అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today March 6th: కార్తీకదీపం 2 సీరియల్: శ్రీమతితో రెస్టారెంట్‌ లో బాబు సరసాలు.. ఫుల్లుగా తినేసి.. కార్తీక్‌కి బుక్కైన తండ్రి శ్రీధర్!  

Karthika Deepam 2 Serial Today Episode దీప, శౌర్యలను తానే చంపాలని ప్రయత్నించానని జ్యోత్స్న నానమ్మతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప తానే చిన్ననాటి ప్రాణ దాత అని చెప్పకపోవడంతో కార్తీక్ కూడా చెప్పడు. తాను కూడా చెప్పకుండా ఆట పట్టించి అల్లరి చేసి నీ అంతట నువ్వే నేనే నీ ప్రాణ దాతని కార్తీక్ బాబు అని చెప్పేలా చేస్తాను అని ఈ రోజు నుంచి నాలో కొత్త కార్తీక్‌ని చూస్తావు దీప అని అనుకుంటాడు. మరోవైపు జ్యోత్స్న దీప వార్నింగ్ గుర్తు చేసుకొని గజగజ వణికిపోతూ ఉంటుంది.  

జ్యోత్స్న: దీప సాక్ష్యాలు తీసుకొస్తే దీపేంటి మా అమ్మే నన్ను కొట్టి జైలులో పెట్టేలా ఉంది.
పారిజాతం: జ్యోత్స్న నువ్వేంటే ఏదో తప్పు చేసిన దానిలా గదిలో కూర్చొన్నావ్. మొత్తానికి  మీ అమ్మ దీపకి గట్టిగా బుద్ధి చెప్పింది. మీ అమ్మ దీప ఇద్దరూ ఒకలాంటి వాళ్లేనే సైలెంట్‌గా ఉంటారు కానీ కోపం వస్తే పోలేరమ్మలే.
జ్యోత్స్న: మరి తల్లి పోలిక కూతురికి రాకుండా ఉంటుందా. 
పారిజాతం: ఏమన్నావ్
జ్యోత్న్న: ఏం లేదు.
పారిజాతం: అమ్మో మీ అమ్మ లేకపోయి ఉంటే నిన్ను చంపేసేదే. ఆధారాలు తెస్తా అనింది నువ్వేమైన చేస్తే కదా తేవడానికి.
జ్యోత్స్న: చేశాను ఇంటికి వచ్చి దీప చెప్పింది నిజమే. పారిజాతం బిత్తర పోతుంది. కానీ ఆధారాలు దొరవు గ్రానీ. ఈ ఇంట్లో దీప నా స్థానం తీసుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా. తల్లీ కూతుళ్లని ఇద్దరినీ లేపేయాలి అనుకున్నా కానీ బావ వచ్చి కాపాడేశాడు. 
పారు: ఈ ఇంట్లో దీప నీ స్థానం లాక్కోవడం ఏంటే.
జ్యోత్స్న: మళ్లీ నోరు జారానా. ఈ ఇంట్లో కాదు ఆ ఇంట్లో కోడలిగా నా స్థానం తీసుకుంది కదా. దీప పక్కనుంటే బావ ఎప్పుడూ జీరో అవ్వాలి. అంతే..
పారు: నీకు మళ్లీ చెప్పాను ఇప్పుడు చెప్తున్నా కార్తీక్‌ని వదిలేయ్ పెళ్లి చేసుకో అప్పుడు ఈ ఆస్తి నీ పేరున రాస్తారు. అప్పుడు నీ పగ తీర్చుకోవచ్చు.
జ్యోత్స్న: మనసులో నాకు దీప మీద ఉంది పగ మాత్రమే కాదు గ్రానీ భయం కూడా అది ఎక్కడ అసలైన వారసురాలని బయట పడుతుందో అనే భయం. దీప వారసురాలు అని తెలిస్తే నా బతుకు రోడ్డున పడుతుంది. అలా జరగనివ్వను. దాని కోసం ఏమైనా చేస్తా. అందుకు దాసుని ఈ భూమ్మీద లేకుండా చేయాలి.

కార్తీక్‌ కోసం దీప కొత్త షర్ట్ తీసుకొస్తుంది. ఎందుకు అని కార్తీక్ అడిగితే మీరు రెస్టారెంట్‌కి వెళ్తున్నారు కదా ఒంటి మీద బట్టలు చూసే విలువ ఇస్తారని పెద్ద పెద్ద వాళ్లు వస్తారు కాబట్టి వేసుకోమని అంటుంది. కార్తీక్ వద్దు అంటే నా కోసం వేసుకోమని అంటుంది. దాంతో కార్తీక్ ఈ మాట అన్నావ్ బాగుంది నా శ్రీమతి నా కోసం ప్రేమగా ఇస్తే ఎందుకు వేసుకోను ఇప్పుడే వేసుకుంటా అని వేసుకుంటాడు. దీప చూసి మురిసిపోతుంది. ఎలా ఉన్నాను అని కార్తీక్ అడిగితే శౌర్య సూపర్‌గా ఉందని అంటుంది. దీప మాత్రం చూస్తూ ఉండిపోతుంది. పాప దీపతో అలా చూడకమ్మా నాన్నకి దిష్టి తుగులుతుందని అంటుంది. మీ అమ్మ చూపు దిష్టి చూపు కాదులే అని కార్తీక్ అంటాడు. ఇక శౌర్య లాకెట్ అడిగితే కార్తీక్ తీసుకొచ్చి లాకెట్ వేస్తాడు. ఇక శౌర్య నీ ప్రాణ దాత కనిపించిందా అంటే నా ముందే ఉందని అంటాడు. దీప కంగారు పడుతుంది. ఇక శౌర్య తను ఎలా ఉంటుందో చెప్పు అని అడుగుతుంది. మీ అమ్మలా ఉంటుందని కార్తీక్ అంటాడు. దీప కంగారు పడుతుంది. కార్తీక్ బాబుకి ఏమైంది అని అనుకుంటుంది. ఇంతలో స్కూల్ బస్ రావడంతో శౌర్యని డ్రాప్ చేస్తా అని దీప కంగారుగా తీసుకెళ్తుంది. మరోవైపు కార్తీక్ రెస్టారెంట్‌కి శ్రీధర్ కావేరిని తీసుకొస్తాడు. ఇక్కడేం గొడవ చేయొద్దని కావేరి బతిమాలుతుంది. కార్తీక్ వాళ్లని చూసి దీపకి  చెప్తాడు దీప పలకరిస్తుంది.

