అన్వేషించండి

Karthika Deepam 2 August 21st: కార్తీకదీపం 2 సీరియల్: ఈసారి డైరెక్ట్‌గా కార్తీక్, జ్యోత్స్నల పెళ్లే.. స్వప్న లవర్ కాశీకి యాక్సిడెంట్ అండగా దీప!

Karthika Deepam 2 Today Episode స్వప్న లవర్ కాశీకి యాక్సిడెంట్ కావడం దీప అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లడం స్వప్న వీడియోలో ఆ విషయం తెలుసుకొని దీపకి కాల్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కార్తీక్ జ్యోత్స్న ఇంట్లో అందర్ని పిలిచి జ్యోత్స్నతో ఎంగేజ్ మెంట్ అవసరం లేదని అంటాడు. అందరూ షాక్ అవుతారు. కార్తీక్ జ్యోత్స్నతో పెళ్లి వద్దన్నాడని అనుకుంటారు. 

కార్తీక్: నువ్వు విన్నది నిజమే అత్త నిశ్చితార్థం వద్దు ఎందుకంటే మనకు అది కలిసి రావడం లేదు అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. ఇక నిశ్చితార్థానికి ముహూర్తం వద్దు ఏకంగా పెళ్లికే పెట్టండి.

కార్తీక్ మాటతో అందరూ చాలా సంతోషిస్తారు. జ్యోత్స్న దీప మాటలు గుర్తు చేసుకొని హ్యాపీగా ఫీలవుతుంది. నువ్వు హ్యాపీనేనా అని కార్తీక్ పారుని అడిగితే పారు సంతోషంతో నిన్ను ఎత్తుకొని తిప్పాలన్న సంతోషంగా ఉందని పారు అంటుంది. దానికి శౌర్య నువ్వు నన్నే ఎత్తుకోలేవు ఇక కార్తీక్‌ని ఏం ఎత్తుకుంటావని అంటుంది. కార్తీక్ అందరికీ చెప్పి శౌర్యని హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. దీప గుడికి వెళ్తానని అంటుంది. ఇక పారిజాతం కూడా తనకి మొక్కులున్నాయని జ్యోత్స్నని తీసుకొని గుడికి బయల్దేరుతుంది.

ఇక స్వప్న లవర్ కాశీ ఇంటర్వ్యూకి బయల్దేరుతాడు. స్వప్న కాశీ దగ్గరకు వెళ్తుంది. గుడికి వెళ్లి వచ్చానని బొట్టు పెడుతుంది. ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలని చెప్తుంది. స్వప్నని ఎదురు రమ్మని కాశీ చెప్తే స్వప్న వద్దని ఏమైనా అయితే తానే ఫీలవుతానని అంటుంది. కాశీ పర్లేదు నువ్వు నా లక్ అని అంటాడు. ఇక కాశీ స్వప్నతో నువ్వు ఎదురైతే నాకు యాక్సిడెంట్ అయి చనిపోతానా అంటే స్వప్న ఏడుస్తుంది. నీకు ఏమైనా అయితే నేను చనిపోతా అని అంటుంది. ఇక కాశీ స్వప్నని ఓదార్చి ఎదురు రమ్మని చెప్పి వెళ్తాడు. మరోవైపు జ్యోత్స్న, పారిజాతాలు కారులో గుడికి వెళ్తుంటారు. 

ఇక పారిజాతం మనసులో ముందు జ్యోత్స్న కార్తీక్‌లకు పెళ్లి అయిపోతే తర్వాత తన కొడుకు దాసు నీకు తండ్రి అని చెప్పి వాడిని నీకు దగ్గర చేస్తానని అనుకుంటుంది. అప్పుడు తన కొడుకు జీవితం తాను అనుకున్నట్లు దశరథ్‌ జీవితంలా దర్జాగా బతుకుతాడని అనుకుంటుంది. ఇక జ్యోత్స్న తన ఫ్రెండ్‌ దగ్గరకు వెళ్తానని చెప్తుంది. పారిజాతాన్ని పార్లర్ దగ్గర దింపుతానని అంటుంది. మరోవైపు కాశీకి రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. తలకు పెద్ద దెబ్బ తగిలి ఇబ్బంది పడతాడు. జ్యోత్స్న వాళ్లు అటుగా వస్తారు. అక్కడున్న వారు జ్యోత్స్నకి సాయం అడుగుతారు. జ్యోత్స్న తన కారు పాడవుతుందని వద్దని అంటుంది. పారు ఒప్పించినా వద్దని అంటుంది. అందరూ జ్యోత్స్నని ఛీ కొడతారు. ఇంతలో దీప అటు ఆటోలొ వచ్చి యాక్సిడెంట్ చూస్తుంది. దీప కాశీని తన ఆటోలో ఎక్కించుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. ఇక ఓ వ్యక్తి జ్యోత్స్న మాటలు దీప సాయం ఇవన్నీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు.

కార్తీక్, శౌర్యలు ఉన్న హాస్పిటల్‌కే దీప కాశీని తీసుకొని వస్తుంది. కార్తీక్ వాళ్లు దీపని చూస్తారు. ఇక డాక్టర్ యాక్సిడెంట్ కేసు తీసుకోనని అంటే నేను అతని బాధ్యత తీసుకుంటానని దీప అంటుంది. కార్తీక్ కూడా డాక్టర్‌కి ట్రీట్మెంట్ చేయమని అంటాడు. మరోవైపు జ్యోత్స్న తన ఫ్రెండ్స్‌ని కలిసి పెళ్లి గురించి చెప్తుంది. ఇక స్వప్న కాశీ గురించి ఆలోచిస్తుంది. ఇంటర్వూ అయిపోయిందా లేదా అనుకుంటుంది. ఇక రీల్స్ చూస్తుంది అందులో కాశీకి యాక్సిడెంట్ అయినట్లు ఉన్న వీడియో చూస్తుంది. దీప సాయం చేయడం చూసి గ్రేట్ అనుకుంటుంది. ఇక కాశీని చూసి ఏడుస్తుంది. దీపకి కాల్ చేస్తుంది. నువ్వు కాపాడిన వ్యక్తికి ఎలా ఉందని అడుగుతుంది. కంగారు పడుతుంది. దీప గాయాలు తగిలాయని ఆపరేషన్ అవుతుందని చెప్తుంది. ఇక దీప దగ్గర స్వప్న డిటైల్స్ తీసుకొని బయల్దేరుతుంది.  ఈ అబ్బాయి గురించి స్వప్న ఎందుకు అంత కంగారు పడుతుందని దీప అనుకుంటుంది. హాస్పిటల్‌లో అందరూ వీడియో చూసి దీపని వింతగా చూస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: తవ్వకాల్లో నిధిని సొంతం చేసుకున్న నయని.. మిగతా అందరికీ షాక్‌ కొడుతుందేంటి?

టాప్ హెడ్ లైన్స్

Anil Ravipudi: అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!
Family Stars Season 2 - ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2: ఈటీవీలో సుధీర్ ఈజ్ బ్యాక్ - టైమింగ్స్ నుంచి మెంటార్స్ వరకు... ఫుల్ డీటెయిల్స్
Eknath Harika New House : కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget