అన్వేషించండి

Karthika Deepam 2 Serial July 3rd: కార్తీకదీపం 2 సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్.. శౌర్యని ఎత్తుకుపోయిన నర్శింహ, కార్తీకే శౌర్య తండ్రి అని చెప్పిన డాక్టర్!

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శౌర్యని ఎత్తుకుపోవడానికి నర్శింహ దీప ఇంటికి రావడం నర్శింహ మీదకు దీప గొడ్డలి తీసుకొని వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam 2 Serial Episode రెస్టారెంట్‌లో దీప వింతగా ప్రవర్తించింది అని తనలో ఓ కొత్త దీపని చూశాను అని జ్యోత్స్న పారిజాతంతో చెప్తుంది. తను కార్తీక్‌ని పెళ్లి చేసుకోవడం దీపకు ఇష్టం లేదు అని అంటుంది. మామయ్య ఎందుకో పక్కకు వెళ్లాడని, దీప మామయ్యతో మాట్లాడిందని తర్వాత దీప వచ్చిందని మామయ్య రాలేదు అని స్వప్న తన తల్లితో వచ్చిందని వాళ్లని దీప వెళ్లిపోమని చెప్పిందని చెప్తుంది. అయినా దీపనే తన బావ సపోర్ట్ చేశాడని చెప్తుంది. 

పారిజాతం: మనసులో.. దీపకి ఈ పెళ్లి ఇష్టం లేకపోవడానికి నీ బావకి తనకి ఇంతకు ముందు ఉన్న సంబంధమే కారణం మనవరాలా. అది చెప్తే నువ్వేం చేస్తావో అని నేను చెప్పడం లేదు. కానీ జరిగేది చూస్తుంటే నేను చెప్పకుండానే నువ్వు తెలుసుకున్నట్లు ఉన్నావ్ అలా జరగడానికి వీల్లేదు.
జ్యోత్స్న: అడుగుతుంటే మాట్లాడవు ఏంటి గ్రానీ.
పారిజాతం: ఏం మాట్లాడాలి మనవరాలా. నవ్వు డేంజర్‌లో ఉన్నావ్. వీలైనంత త్వరగా నీకు మీ బావకి నిశ్చితార్థం జరిపించేయాలి. 
జ్యోత్స్న: బావతో నా ఎంగేజ్‌మెంట్‌కి ముందే దీప ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి.
పారిజాతం: దీప వెళ్లిపోవాలి అంటే దీప ఊహించని తట్టుకోలేని సంఘటన ఏదో జరగాలి.  

దీప హోటల్‌లో తమని వెళ్లిపోమని చెప్పడం గుర్తు చేసుకొని కావేరి ఫీలవుతుంటుంది. స్వప్న తల్లికి సారీ చెప్తుంది. అనవసరంగా అక్కడికి తీసుకెళ్లానని బాధపడుతుంది. ఆ రెస్టారెంట్ మా బాస్‌ది అని ఆయన మీద దీప పెత్తనం ఏంటో తెలీడం లేదని అంటుంది. ఇక స్వప్న కార్తీక్‌ ఫ్యామిలీలో ఏదో జరుగుతుందని అంటుంది. ఇక దీప పెత్తనం ఏంటి అని అసలు దీప ఏమవుతుందని కార్తీక్‌ని అడగాలి అని అందుకు కార్తీక్ ఇంటికి వెళ్లాలని స్వప్నఅనుకుంటుంది. మరోవైపు దీప శౌర్యని పడుకోపెట్టి రెస్టారెంట్‌లో జరిగినదంతా తలచుకుంటుంది. అనవసరంగా శ్రీధర్‌ సమస్యలో ఇరుక్కున్నాను అని ఫీలవుతుంది. ఇక శౌర్యని చూసి నీ తల్లి నీకు ఏ కష్టం రానివ్వదమ్మా అనుకుంటుంది. ఇక నర్శింహ దీప ఇంటికి ఎవరూ చూడకుండా వస్తాడు. దీప కిచెన్‌కి వెళ్లగానే కార్తీక్ దీప ఇంట్లోకి వెళ్తాడు. 

