Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today April 18th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీ భర్తే విహారి అని తెలుసుకున్న డిటెక్టివ్.. పార్టీలో మోడ్రన్ మహా'లక్ష్మీ'
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ పార్టీలో మోడ్రన్‌లా తయారవ్వడం అంబిక కోపంతో లక్ష్మీని ఫూల్‌లో తోసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode డిటెక్టివ్ సూర్యకాంతం కనకం ఇంట్లోకి వెళ్తుంది. మరోవైపు విహారి పార్టీ మొదలు పెడతారు. విహారి లక్ష్మీ కోసం వెయిట్ చేస్తాడు. లక్ష్మీ గురించి అడుగుతారు. లక్ష్మీ రాదు అని సహస్ర అనుకుంటుంది. ఇంతలో లక్ష్మీ పాత లంగావోణిలోనే వస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. అందరూ వింతగా చూస్తారు.
మోడల్‌ని మించిపోయిన లక్ష్మీ..
లక్ష్మీ వచ్చి తనకు ఆ డ్రస్ నచ్చలేదని అంటుంది. అందరూ లక్ష్మీని సెటైర్లు వేస్తారు. ఫ్యాషన్ లేని ఈమెను లీడ్ చేశారని అందరూ అనుకున్నట్లు సహస్ర ఊహించుకొని నవ్వుకుంటుంది. కానీ సహస్ర ఊహల్ని తలకిందుల చేస్తూ లక్ష్మీ అదిరిపోయే మోడల్‌లా ఎంట్రీ ఇస్తుంది. విహారి చూస్తూ ఉండిపోతాడు. సహస్ర, అంబిక షాక్ అయిపోతారు. లక్ష్మీ వచ్చి పార్టీ స్టార్ట్ చేద్దామా అంటుంది. విహారి లక్ష్మీని డ్రస్ చాలా బాగుంది అంటాడు. ఇక విహారి లక్ష్మీని కేక్ కట్ చేయమని అంటాడు. లక్ష్మీ, విహారి ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తారు. దాంతో సహస్ర చాలా హర్ట్ అయిపోతుంది.
హర్ట్ అయిన సహస్ర..
లక్ష్మీ, విహారిలు సంతోషంగా ఒకరికి ఒకరు కేక్ తినిపించుకొని పండగలా సెలబ్రేట్ చేసుకుంటే పాపం సహస్ర డల్ అయిపోతుంది. ఇంతలో విహారికి కాల్ వస్తుంది. జాన్ తమ ప్రాజెక్ట్ ఓకే చేశాడని అందరితో విహారి గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటాడు. ఇక మన ప్రొడక్స్ లాంచ్ చేసి మార్కెటింగ్ చేసుకోవాలని చెప్పి లక్ష్మీకి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్తాడు. లక్ష్మీ, విహారిల చనువు చూసి సహస్ర ఫీలవుతుంది.
లక్ష్మీ, విహారిల పెళ్లి ఫొటో చూసేసిన డిటెక్టివ్..
డిటెక్టివ్ ఫోన్‌ని గౌరీ బియ్యంలో పెడుతుంది. డిటెక్టివ్‌కి మంచి నీరు ఇచ్చి మాట్లాడుతుంది. తన ఫ్రెండ్ని వెతుక్కుంటూ ఇచ్చానని చెప్తుంది. తన పేరు లక్ష్మీ అని చెప్పడంతో ఇక్కడ చాలా మంది లక్ష్మీలు ఉన్నారని గౌరీ చెప్తుంది. ఫోన్ బాగైతే లక్ష్మీ ఫొటో చూపించు నాకు అందరూ తెలుసు అని చెప్తుంది. ఇక గౌరీ నా కూతురు ఉంది తనని పెళ్లి అయిపోయిందని కూతురి గొప్పలు చెప్తుంది. ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత గౌరీ ఫోన్ ఇస్తుంది. ఫోన్ ఆన్ అవుతుంది. డిటెక్టివ్ లక్ష్మీ ఫొటో గౌరీకి చూపించాలని తీసి అక్కడే విహారి, లక్ష్మీల పెళ్లి ఫొటో చూసి బిత్తరపోతుంది. గౌరీకి మంచి నీరు తీసుకురమ్మని చెప్పి ఆ ఫొటోని ఫొటో తీస్తుంది. గౌరీ వచ్చేసరికి డిటెక్టివ్ వెళ్లిపోతుంది.
పార్టీలో సరదాగా ఆటలు..
పార్టీలో సరదాగా ఆటలు ఏర్పాటు చేస్తారు. చిట్టీలో ఏం వస్తే అదే చేయాలని అంటారు. ముందు లక్ష్మీకి చిట్టీ తీయమని అంటారు. లక్ష్మీకి పాట పాడాలని వస్తుంది. దాంతో లక్ష్మీ ఒక చిన్న లేడీ కూన సింహాల బోనులోనా అని ఓ ఏడుపు పాట పాడుతుంది. ఆ పాటకు విహారి తన పెళ్లి గుర్తు చేసుకుంటాడు. ఇక తర్వాత విహారి చిట్టీ తీస్తాడు. అందులో విహారి ఫస్ట్ క్రష్ ఎక్స్‌పీరియన్స్ చెప్పమంటారు. విహారి తనకు చాలా మంది ఆడ వాళ్ల ఫ్రెండ్స్ ఉన్నారని ఎవరూ కొత్తగా కనిపించలేదని ఇండియా వచ్చి ఒక ఊరు వెళ్లాను అక్కడ ఒక అమ్మాయిని చూశాను అని లక్ష్మీ గురించి చెప్తాడు. సహస్ర తానే అనుకొని మురిసి పోతుంది.
లక్ష్మీని తోసేసిన అంబిక.
సహస్ర తన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటా అని వెళ్లిపోతుంది. అంబిక వెనకాలే వెళ్తుంది. ఇక యమున అత్త, వదినల మాటలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. యమున విహారికి కాల్ చేస్తుంది. తల్లి టెన్షన్ చూసి విహారి ఏమైందని అడుగుతాడు. వచ్చాక చెప్తానని అంటుంది. ఇక అందరూ పార్టీలో సరదాగా ఉంటారు. లక్ష్మీని వదల కూడదు అని అంబిక అనుకుంటుంది. లక్ష్మ స్విమ్మింగ్ ఫూల్ దగ్గర నిల్చొని ఉంటే అంబిక అక్కడికి వెళ్లి ఎవరూ చూడకుండా లక్ష్మీని నీటిలో తోసేస్తుంది. విహారి లక్ష్మీ కోసం చూస్తాడు. లక్ష్మీ కనిపించకపోవడంతో మొత్తం వెతుకుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: రత్నమాలకు పక్షవాతం.. గిరి మారిపోయాడా.. త్రిపుర పెళ్లికి ఒప్పుకుంటుందా!





















