Karthika Deepam 2 Serial Today March 7th: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రితో ఎంగిలి ప్లేట్లు కడిగించిన కార్తీక్.. ఫుల్ కామెడీ.. రొమాన్స్!!
Karthika Deepam 2 Serial Today Episode శివన్నారాయణ ఇంట్లో ఎవరికీ తెలీకుండా లాయర్ని పిలిపించి ఆస్తి పంపకాల వీలునామా రాయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కావేరి, శ్రీధర్‌లు కార్తీక్ రెస్టారెంట్ తింటారు. కార్తీక్ తండ్రితో నేను నా ఫ్యామిలీ వాళ్లకి బిల్ వేయను మా చిన్నమ్మ బిల్ వద్దని నీ బిల్ సగం కట్టమని కార్తీక్ చెప్తాడు. కడతానే నాకేం అవసరం లేదని శ్రీధర్ ఫోన్ కోసం చూస్తే ఫోన్ ఉండదు. కావేరికి కట్టమని అంటే శ్రీధర్ తిక్క కుదర్చాలి అని నేను ఇంటి దగ్గరే ఫోన్ మర్చిపోయా అని అబద్ధం చెప్తుంది.
దీప: పర్లేదులేండీ తర్వాత ఇవ్వండి.
కార్తీక్: ఏం మాట్లాడుతున్నావ్ దీప. ఇలాగేనా బిజినెస్ చేసేది. ఇలా డబ్బు లేదు అన్నవాళ్లని వదిలేస్తే మనం 40 లక్షలు ఎలా సంపాదించేది చిన్నమ్మ బాకీ ఎలా తీర్చేది.
శ్రీధర్: ఓహో బిజినెస్ ఎలా రన్ అవుతుందని నేను ఇంతకు ముందు అన్న మాటలు నాకే అప్పగిస్తున్నావా. ఈ డబ్బులు నువ్వు మాకు ఇవ్వాల్సిన డబ్బుకి వడ్డీలో కట్ చేసుకో.
కార్తీక్: మేం డబ్బు ఇవ్వాల్సింది చిన్నమ్మకి.
శ్రీధర్: ఎవరు ఇస్తే ఏంటి.
కార్తీక్: ఆ మాట చిన్నమ్మతో చెప్పమను.
శ్రీధర్: చెప్పవే.
కావేరి: ఆ డబ్బుకి ఈయనకు ఏం సంబంధం లేదు. అలాగే ఈ బిల్లుకి నాకు ఏం సంబంధం లేదు. ఎలా వసూలు చేసుకుంటారో మీరే చేసుకోండి.
శ్రీధర్: ఓసేయ్ 620 కోసం మొగుడితో ఏం సంబంధం లేదు అనడం పెద్ద క్రైమే.
కార్తీక్: ఏంటి చిన్నమ్మ మీద అరుస్తున్నావ్. ఆవిడ మా గెస్ట్.
శ్రీధర్: అంటే నేను వేస్టా.
కార్తీక్: ఇదే నీకు బెస్ట్.
శ్రీధర్: నా దగ్గర డబ్బులు లేవురా.
కార్తీక్: డబ్బులు కట్టే వెళ్లాలి మాస్టారూ.
శ్రీధర్: లేవురా నేను కట్టనురా.
కార్తీక్: కట్టాలి అంతే
కావేరి: కట్టకపోతే ఈయనతో ప్లేట్లు కడిగిస్తారా ఏంటి.
శ్రీధర్: ఓసేయ్ ఓసేయ్ నా స్థాయి ఎంటనుకున్నావే నాకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా చిటికె వేస్తే పీఎం కూడా నా ముందు ఉంటారే. సీన్ కట్ చేస్తే శ్రీధర్ ప్లేట్లు కడుగుతుంటే కావేరి, కార్తీక్ నవ్వుకుంటారు. దీప వద్దని అంటుంది. నా స్థాయి ఏంటి నాతో ఇలా ఎంగిలి ప్లేట్లు కడిగిస్తారా. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చావడం అంటే ఇదేరా. ఇద్దరు పెళ్లాలు ఉన్నారు. కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు, కోడలు ఉన్నారు అయినా ఇదేం బతుకురా నాది. ఏంట్రా ఇది.
కార్తీక్: బాకీ తీర్చాలి మాస్టారు. ప్లేటుకి రూపాయి.
శ్రీధర్: అంటే నేను 620 కడగాలా నా వల్ల కాదు.
