Krishna Mukunda Murari Serial Today February 14th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్‌లో రచ్చరచ్చ చేసిన రెండు జంటలు, భవాని ఎక్కడ!
Krishna Mukunda Murari Serial Today Episode ముకుంద నిజంగా ఆదర్శ్‌ని ఇష్టపడుతుందా లేదా అని తెలుసుకోవాలని మధు ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Krishna Mukunda Murari Serial Today February 14th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్‌లో రచ్చరచ్చ చేసిన రెండు జంటలు, భవాని ఎక్కడ! krishna mukunda murari serial today february 14th episode written update in telugu Krishna Mukunda Murari Serial Today February 14th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్‌లో రచ్చరచ్చ చేసిన రెండు జంటలు, భవాని ఎక్కడ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/4a8b5b8bd6829060dbe89f88d495fa1e1707875660639882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Krishna Mukunda Murari Today Episode వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరిగే చోటుకి ఆదర్శ్ వస్తాడు. ఆదర్శ్ వేరే లోకంలో ఉన్నాడని మధు అందరికీ చెప్తాడు. దీంతో కృష్ణ పొద్దున్నే మొదలు పెట్టేశారా అని అడుగుతుంది. దీంతో ఆదర్శ్ మొదలు పెడదామనే అనుకున్నాను. కొన్ని పరిస్థితుల్ని ఎదుర్కొవాలి అంటే ధైర్యం కావాలి కదా అంటాడు. అందరూ వింతగా చూస్తారు.
ముకుంద: మనసులో.. ఈయన ఫొటోలు చూసేశారా ఇన్‌డైరెక్ట్‌గా వాటి గురించే మాట్లాడుతున్నారు.
ఆదర్శ్: అదే మీరేదో డ్యాన్స్‌లు, సర్‌ప్రైజ్‌లు అంటున్నారు కదా వాటిని ఫేస్ చేయడానికి ధైర్యం కావాలి అంటున్నాను.
ముకుంద: టాస్క్‌ల కోసం అంటున్నారా.. ఇంకా ఫొటోల కోసమేమో అని భయపడ్డా.
నందూ: సరే కానీ టాస్క్‌లు అంటున్నారు అవేంటో చెప్పండి.
కృష్ణ: మాకు కూడా ఏంటో తెలీదు..
నందూ: తెలీదా అంటే ఇంకా ఏం అనుకోలేదా. మరి అంత ప్లాన్ చేసేసినట్లు సర్‌ప్రైజ్ అన్నారు.
మురారి: ప్లాన్ చేశాం కానీ మేం కాదు టాస్క్‌లు, కాన్సెప్ట్‌లు అన్నీ మధు చెప్తాడు. అవేంటో మాకు కూడా తెలీదు. అదే సర్‌ప్రైజ్.
ప్రసాద్: అయిపోయింది.. ప్రోగ్రాం సర్వనాశనం అయిపోయింది. వీడి మీద నమ్మకం పెట్టుకొని ఎలా ప్లాన్ చేశారురా..
మధు: నాన్న ఇది టూ మచ్.. వీళ్లందరూ నమ్ముతున్నారు కన్న కొడుకుని మీరు నమ్మారా.. సరే కానీ ప్రోగ్రాం కాన్సెప్ట్ ముందు చెప్తే అందరూ ప్రిపేర్ అయిపోతారు. అందుకే అప్పటికప్పుడు చెప్తా అప్పుడే అసలు నిజాలు బయటపడతాయి.
ముకుంద: వీడికి నా మీద ఎప్పటికీ డౌట్ పోయేలా లేదు.
ముందు డ్యాన్స్ ప్రోగ్రాం ఉందని మధు చెప్తాడు. జలజలపాతం సాంగ్ అయితే బాగుంటుంది అని కృష్ణ చెప్తే ఆ పాటకి ముకుంద, ఆదర్శ్‌లు డ్యాన్స్ చేస్తారు అని మధు అంటాడు. ఇక ముకుంద ఆదర్శ్‌లో మురారిని ఊహించుకొని రొమాంటిక్‌గా డ్యాన్స్ చేస్తుంది. దీంతో అందరూ చాలా బాగా చేశారని ఆదర్శ్, ముకుందలను పొగుడుతారు.
తర్వాత కృష్ణ, మురారిలు కళ్లజోడు కాలేజీ పాప సాంగ్‌కు డ్యాన్స్ అదరగొడతారు. తర్వాత భర్త తాగి ఇంటికి వస్తే భార్య రియాక్షన్ ఎలా ఉంటుందో అది చేయమని మధు చెప్తాడు. ఇక ఆదర్శ్ తాగిన వాడిలా యాక్టింగ్ చేస్తాడు. భర్త తాగి వచ్చిన ఏం అనకుండా చక్కగా తిండి పెట్టి జాగ్రత్తగా చూసుకునే భార్యలా ముకుంద అదరగొడుతుంది.
ముకుంద నటన చూసి నిజంగానే మురారిని మర్చిపోయి ఆదర్శ్‌తో సంతోషంగా ఉందా నా అనుమానం నిజం కాదా అని మధు అనుకుంటాడు. డ్యాన్స్ కూడా చక్కగా చేసింది అని ఆదర్శ్ అంటే ఇష్టం లేకపోతే అలా చేయదు అని అనుకుంటాడు. ముకుంద వాళ్ల తర్వాత కృష్ణ, మురారిలు నటిస్తారు. అందులో కృష్ణ గడుసు పెళ్లాంలా టైంకి వస్తాను అని తాగి వచ్చిన భర్తని పట్టించుకోని భార్యలా నటిస్తుంది. తాగొచ్చిన భర్తకు భార్య సరిగా పట్టించుకోకుండా తిండి కూడా పెట్టకుండా బయట తిని రమ్మని చెప్తే ఆ భర్త పరిస్థితి ఏంటో అనే మురారి నటన ఆకట్టుకుంటుంది. ఇద్దరి నటన చాలా నవ్వుతెప్పిస్తుంది. ఇక ఎవరు బాగా చేశారని భవాని మధు అడిగేలోపు భవాని కనిపించకుండా పోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)