అన్వేషించండి

Janaki Kalaganaledu October 12th: ఫుల్ గా తాగొచ్చి జానకిని నోటికొచ్చినట్టు మాట్లాడిన అఖిల్- చెంప పగలగొట్టిన జ్ఞానంబ

అఖిల్, జెస్సి మధ్య మనస్పర్థలు తెచ్చేందుకు మల్లిక కుట్ర చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

జానకి చదువుకుంటూ ఉంటుంటే అది చెడగొట్టాలని మల్లిక ప్లాన్ వేస్తుంది. జానకి అని పిలుస్తూ ఉంటే చికిత మల్లికని చూస్తుంది. జానకమ్మ గారు చదువుకుంటున్నారు, మీకు ఏం కావాలో చెప్పండి నేను చేస్తాను అని చికిత అంటుంది. కానీ మల్లిక మాత్రం నాకు జానకితో మాత్రమే పనుంది అని చికితని పంపించేస్తుంది. జానకి ముందుకి వచ్చి కాలు నొప్పి అని నాటకం మొదలుపెడుతుంది. దీంతో జానకి చదువు ఆపేసి తన దగ్గరకి పరుగులు పెట్టేస్తుంది. డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తాను రమ్మని జానకి అంటుంది. హాస్పిటల్ కి వెళ్తే నా కడుపు డ్రామా బయటపడిపోతుందని అనుకుని నొప్పి లేదులే అని అంటుంది. నొప్పి లేదు ఆమె నాటకం ఆడుతున్నారు అని జానకితో చికిత అంటుంది. కావాలంటే ఒకసారి పరీక్షించి చూడండి అని చెప్తుంది.

Also Read: సామ్రాట్ పగలైనా, రాత్రైనా వస్తాడు మర్యాద చేసి తీరుతా- తులసి ఉగ్రరూపం

సూదితో గుచ్చితే నీ నొప్పి చిటికిలో తగ్గిపోతుందని జానకి అంటుంది. మల్లిక ఆ మాటకి బిత్తరపోతుంది. జానకి సూదితో పొడిచే టైమ్ కి లేచి నా కాలు నొప్పి తగ్గిపోయింది ఎప్పటిలాగానే నడుస్తున్నా తప్పించుకుంటుంది. ఎందుకు మల్లిక నన్ను చదువుకొనివ్వకుండా డిస్ట్రబ్ చేస్తున్నావ్ ఈ పరీక్షలు నాకు చాలా ఇంపార్టెంట్ నన్ను చదువుకొనివ్వు ఇంకోసారి ఇలా చేయకు అని జానకి గట్టిగా చెప్తుంది. అప్పుడు నిజంగానే నొప్పి వచ్చింది ఇప్పుడు తగ్గిపోయిందని మల్లిక జారుకుంటుంది. అఖిల్ ఇంటికి తాగి వస్తున్నాడని చూసి మల్లిక వెంటనే అత్తయ్యగారు అత్తయ్యగారు అని అరుస్తుంది. అఖిల్ పీకల దాకా మందులో మునిగి వచ్చాడు అని చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావ్ అఖిల్ తాగి రావడం ఏంటి అని గోవిందరాజులు అడుగుతాడు.

అప్పుడే అఖిల్ ఒళ్ళు తెలియకుండా తాగి తులుతూ ఇంట్లోకి వస్తాడు. తాగి తూలిపడబోతుంటే జెస్సి వెళ్ళి పట్టుకుంటుంది. జ్ఞానంబ అఖిల్ దగ్గరకి వెళ్ళి తాగి వచ్చావా అని అడుగుతుంది. నోరు తెరిచి సమాధానం చెప్పు అని అఖిల్ చొక్కా పట్టుకుంటుంది. లేదమ్మా అని అఖిల్ అనేసరికి జ్ఞానంబ చెంప చెల్లుమనిపిస్తుంది. జెస్సి వచ్చి తనని లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. జెస్సికి మత్తు దిగిపోయేలాగా చన్నీళ్లతో తలస్నానం చేయిస్తుంది. ఎందుకు ఇలా చేశావ్ అఖిల్ అసలే నీ మీద అత్తయ్యగారు కోపంగా ఉంటే ఇలాంటి పిచ్చి పనులు చేసి ఇంకా దూరం అవుతావా అని జెస్సి అంటుంది. అమ్మకి నా మీద కోపం రావడానికి దూరం పెట్టడానికి కారణం నువ్వే అని అఖిల్ చిరాకుపడతాడు. అప్పుడే జానకి, మల్లిక వస్తారు.

Also Read: ఆదిత్య, రుక్మిణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సత్య- మాధవ్ కన్నింగ్ ప్లాన్

నా మాట వినకుండా చేశావ్ అందుకే ఇప్పుడు నా వల్ల ముందు దోషిగా నిలబడ్డాను అనేసరికి జానకి ఎంట్రీ ఇస్తుంది. తాగొచ్చి అందరినీ బాధపెట్టింది కాక నీ తప్పుకి జెస్సిని కారణం చేస్తున్నావా అని అడుగుతుంది. మల్లిక మళ్ళీ అఖిల్ దగ్గరకి వచ్చి పుల్ల వేసేందుకు చూస్తుంది. నువ్వు ప్రేమించావని అత్తయ్యగారికి ఎదురు నిలబడి మీకు పెళ్లి చేసింది, కనీసం నిన్ను బిడ్డలాగా చూసుకునే పెద్ద వదిన కోసం మామూలుగా ఉండవచ్చు కదా అని అంటుంది. అఖిల్ మల్లిక మాటల ప్రభావంతో జానకి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. ఇక్కడితో ఐపీఎస్ డ్రీమ్ వదిలేస్తాను అని చెప్పి అమ్మ మీద ప్రామిస్ చేసి ఆ తర్వాత ఏం చేశావ్ వదిన, అన్నయ్యని మభ్యపెట్టి కాలేజీకి వెళ్ళి చదువుకోవాలని అనుకున్నావ్, నీ స్వార్థం నువ్వు చూసుకున్నావ్ అది తప్పు కాదా. నువ్వు చేస్తే తప్పు కాదు నేను చేస్తే మాత్రం దాన్ని పెద్దది చేసి అమ్మ ముందు నన్ను బ్యాడ్ చేస్తున్నావ్ అని అరుస్తాడు.

టాప్ హెడ్ లైన్స్

Eknath Harika New House : కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
Godavari Serial Today July 17th: 'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!
'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!
Nindu Manasulu Serial Today July 17th: నిండు మనసులు: నా భర్తని నీకు ఇచ్చేస్తున్నా తీసుకో.. ఈశ్వరి చెంప పగలగొట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇందిర!
నిండు మనసులు: నా భర్తని నీకు ఇచ్చేస్తున్నా తీసుకో.. ఈశ్వరి చెంప పగలగొట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇందిర!
Karthika Deepam 2 Serial Today July 17th: కార్తీకదీపం 2 సీరియల్: చెఫ్‌ని కొనేసిన మాలిని! కాఫీ పెట్టడం రాని జ్యోత్స్నతో పోటీలో వంటలు వండిస్తారా!
కార్తీకదీపం 2 సీరియల్: చెఫ్‌ని కొనేసిన మాలిని! కాఫీ పెట్టడం రాని జ్యోత్స్నతో పోటీలో వంటలు వండిస్తారా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget