అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today November 12th: కార్తీకదీపం 2 సీరియల్: నా దేవుడు నాకు తాళి కట్టాడు నీకు బాధ ఏంటి? కార్తీక్, దీపలకే శౌర్య పుట్టిందన్న జ్యోత్స్న! 

Karthika Deepam 2 Serial Today Episode రిసెప్షన్ దగ్గరకు జ్యోత్స్న వచ్చి శౌర్య తల మీద కార్తీక్‌తో ఒట్టు వేయించి దీప, కార్తీక్‌లకు ముందే సంబంధం ఉందని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్, దీపల రిసెప్షన్‌కు జ్యోత్స్న, పారిజాతం వస్తారు. మోసం చేశావని జ్యోత్స్న కార్తీక్ మీద విరుచుకుపడుతుంది. నేను ఏం మోసం చేశానని కార్తీక్ అడిగితే కార్తీక్ చేయి శౌర్య తల మీద వేసి నేను అడిగిన దానికి నీ కూతురి మీద ఒట్టు వేసి నిజం చెప్పు అని అంటుంది. 

జ్యోత్స్న: మీరిద్దరూ నాకు చేసిన మోసం అందరికీ తెలియాలి. నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను చెప్పు బావ. దీప నేను నీకు పరిచయం చేయడానికి ముందే నీకు దీప తెలుసా. 
పారిజాతం: మనసులో మనవడా పడ్డావురా గోతిలో.
జ్యోత్స్న: చెప్పు బావ. ఇది నీ కన్న కూతురు కాకపోయినా అంత కంటే ఎక్కువ అని నాకు తెలుసు. అందుకే దీని మీద ఒట్టు వేయించాను. నిజం చెప్పు బావ దీపకు నీకు ముందే పరిచయం ఉందా లేదా.
కార్తీక్: ఉంది. (అందరూ షాక్ అయిపోతారు) అయితే ఏంటి. నువ్వు నాకు పరిచయం చేయడానికి  ముందే దీప నాకు తెలుసు అయితే ఏంటి.
జ్యోత్స్న: విన్నావా అత్త ఈ విషయం నీకు తెలియకపోయి ఉంటుంది. నేను పుట్టుక ముందే బావ నా భర్త అన్నారు. పెళ్లికి నిశ్చితార్థానికి ఇలా అన్నింటికీ ముహూర్తం పెట్టారు. రెండు రోజుల్లో పెళ్లి అనగా ఆగిపోయింది ఎందుకో మీకు తెలుసా ఈ దీప వల్లే. నేను పరిచయం చేసిన మనిషి మీదే ఇంత ప్రేమ ఉంటే చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన నా మీద ఇంకెంత ప్రేమ ఉండాలి అనుకున్నాను. అప్పుడు తెలిసింది దీప మెడలో నువ్వు ఊరికే తాళి కట్టలేదు బావ మీ ఇద్దరికీ సంబంధం ఉంది. అందుకే లండన్ నుంచి రాగానే నేనుగా ముత్యాలమ్మ గూడెం వెళ్లావు అని మొత్తం చెప్తుంది. 

శౌర్యని తీసుకొని అనసూయ వెళ్లిపోతుంది. తండ్రి లాగే కొడుకు కూడా అని శ్రీధర్ రెండో పెళ్లి గురించి పారిజాతం మాట్లాడుతుంది. పెళ్లాం కొడుకు ఉన్నారని తెలిసి మనసిచ్చి తాళి కట్టించుకున్నావు నీదో పెళ్లి అని తిడుతుంది. దాంతో స్వప్న, కాశీ అందరూ పారిజాతం మీద పడతారు. పిలవకుండా వచ్చావ్ పో అని కాశీ అంటే నువ్వు ఎవడ్రా మమల్ని పొమ్మనడానికి అని జ్యోత్స్న అరుస్తుంది. అక్కా అని కాశీ అంటే అలా పిలవొద్దని చెప్తుంది. నీ పెళ్లానికి రెండో పెళ్లి దాన్ని దాని మొగుడు వదిలేయలేదా అని పారు అంటే దానికి జ్యోత్స్న వదిలేయలేదు గ్రానీ తనని పెళ్లి చేసుకోవడానికి నీ మనవడే దగ్గరుండి విడాకులు ఇప్పించాడని అంటుంది.

నన్ను కాదని దీప మెడలో తాళి ఎలా కట్టావ్ అని జ్యోత్స్న అడిగితే ఇదంతా అడగటానికి నువ్వు ఎవరు అని కార్తీక్ అడుగుతాడు. దాంతో మరదలు పిల్ల నువ్వు తాళి కట్టని భార్యని నీ చేతిలో మోసపోయిన ఆడపిల్లనని చెప్తుంది. నన్ను నువ్వు ఇష్టపడటం పెళ్లి చేసుకోవాలి అనుకోవడం దీపకి ఇష్టం లేదని అంటుంది. అందుకే దీప ఈ నాటకం ఆడిందని అంటుంది. నేను తాళి కట్టినప్పుడు మీ ఇంట్లో వాళ్లకి ఒప్పించి కడతాను అన్న నువ్వు దీప మెడలో ఎలా తాళి కడతావు అని అడుగుతుంది. మరోవైపు సుమత్ర కూడా రిసెప్షన్‌కి వస్తుంది. 

దీప నీ మనసు మార్చింది బావ అని జ్యో అంటుంది. శౌర్యని కూడా మా బావతో కనుంటావని జ్యో అంటే దీప జ్యో చెంప పగల గొడుతుంది. సుమిత్ర గారు తనకు ఆశ్రయం ఇచ్చారని తిండి పెట్టారని అంటుంది దీప. కార్తీక్ నాకు ముందే తెలిస్తే తప్పు ఏంటి సుమిత్రమ్మ ఎంతో కార్తీక్ అంతే అంటుంది. కార్తీక్ బాబు నీకు బావ అయితే నాకు దేవుడని నా దేవుడు నాకు తాళి కట్టాడని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: ‘కార్తీకదీపం2’ సీరియల్: రిసెప్షన్‌ కు వచ్చిన జ్యోత్స్న, పారిజాతం – కార్తీక్‌ ను అవమానించిన జ్యోత్స్న

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Port Issue News: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
Earthquake In Hyderabad List: 50ఏళ్లలో  హైదరాబాద్ పరిధిలో ఏర్పడ్డ అతి పెద్ద భూకంపం ఇదే - ఇప్పటి వరకు వచ్చిన భారీ భూకంపాల లిస్ట్
50 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదే. ఇంతకు ముందు వచ్చింది ఎక్కడంటే..
RGV on Pushpa 2 Ticket Rates: తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్
తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలు
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలంతెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలుPolice Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Port Issue News: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
Earthquake In Hyderabad List: 50ఏళ్లలో  హైదరాబాద్ పరిధిలో ఏర్పడ్డ అతి పెద్ద భూకంపం ఇదే - ఇప్పటి వరకు వచ్చిన భారీ భూకంపాల లిస్ట్
50 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదే. ఇంతకు ముందు వచ్చింది ఎక్కడంటే..
RGV on Pushpa 2 Ticket Rates: తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్
తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలు
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలు
Janasena warning Pushpa 2: పుష్ప 2 అడ్డుకుంటాం.. అల్లు అర్జున్ కి జనసేన నేత వార్నింగ్!
పుష్ప 2 అడ్డుకుంటాం.. అల్లు అర్జున్ కి జనసేన నేత వార్నింగ్!
Chandra Babu Land : అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
Naga Chaitanya Sobhita Wedding LIVE: చైతూ - శోభిత పెళ్లి... అంగరంగ వైభవంగా ముస్తాబైన అన్నపూర్ణ స్టూడియో - మీకు ఈ విషయాలు తెలుసా?
చైతూ - శోభిత పెళ్లి... అంగరంగ వైభవంగా ముస్తాబైన అన్నపూర్ణ స్టూడియో - మీకు ఈ విషయాలు తెలుసా?
Sukhbir Singh Badal News: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
Embed widget