అన్వేషించండి

Karthika Deepam Idi Nava Vasantham Serial October 30th: కార్తీకదీపం 2 సీరియల్: దీప, కార్తీక్‌ల వ్రతం గురించి తెలుసుకొని తాడో పేడో తేల్చుకోవడానికి పరుగులు తీసిన జ్యోత్స్న!

Karthika Deepam 2 Serial Today Episode దీప కార్తీక్‌లు పక్కపక్కన కూర్చొని వ్రతం చేయడం జ్యోత్స్న విషయం తెలుసుకొని గుడికి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

 Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప కార్తీక్ దగ్గరకు వెళ్లి వ్రతం ఆపమని చెప్తుంది. కొత్త పెళ్లి కూతురిలా మీ పక్కన కూర్చొని వ్రతం చేయను అంటుంది. దానికి కార్తీక్ భర్తలా సాయం చేయాలా శ్రేయాభిలాషిలా చేయాలా అంటాడు. దానికి దీప శ్రేయాభిలాషి అనుకొని వచ్చానని అంటుంది. దానికి కార్తీక్ నేను ఏం చేసినా శౌర్య కోసమే అని అంటాడు. గతంలో మీ నాన్న తీసుకోవాల్సిన బాధ్యత నా చేతిలో పెట్టి వెళ్లారని అంటాడు. ఇంతలో శౌర్య రావడంతో పట్టుపరికినిలో అందంగా ఉన్నావని శౌర్యని ముద్దాడుతాడు.

ఇక అనసూయ దీపని రెడీ అవ్వమని చెప్తుంది. అన్నీ గదిలో పెట్టానని చెప్తుంది. కార్తీక్ దీపని వెళ్లి రెడీ అవ్వమంటాడు. వ్రతం చీరలో వస్తే వ్రతం చేస్తా వేరే చీరలో వస్తే వ్రతం ఆపేస్తా అంటాడు. దీప గదిలోకి వెళ్లి అక్కడ పట్టు చీర నగలు, పువ్వులు చూసి ఆశ్చర్యపడుతుంది. ఇక అవన్నీ పెట్టుకొని అలంకరించుకొని కిందకి వస్తుంది. కార్తీక్ దీపని అలా చూసి చాలా సంతోషిస్తాడు. వచ్చి కార్తీక్ పక్కన నిల్చొంటుంది. అందరూ కారు దగ్గరకు వెళ్తారు. నీకు మీ అమ్మకి దిష్టి తీయాలని కార్తీక్ అంటాడు. దీపకి థ్యాంక్స్ చెప్తాడు. కాంచన, కావేరిలు దీపని చూసి చాలా అందంగా ఉందని అనుకుంటారు. ఇక కావాలనే కాంచన దీపని ముందు కూర్చొమంటుంది. దీప కూర్చొంటుంది. ఇక కార్తీక్ దీప దగ్గరగా వెళ్లి సీటు బెల్ట్ పెడతాడు. పారిజాతం జ్యోత్స్నతో దీప, కార్తీక్‌ల వ్రతం గురించి చెప్తారు. అందరూ వాళ్లని భార్యభర్తలుగా అనుకుంటారని అంటుంది. 

జ్యోత్స్న: అందరి సంగతి అటు ఉంచు దీప వ్రతానికి ఒప్పుకుంది అంటే బావని భర్తగా అంగీకరించినట్లే కదా. మరి ఆరోజు మన ఇంటికి వచ్చి నేను అమాయకురాలిని అని ఓవర్ చేసింది. ఈ వ్రతం ఎలా చేస్తారో తేల్చేస్తా అయితే దీప అయినా ఉండాలి లేదంటే ఈ జ్యోత్స్న అయినా ఉండాలి. అని ఆవేశంగా గుడికి వెళ్తుంది.

పారిజాతం ఇంట్లో వాళ్లకి దీప, కార్తీక్‌లకు వ్రతం జరుగుతుందని తెలిసి వాళ్లతో గొడవ పడటానికి వెళ్తుందని చెప్తుంది. దాంతో అందరూ గుడికి బయల్దేరుతారు. దీప వాళ్లు గుడికి చేరుకుంటారు. నేను నీకు భర్తలాగే ఉంటాను దీప అని కార్తీక్ అనుకుంటాడు. పంతులు అంతా సిద్ధం చేస్తాడు. కాశీ వాళ్లు కూడా వస్తారు. దీప, కార్తీక్‌లు ఇద్దరూ దీపాలు పెట్టి పీటల మీద కూర్చొంటారు. కార్తీక్ తాను బొట్టుపెట్టుకొని దీప నుదిటిన కుంకుమ పెడతాడు. ఇద్దరూ ఒకరికి ఒకరు కంకణాలు కట్టుకుంటారు. ఇద్దరి మధ్యలో కూర్చొంటానని శౌర్య వెళ్తే కార్తీక్ తన పక్కన శౌర్యని కూర్చొపెట్టుకుంటాడు. పూజ ప్రారంభమైంది. దీప కాంచన వైపు చూస్తే దానికి కాంచన అనసూయతో ఇచ్చిన మాట ప్రకారం వ్రతంలో కూర్చొన్నాను మామయ్య గారు ఇంకా రాలేదు ఏంటా అని నా కోడలు చూపులతో అడుగుతుంది అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సంజయ్ చెంప పగలగొట్టిన సత్య.. దెబ్బకు మాయం.. ఫుల్ జోష్‌లో క్రిత్య!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS family property dispute: విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
Kaleshwaram Case: కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?
కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?
Andhra Pradesh News: ఉమ్మడి ఆస్తులైతే ఎంవోయూపై ఎందుకు సంతకాలు చేశారు? విజయమ్మను ప్రశ్నించిన వైసీపీ- యాగీ చేస్తున్నారని షర్మిలపై ఫైర్
ఉమ్మడి ఆస్తులైతే ఎంవోయూపై ఎందుకు సంతకాలు చేశారు? విజయమ్మను ప్రశ్నించిన వైసీపీ- యాగీ చేస్తున్నారని షర్మిలపై ఫైర్
Telangana News: పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, దశలవారీగా అన్నీ మంజూరుకు రెడీ
పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, దశలవారీగా అన్నీ మంజూరుకు రెడీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP DesamNara Lokesh Met Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో లోకేశ్ భేటీ | ABP DesamKerala CM Convoy Accident | సీఎం పినరయి విజయన్ కు తృటిలో తప్పిన ప్రమాదం | ABP Desamవిజయ్‌ పైన కూడా ఏసేశారుగా! తలపతికి పవన్ చురకలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS family property dispute: విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
Kaleshwaram Case: కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?
కాళేశ్వరం కేసు కేసీఆర్ దగ్గరకు - నేడో రేపో పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ?
Andhra Pradesh News: ఉమ్మడి ఆస్తులైతే ఎంవోయూపై ఎందుకు సంతకాలు చేశారు? విజయమ్మను ప్రశ్నించిన వైసీపీ- యాగీ చేస్తున్నారని షర్మిలపై ఫైర్
ఉమ్మడి ఆస్తులైతే ఎంవోయూపై ఎందుకు సంతకాలు చేశారు? విజయమ్మను ప్రశ్నించిన వైసీపీ- యాగీ చేస్తున్నారని షర్మిలపై ఫైర్
Telangana News: పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, దశలవారీగా అన్నీ మంజూరుకు రెడీ
పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, దశలవారీగా అన్నీ మంజూరుకు రెడీ
Weather Updates: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు
మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP Desam
మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP Desam
IND v NZ 3rd ODI Highlights: స్మృతీ మందాన అద్భుత శతకం, న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం - 2-1తో సిరీస్ కైవసం
స్మృతీ మందాన అద్భుత శతకం, న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం - 2-1తో సిరీస్ కైవసం
Tirumala News: నవంబర్ 9న యూరప్ లో వేడుకగా శ్రీనివాస కళ్యాణాలు ప్రారంభం
నవంబర్ 9న యూరప్ లో వేడుకగా శ్రీనివాస కళ్యాణాలు ప్రారంభం
Embed widget