Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today April 23rd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: అన్న మర్డర్ వెనుక అంబిక హస్తం ఉందా.. విహారికి తెలిసిన రహస్యం ఏంటి?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి తండ్రి మర్డర్ గురించి విహారికి తెలియడం అంబిక చెమటలు పట్టేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి తండ్రి హరికృష్ణది యాక్సిడెంట్ కాదని ఎవరో ప్లాన్ ప్రకారమే చంపారని పెద్ద పెద్ద వాళ్లు ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి తమతో కేసు ఎంక్వైరీ చేయనివ్వకుండా ఆపేశారని లక్ష్మీతో రిటైర్డ్ పోలీస్ చెప్తారు. ఇప్పుడు విహారికి కూడా ప్రమాదం పొంచి ఉందని లక్ష్మీతో చెప్తారు. ఇప్పుడు విహారిని అలర్ట్ చేయాలని విహారి దగ్గరకు వస్తున్నా అని లక్ష్మీతో ఆయన చెప్తారు.
విహారి గారు మీ కోసం ఎవరో వచ్చారు..
విహారి చేతుల మీదగా ఇంట్లో హరికృష్ణ ఆబ్దికం జరుగుతుంటుంది. లక్ష్మీ ఇంటికి వచ్చి హరికృష్ణ గారి ఆబ్దికం జరుగుతుందని చెప్తుంది. దాంతో ఆయన బయట వెయిట్ చేస్తానని చెప్తాడు. ఇక లక్ష్మీ లోపలికి వెళ్లి పూజ సామాగ్రి ఇస్తుంది. ఇక లక్ష్మీ విహారి దగ్గరకు వెళ్లి మీ నాన్న గారికి తెలిసిన వాళ్లు వచ్చారు బయట వెయిట్ చేస్తున్నారు అని చెప్తుంది. లక్ష్మీ విహారి దగ్గరకు వెళ్లి చెప్పడం చూసిన సహస్ర కోపంతో రగిలిపోతుంది.
లక్ష్మీ చేయి కాల్చేసిన సహస్ర..
లక్ష్మీ పాలు తీసుకురావడానికి కిచెన్‌కి వెళ్తే సహస్ర వెనకాలే వెళ్తుంది. సహస్ర స్టవ్ వెలిగించి లక్ష్మీ చేయి కాల్చేస్తుంది. నీకు ఎన్ని సార్లు చెప్పాలే నా బావకి దూరంగా ఉండాలి అని వినవా మా బావతో గుసగుసలు చెప్తున్నావ్ అంత అవసరం నీకు ఏంటే అని లక్ష్మీ చేయి కాల్చేస్తుంది. లక్ష్మీ ఏడుస్తుంది. అదంతా చూసిన అంబిక సహస్ర ఏంటి ఇంత వైలెంట్‌గా తయారైంది అనుకుంటుంది. కాలిన చేతితోనే లక్ష్మీ పాలు తీసుకొని వెళ్తుంది. అంబిక సహస్ర దగ్గరకు వచ్చి సడెన్‌గా ఈ మార్పు ఏంటి అని అడుగుతుంది.. అది తప్పు చేసింది శిక్ష వేశానని సహస్ర అంటుంది. ఇక అంబిక తాను చెప్పనిదే ఏం చేయని సహస్ర ఇలా సొంతంగా చేస్తుంది ఏంటా అనుకుంటుంది.
లక్ష్మీ వల్ల కాలిపోయిన లగ్నపత్రిక..
లక్ష్మీ ఆవుపాలు తీసుకొచ్చి ఇస్తుంది. ఆబ్దికం తర్వాత పద్మాక్షి అన్నయ్య ఫొటోకి దండం పెడుతూ అన్నయ్య నీ కొడుకుకి నా కూతురికి పెళ్లి ఇదే కదా నువ్వు కోరుకున్నది.. సహస్రని చూపించి నీ మేనకోడలే నీ కోడలు అవుతుంది. త్వరలో వీళ్లకి పెళ్లి చేస్తున్నా ఇద్దరికీ ఏ ఆటంకం కలగకుండా నువ్వే చూసుకోవాలి అని లగ్న పత్రిక తెప్పించి అన్నయ్య ఫొటో ముందు పెట్టిస్తుంది. పంతులు ఆ లగ్నపత్రిక పెడతారు. ఇక లక్ష్మీకి పాలు తీసుకెళ్లమని చెప్పడంతో లక్ష్మీ కూర్చొవడంతో తన చేయి తగిలి దీపం లగ్నపత్రిక మీద పడుతుంది. లగ్నపత్రిక కాలిపోతుంది.
