో 

ముకుంద: అత్తయ్య.. ఎందుకు అత్తయ్య నా చేత పదే పదే నా ప్రేమ కథని చెప్పిస్తారు. చెప్పండి. మురారి పెళ్లి ఒక పెళ్లా .. నా పెళ్లి ఒక పెళ్లా రెండు పెళ్లిలు మైనస్ అత్తయ్య. మీ కొడుకు అదృష్టవంతుడు చావు వరకు వెళ్లి మరో జన్మ ఎత్తాడు. ఆ జన్మలో కృష్ణ మురారి భార్య ఈ జన్మలో మురారినే నా మొగుడు. మళ్లీ కృష్ణతో మురారి ఉండడం ఈ జన్మలో జరగదు గుర్తుపెట్టుకోండి

రేవతి: జరుగుతుంది జరిగితీరుతుంది. 

ముకుంద: ఎలా మీరు అంటే సరిపోదు. దానికి తగ్గ ఆధారం చూపించండి.  ఆ పెద్ద పల్లి ప్రభాకర్.. మురారి మీద మర్డర్ ప్రయత్నం చేసి జైలుకి వెళ్లాడు. ఇక నైనా మనసు మార్చుకొని మా అత్తయ్య చెప్పినట్లు వినండి.  

రేవతి: మా అక్కయ్య ఏం పిచ్చిది కాదు. నువ్వే మా అక్కయ్యను సలహాలు చెప్పి పిచ్చి మాటలు చెప్పి నమ్మంచావు. 

ముకుంద: అంటే ఒకరి చెప్తే వింటుందా మా అత్తయ్య. తనేంటో నాతోపాటు ఈ సిటీలో అందరికీ తెలుసు. అందుకే సిద్ధంగా ఉండాలి. పెళ్లి పనులు ప్రారంభించండి. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today October 29th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని పట్టుకున్న సూరజ్! దీపతో సంతకం పెట్టించేసిన మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని పట్టుకున్న సూరజ్! దీపతో సంతకం పెట్టించేసిన మాలిని!
Jagadhatri Serial Today October 28: స్వాతి కేసులో నేరం తనపై వేసుకున్న కేదార్‌ను అసహ్యించుకున్న కుటుంబం...ధాత్రికి అండగా నిలిచిన కౌషికి,సుధాకర్
జగద్ధాత్రి సీరియల్: స్వాతి కేసులో నేరం తనపై వేసుకున్న కేదార్‌ను అసహ్యించుకున్న కుటుంబం...ధాత్రికి అండగా నిలిచిన కౌషికి,సుధాకర్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి మాటలకు వణికిపోయిన అంబిక! మహా, విహారిలను చంపాలని ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి మాటలకు వణికిపోయిన అంబిక! మహా, విహారిలను చంపాలని ప్లాన్!
Godavari Serial Today October 28th: 'గోదావరి' సీరియల్: జాను మీద నందు అసూయ! ఆఫీస్‌లో కొత్త తలనొప్పి! సంజయ్, జాను షికారు!
'గోదావరి' సీరియల్: జాను మీద నందు అసూయ! ఆఫీస్‌లో కొత్త తలనొప్పి! సంజయ్, జాను షికారు!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget