Karthika Deepam 2 Serial Today April 4th: కార్తీకదీపం 2 సీరియల్: నువ్వే నా ప్రాణదాతవి.. నా జీవితం.. దీపతో సీన్ రీక్రియేట్ చేసి నిజం చెప్పిన కార్తీక్!
Karthika Deepam 2 Serial Today Episode దీపని కార్తీక్ గుడికి తీసుకెళ్లి ప్రాణదాత నువ్వే అని నిజం చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ దీపని ఓదార్చుతాడు. ఎవరి కోసం నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావో వాళ్లు బాగానే ఉన్నారు కానీ నువ్వు బాధ పడుతున్నావ్ నిన్ను చూసి నేను బాధ పడుతున్నా అని కార్తీక్ అంటాడు. దానికి దీప వాడిని నేను వదలను. ఈ రోజు వాళ్లకి నా గొంతులో బాధ అర్థం కాలేదు.. కానీ ఏదో ఒక రోజు నా నిజాయితీ నిరూపించుకుంటాను అని దీప అంటుంది.
గౌతమ్ వెనక ఎవరైనా ఉన్నారా..
అలాంటి వెదవని వదలకూడదని కానీ నిరూపించే ప్రయత్నంలో నువ్వు మాటలు పడుతున్నావని నా భయం అని కార్తీక్ అనుకుంటాడు. ఇదంతా గౌతమ్ చేశాడా లేక దీని వెనక ఎవరైనా ఉన్నారా అని అనుకుంటాడు. ఇక దీప దగ్గరకు వెళ్లి మనల్ని రేపు సత్యరాజ్ గారు పిలిచారని అంటాడు. రెస్టారెంట్‌కి వెళ్దామని దీపని పిలిస్తే రాను అని చెప్తుంది. ఇప్పటికీ రాను అని చెప్తుంది.
ఇదేంటి కొత్తగా..
నేను ఇక ఎప్పటికీ రాను కార్తీక్ బాబు. మీరు ఇకపై ఒక్కరే వెళ్లాలి. మీరు అలవాటు చేసుకోండి. మీరు మీ లక్ష్యంలో ముందుకు వెళ్తున్నారు నేను భారం అవ్వాలి అనుకోవడం లేదు మీరు వెళ్లండి అని అంటుంది. నువ్వు రావాలి అంతే అని కార్తీక్ అంటే నేను రాను దీప అంటుంది. ఈ రోజు తాతయ్య గారు వచ్చారు. రేపు పారు, తర్వాత జ్యోత్స్న వచ్చి గొడవ చేస్తారు అని దీప అంటుంది. మీరు నా పక్కన లేకపోతే నేను మనస్శాంతిగా ఉండలేను అని అంటాడు. నేను మీ జీవితంలో లేకపోతేనే మీరు సంతోషంగా ఉంటారు. నాకు తెలీదా మీరు జాలితో నన్ను పెళ్లి చేసుకున్నారు. మీ మూడు ముళ్లు నాకు వేయకుండా ఉంటే మీ జీవితం మీరోలా ఉండేది అని దీప చెప్తుంది.
నన్ను దూరం పెట్టండి..
మీరు గెలవాలి కార్తీక్ బాబు. మీ అమ్మగారి ఆత్మ గౌరవం పెంచాలి. ఈ బాటసారిని వీలైనంత దూరం పెట్టండి. నేను ఎప్పుడైతే మీకు దూరం అవుతానో అప్పుడే మీకు మిగతా వారంతా దగ్గరవుతారు. ప్రేమగా దగ్గరవుతారు. దీప అనే మనిషి కేవలం మీ నీడలో బతికే ఒక సాధారణ మనిషి మాత్రమే. కార్తీక్ దీపని తీసుకొని వెళ్తూ కొన్నింటికి ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడే చెప్పాలి అని గుడికి తీసుకెళ్తాడు.
ఆవిడే నా ప్రాణదాత..
ఏంటి అలా చూస్తున్నావ్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాననా.. నీకు ఇక్కడే సమాధానం చెప్పాలి. ఇక్కడే ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు నాకు ఇక్కడే ఒకమ్మాయి కాపాడింది. నా ప్రాణ దాతని నీకు చూపించాలని తీసుకొచ్చా. నా ప్రాణదాత నాకు దొరికింది. నీ భర్త ప్రాణాలు కాపాడిన ప్రాణ దాత చూసు దీప అని నీటిలో దీప ముఖం చూపిస్తాడు. దీప షాక్ అయి కన్నీరు పెట్టుకుంటుంది. నా ప్రాణదాత నువ్వే అని నాకు తెలుసు దీప. దీప అక్కనుంచి వేరే దగ్గరకు పారిపోతుంది. కార్తీక్ వెనకాలే వెళ్లి నీకు ఎప్పుడు తెలిసిందో చెప్పనా ఈ లాకెట్ గురించి నీకు నేను చెప్పినప్పుడు. నీ చిన్నప్పటి ఫొటో చూసి అనసూయ గారిని అడిగితే నాకు నిజం తెలిసిందని చెప్తాడు.
సంతోషంలో దీప..
మీకు విషయం చెప్పాలి కానీ ఇప్పుడు కాదు అని నువ్వు అన్నప్పుడు నాకు తర్వాత గుర్తొచ్చింది. మా తాత మీద గెలిచినప్పుడు చెప్తాను అన్నావు. తర్వాత అర్థమైంది నువ్వు కావాలని బయట పడలేదని నాకు అర్థమైంది. నీలాగే నేను నీతో దాగుడు మూతలు ఆడాను. నా ప్రాణదాతే నా భార్య అయింది అని చాలా సంతోషపడ్డా. ఇప్పుడు చెప్పు దీప ఏ దేవుడు కలపకుండానే మనం కలిశామా.. నన్ను కాపాడినప్పుడు నీ లాకెట్ ఎందుకు పడిపోవాలి. అది నా దగ్గరకే ఎందుకు రావాలి. ఏ బంధం లేకపోతే మీ నాన్న గారి కారణంగా ఎందుకు కలవాలి. ఏ బంధం లేకపోతే నువ్వు మా అత్త ప్రాణాలు కాపాడి ఆ ఇంటికే ఎందుకు రావాలి. నేను ఎందుకు నీ భర్తని అవ్వాలి ఎందుకంటే మనది భగవంతుడు కలిపిన బంధం కాబట్టి. నా కంటూ ఓ జీవితం ఉంది అది నీతోనే ఉంది. నా గెలుపు నీతోనే ఉంది. నీ మర్యాద కూడా నేనే కాపాడుతాడు. నా జీవిత ప్రయాణంలో నువ్వు బాటసారివి కాదు నా భాగస్వామివి. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రి కాలర్ పట్టుకున్న కార్తీక్.. శ్రీధర్ చెప్పిన నిజం.. దీప మాయం!



