కార్తీక్ కుదరదు అని మొత్తం కడగాలి అంటాడు. ఇంతలో కావేరి నవ్వుతూ రాని పని చేయమంటే ఎలా కార్తీక్ అని అంటుంది. నువ్వే అసలైన పెళ్లానివే అని శ్రీధర్ అంటాడు. ఇంతలో కావేరి ఆయనకు కూరగాయలు కట్ చేయడం బాగా వచ్చు అంటుంది. దాంతో శ్రీధర్ నువ్వేం పెళ్లానివే అంటాడు. సీన్ కట్ చేస్తే శ్రీధర్ కూరగాయలు కట్ చేస్తూ ఇక జీవితంలో నీ రెస్టారెంట్‌కి రానురా అంటాడు. వస్తే పర్లేదు బిల్ కట్టకపోతేనే ప్రాబ్లమ్ అని కార్తీక్ అంటాడు. దీప ఇక చాలు అంటే కార్తీక్ తండ్రితో మాస్టారూ ఇక చాలు మేడం చెప్పారు అని అంటాడు. దాంతో శ్రీధర్ నాకు టైం వస్తే ఈ సార్ మేడం పని చెప్తా అని అంటాడు.
కావేరి వెళ్తూ మీ ఇద్దరి ఇలాగే సంతోషంగా ఉంటూ కలిసి కష్టపడండి ఏం సాయం కావాలి అన్నా నన్ను అడగండి అంటుంది. ఇక శ్రీధర్ వచ్చి సెటైర్లే వేస్తే కార్తీక్ దీప గురించి పొగుడుతాడు. తన భార్య గురించి నోరు పారేసుకోవద్దని అంటాడు. ఇక చిన్నమ్మని ఇంటికి రమ్మని అంటాడు. శివన్నారాయణ లాయర్‌ని పిలిచించి వీలునామా రాయిస్తాడు. ఇప్పుడు ఈ అప్పగింతలు ఏంటి అని లాయర్ అంటాడు. దాంతో శివన్నారాయణ ఇక అప్పగింతలు చేసేయాలి ఎన్నాళ్లు నేను ఆస్తి పెట్టుకుంటా అంటాడు. ఇక పారిజాతం చాటుగా వినాలి అనుకుంటుంది. శివన్నారాయణ లోపలికి వస్తే పారు దాక్కుంటుంది. పెద్దాయన కనిపెట్టేస్తాడు. లాయర్‌తో ఏం మాట్లాడారు అంటే నీతో విడాకులు కావాలి అని చెప్పానని అంటాడు. ఈ వయసులో విడాకులు ఏంటి నాలో మీకు ఏం నచ్చలేదు అంటే నీ సెంటు నాకు నచ్చలేదు ఈ కంపు నేను భరించలేక విడాకులు ఇస్తున్నా అంటాడు. పెళ్లాం కొట్టిన సెంటు నచ్చలేదని ఇలా విడాకులు ఇస్తారా అని పారు ఏడుస్తుంది. పెద్దాయని ఇంకా నటిస్తాడు. విడాకులు పేపర్లు మీద సంతకం పెట్టమని అంటాడు. ముసలి మొగుడు నా జీవితం నాశనం చేసేశాడు అని పారు ఏడుస్తుంది. సీన్ భలే కామెడీగా ఉంటుంది.
కార్తీక్, దీపలు ఇంటికి వస్తారు. మున్సిపాలిటీ వాళ్లకి ఇవ్వాల్సిన కాగితాలు గురించి దీప అడిగితే కార్తీక్ బీరువాలో కాగితాలు తీస్తే ఇంతలో దీప చిన్న నాటి ఫొటో కింద పడిపోతుంది. కార్తీక్ కంగారుగా తీస్తే దీప ఏంటని అడుగుతుంది. ఎవరి పొటో నన్ను చూడనివ్వండి అని అడుగుతుంది. చూడకూడదు అని చిన్నతనంలో నా ప్రాణాలు కాపాడిన నా ప్రాణ దేవత ఫొటో అని అంటాడు. దీప షాక్ అయిపోతుంది. ఫొటో చూపించమంటే మనిషి దొరికితే తీసుకొచ్చి నీ ముందు పెడతా అంటాడు. దీప కార్తీక్ తనని ఆటపట్టిస్తున్నాడని అనుకొని ఫొటో అడుగుతుంది. ఇక దీప కార్తీక్ వెంట పడుతూ ఇద్దరూ బెడ్ మీద పడిపోతారు. దీప కార్తీక్ మీద పడిపోయాను అని మర్చిపోయి ఫొటో కోసమే కార్తీక్ చేతులు పట్టుకొని లాగుతుంది. తర్వాత చూసి లేచి సారీ చెప్తుంది. నాకేం దెబ్బలు తగల్లేదు అని కార్తీక్ అంటాడు. ఇక దీప ఫొటో గురించి అడిగితే కార్తీక్ ఇవ్వను అంటాడు. తన ప్రాణ దాతని అందరి కంటే ముందు నీకే చూపిస్తా నువ్వే చూస్తావని అంటాడు. కార్తీక్‌లో ఏదో మార్పు కనిపిస్తుందని రెండు రోజుల్నుంచి ఆటపట్టిస్తున్నాడని ఆలోచిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్ టెన్షన్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