నర్శింహ శౌర్యని ఎత్తుకొని వెళ్లిపోవాలి అనుకుంటాడు. ఇక దీప డోర్ పెట్టేస్తుంది. బెడ్ మీద చూసే సరికి శౌర్య ఉండదు. దీంతో వాష్ రూమ్‌కి వెళ్లిందేమో అని బయట చూస్తుంది. అక్కడ కూడా శౌర్య కనిపించకపోవడంతో గదిలోకి వస్తుంది. అక్కడ నర్శింహ శౌర్యని ఎత్తుకోవడం చూసి షాక్ అరుస్తుంది. నర్శింహ నేను నా కూతుర్ని తీసుకెళ్తున్నా అని చెప్పి పాపని పట్టుకొని బయటకు పరుగులు తీస్తాడు. దీప కూడా నర్శింహ వెనక పరుగెడుతుంది. నర్శింహ దగ్గర పాపని లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. శౌర్యని నిద్ర లేపుతుంది. కంగారుగా నిద్ర లేచిన శౌర్య నర్శింహని చూసి భయంతో బూచోడు అని ఏడుస్తుంది. ఇక దీప పాపని తీసుకొని గొడ్డలితో నర్శింహ మీదకు వెళ్తుంది. దాంతో నర్శింహ వెళ్లిపోతాడు. ఇక శౌర్య కళ్లు తిరిగి పడిపోతుంది. దీప పాపని పపట్టుకొని ఏడుస్తుంది. జ్యోత్స్న చూసి శౌర్యకి ఏమైందని అనుకుంటుంది. ఇక దీప పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. శౌర్యకి డాక్టర్ ఇంజక్షన్ వేస్తారు. శౌర్య కార్తీక్ కార్తీక్ అని కలవరించడంతో డాక్టర్ కార్తీక్ తన తండ్రి అనుకొని పాప తండ్రిని పిలవమని దీపతో చెప్తాడు. దీప కార్తీక్‌కి కాల్ చేసి విషయం చెప్తుంది. కార్తీక్ హాస్పిటల్‌కి వస్తాడు. కార్తీక్ రావడంతో శౌర్య కళ్లు తెరుస్తుంది. నువ్వు వెళ్లిపోతే బూచోడు మళ్లీ వస్తాడు వెళ్లిపోవద్దని అంటుంది. కార్తీక్‌ శౌర్యని పడుకోమని చెప్తాడు. దాంతో పాప నేను పడుకున్న తర్వాత వెళ్లిపోవద్దని కార్తీక్‌తో చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: హాసినికి తిలోత్తమ వింత కానుక.. హారం వేసుకుంటే గాయత్రీదేవే ఆ పాప అని చెప్తేస్తుందా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Balakrishna : 'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Balakrishna : 'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Indonesian Hindu Religious Rights : ఏ ముస్లిం దేశంలో హిందువులకు అత్యధిక స్వేచ్ఛ లభిస్తుంది? ఆలయం ఏర్పాటు నుంచి ఈ విషయాల వరకు మినహాయింపు!
ఏ ముస్లిం దేశంలో హిందువులకు అత్యధిక స్వేచ్ఛ లభిస్తుంది? ఆలయం ఏర్పాటు నుంచి ఈ విషయాల వరకు మినహాయింపు!
Year Ender 2025: ఎన్టీఆర్‌తో పాటు 2025లో అదరగొట్టిన యాంటీ హీరోలు... బాలీవుడ్‌లో విలన్స్‌లకు సపరేట్ ఫ్యాన్‌ బేస్
ఎన్టీఆర్‌తో పాటు 2025లో అదరగొట్టిన యాంటీ హీరోలు... బాలీవుడ్‌లో విలన్స్‌లకు సపరేట్ ఫ్యాన్‌ బేస్
Vijayawada Crime News: విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
విజయవాడలో దారుణం: పది రూపాయల కోసం ప్రాణం తీసిన మైనర్‌!
Embed widget