శ్రీధర్: షర్ట్ బాగుంది.
కార్తీక్: మా ఆవిడ సెలక్షన్.
శ్రీధర్: ఆవిడ సెలక్షన్ బాగుంది కానీ నీదే బాలేదు.
కార్తీక్: దీప చిన్నమ్మని కూర్చొపెట్టి ఆయన ఎందుకు వచ్చారో కనుక్కోని పంపేయ్. 
శ్రీధర్: నేను వచ్చింది చందా కోసం కాదు మీరు నాకు 40 లక్షలు ఇచ్చాం కాదా సంవత్సరంలో తిరిగి ఇవ్వాలి అంటే బిజినెస్ ఎలా అవుతుందో చూడటానికి వచ్చాం. అలాగే మేం ఇప్పుడు కస్టమర్లం తినడానికి వచ్చాం.
దీప: అమ్మ కూర్చొండి.
కావేరి: అమ్మ కాదు చిన్నత్తయ్య అని పిలువు.
శ్రీధర్: పిలమ్మా నీ పిలుపుల వర్షంలో తడిచిపోవడానికి ఎడారి దిబ్బలా ఎదురు చూస్తుంది.
కార్తీక్: తినడానికి వచ్చానన్నావ్ కూర్చొంటే పెడతాం. 
దీప: మీకేం కావాలో చెప్పండి నేను చిన్నత్తయ్యగారికి  ఏం కావాలో నేను తెస్తా.
శ్రీధర్: మీ చిన్నత్తకి స్పెషలా నాకు అవే తగలెట్టండి.
కార్తీక్: దీప చిన్నమ్మనిచూసుకో.
దీప: అలాగే బాబు మీరు వెళ్లండి.
కావేరి: బాబు ఏంటి కార్తీక్ నీ భర్త కదా ఏవండీ అని పిలు. 
శ్రీధర్: వంట మనిషి కదా ఆవిడ స్థాయి తనకు తెలుసులే. నా కొడుకు చదువుకి అందానికి స్థాయికి జ్యోత్స్న లాంటి అమ్మాయి రావాలి. ఏం చేస్తాం రాసుకున్న వాళ్లకి రాసుకున్నంత. 
కావేరి: ఇక ఆపుతారా. పాపం దీప కంట తడి పెట్టుకుందండి.

దీప కావేరి వాళ్లకి దగ్గరుండి వడ్డిస్తుంది. కావేరి శౌర్యని తీసుకొని దీపని రమ్మంటే దీపే కావేరిని రమ్మనిఅంటుంది. ఇక మేనేజర్ వచ్చి మీరు ఏంటి మేడం వడ్చిస్తున్నారు అని అంటే శ్రీధర్ అతని మీద సీరియస్ అవుతాడు. నేను ఎవరో తెలుసా అని నా గురించి తెలుసుకో అంటే మీ గురించి ఎవరికీ తెలుసు అని కౌంటర్ వేస్తాడు. ఇక దీప వడ్డిస్తే కావేరి వద్దు అంటే తన పని అదే కదా ఇప్పుడు ఆ పని నా కొడుకుకి నేర్పించిందని అంటాడు. ఇక శ్రీధర్ దగ్గరకు బిల్ ఇస్తారు. కార్తీక్ తన ఫ్యామిలీకి రెస్టారెంట్‌లో ఫ్రీ అని కావేరి బిల్లు వద్దని శ్రీధర్‌కి సగం డబ్బులు కట్టమని అంటాడు. శ్రీధర్ ఫోన్ మర్చిపోయి వస్తాడు. కావేరికి కట్టమని అంటే భర్త పొగరు దించాలని ఫోన్ లేదు అనేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్‌ టెన్షన్!

టాప్ హెడ్ లైన్స్

Vishnu Priya Bhimeneni: సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదు... వెళ్ళి చదువుకోమ్మా - విష్ణుప్రియ కామెంట్స్ వైరల్
సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదు... వెళ్ళి చదువుకోమ్మా - విష్ణుప్రియ కామెంట్స్ వైరల్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ వంటలకు విహారి ఇంట్లో ప్రశంసలు..! కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి లక్ష్మీ మాస్టర్ ప్లాన్!
TV Actor Arrested: మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
మైనర్ బాలికపై వేధింపులు... పోక్సో కేసులో టీవీ యాక్టర్‌ అరెస్ట్
Vanana Brundha: మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు
మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు షిఫ్ట్.. మేఘసందేశం వందన రియల్ లైఫ్ విషయాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Embed widget