లక్ష్మీని కొట్టిన పద్మాక్షి..
కాదాంబరి ఏంటే ఈ అపశకునం అంటుంది. ఇక పద్మాక్షి లక్ష్మీని లాగిపెట్టి కొడుతుంది. నా కూతురి పెళ్లి అంటే కళ్లలో నిప్పులు పెట్టుకుంటున్నావ్ కావాలనే లగ్నపత్రిక కాల్చేశావ్ కదా అని కొడుతుంది. విహారి ఆపమని అంటే నువ్వు దానికి వత్తాసు పలకకు అని తిడుతుంది. ఈ పెళ్లి జరగాలి అని మనం కోరుకుంటే పెళ్లి ఆపాలి అనుకున్న వాళ్లని ఇంట్లో పెట్టి మేపాల్సి వస్తుందని కాదాంబరి అంటుంది. ఈసారి ఏ ఆటకం లేకుండా పెళ్లి జరగాలి అని మేం అనుకుంటే ఇది ఇలా చేస్తుందని అంటుంది. ఇక సహస్ర అయితే ఎవరు ఎన్ని చేసినా నా పెళ్లి మాత్రం బావతోనే జరుగుతుంది. లక్ష్మీ పాపాన అదే పోతుందని సహస్ర అంటుంది. లక్ష్మీని వెళ్లిపోమని నువ్వేం చేయాలి అనుకుంటున్నావో అన్నీ చేయ్ అని అంటుంది.
ఈ నగ తీసుకొని వెళ్లిపో లక్ష్మీ..
లక్ష్మీ గదిలోకి వెళ్లి కాలిన చేయి పట్టుకొని ఏడుస్తుంది. ఇంతలో వసుధ లక్ష్మీ దగ్గరకు వెళ్లి ఓ బంగారు గొలుసు ఇస్తుంది. ఇది నాకు ఎందుకు అని వసుధ అంటే ఇక్కడ ఉంటే నీకు చెంప దెబ్బలు తిట్లు తప్ప ఇంకేం ఉండదు. ఈ నగ నీ ఖర్చులకు అవుతాయి. వెళ్లిపో ఏదో చేసుకొని బతుకు అని అంటుంది. నేను వెళ్లను అని లక్ష్మీ అంటుంది. దానికి వసుధ నీ చదువుకి టాలెంట్‌కి మంచి ఉద్యోగం వస్తుంది వెళ్లిపో లక్ష్మీ అని చెప్తుంది. ఇంతలో యమున అక్కడికి వస్తుంది. లక్ష్మీ చేతి గాయం చూసి యమున మందు రాస్తాను అంటుంది. ఈ పెళ్లి జరిగే వరకు వాళ్లు ప్రతీదీ బూతద్దంలో పెట్టి చూస్తారు ఈ పెళ్లి అయితే టెన్షన్ ఉండదు అని అంటుంది. ఇక లక్ష్మీకి ఈ పెళ్లి జరుగుతుందా అని అడుగుతుంది. ఇంతలో పద్మాక్షి పిలవడంతో యమున వెళ్లిపోతుంది.
మీకో రహస్యం చెప్పాలి..
విహారి ఆ రిటైర్డ్ ఆఫీసర్‌తో మాట్లాడుతారు. మీ నాన్న యాక్సిడెంట్‌లో చనిపోలేదు అదో ప్రీ ప్లాన్‌డ్ మర్డర్ అని అంటాడు. విహారి షాక్ అయిపోతారు. అంబిక చాటుగా వింటుంది. లక్ష్మీ అక్కడే ఉంటుంది. ఇందులో ఎవరో పెద్దవాళ్లు ఉన్నారని అసలు ఎంక్వైరీ కూడా చేయించలేదని అంటారు. అంబిక చెమటలు పట్టేస్తుంది. విహారి ఆయనకు ఈ విషయం మీద ఎంక్వైరీ చేయమని మీకు సాయం చేస్తానని అంటాడు. మీ నాన్నని చంపిన దాని ప్రకారం చూస్తే మీకు ముప్పు ఉందని జాగ్రత్త చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఇక నుంచి నువ్వు దేవా భార్యవి.. ఈ ఇంటి చిన్న కోడలివి.. ఓర్నీ ఇదంతా కలా!





















