Jagadhatri Serial February 14th: కౌషికితో ఛాలెంజ్ చేసిన దివ్యాంక.. ఎస్సైకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన ధాత్రి, కేదర్!
Jagadhatri Serial Today Episode: దివ్యాంక కోరిక ఏమిటో నిషిక చెప్పడంతో షాకైన కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠత కధలో ఏర్పడుతుంది.
Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో.. నా మీద చెయ్యి ఎత్తావు కదా దీని పర్యావసనం మామూలుగా ఉండదు, నీ బ్రతుకు మీద కొడతాను, నువ్వు ఏదైతే దాయాలని చూస్తున్నావో అది ప్రపంచానికి తెలిసేలాగా చేస్తాను.. ఇది నా ఛాలెంజ్ అంటుంది దివ్యాంక.
ధాత్రి : నువ్వు మా మామయ్య గారి గురించి వార్త ఎలా నీ ఛానల్లో వేస్తావో నేను చూస్తాను ఇది నా ఛాలెంజ్.
దివ్యాంక: మీ వదిన చేసిన తప్పుకి మీరందరూ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. (అని నిషికతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.)
నిషిక: అంతా అయిపోయింది. సొసైటీలో తనకు ఎంత పేరు ఉందో తెలిసి కూడా తన మీద చెయ్యెత్తి తప్పు చేశారు. ఒకవేళ మీ వలన కంపెనీకి ఏదైనా నష్టం జరిగితే మీరు సీఈవో పోస్ట్ కి రిజైన్ చేయాలి. లేకపోతే మేమందరం మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము. (అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.)
వైజయంతి: తను చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది, సమస్య నువ్వే తెచ్చావు కాబట్టి పరిష్కారం కూడా నువ్వే చేయాలి (అని తను కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.)
మరోవైపు పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్సై కానిస్టేబుల్స్ ని సీసీ కెమెరాలు ఆపమని చెప్పి కాసేపు బయట వెయిట్ చేయండి అని చెప్పి పంపించేస్తాడు. ఇంతలో ఫుడ్ తీసుకుని కౌషికి అక్కడికి వస్తుంది.
ఎస్సై (కౌషికి చేతిలో ఉన్న బ్యాగ్ చూసి): ఏంటి మేడం ఇది.
కౌషికి: మా బాబాయ్ కి డిన్నర్ తీసుకొని వచ్చాను.
ఎస్సై: నాకు ఇవ్వండి నేను నా చేత్తో స్వయంగా తినిపిస్తాను. (అని కౌషీకి దగ్గర క్యారియర్ లాక్కొని నేలకేసి కొడతాడు.)
కౌషికి : కోపంతో రగిలిపోతూ ఇప్పుడే నీ అంతు చూస్తాను. (అని చెప్పి ఎవరికో ఫోన్ చేయడానికి బయటికి వెళుతుంది.)
ఇంతలో ఎస్ఐ సుధాకర్ సెల్ లోకి వెళ్లి మర్యాదగా మినిస్టర్ గారిని హత్య చేసినట్లు ఒప్పుకో లేదంటే అనవసరంగా నా చేతిలో చావు దెబ్బలు తింటావు అంటాడు.
సుధాకర్ : నా బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా నాతో మాట్లాడుతున్నావు.
ఎస్సై: మాట్లాడితే బ్యాగ్రౌండ్ అంటావు ఏంటి నీకున్న బ్యాక్ గ్రౌండ్ (అంటూ సుధాకర్ మీద చేయి చేసుకుంటాడు. సుధాకర్ కూడా ఎస్ఐ మీద చేయి చేసుకుంటాడు. ఆ తర్వాత ఎస్సై సుధాకర్ ని బాగా కొడుతూ ఉంటాడు.)
ఇంతలో ధాత్రి వాళ్ళు క్యారియర్ తీసుకొని అక్కడికి వస్తారు. బయట ఉన్న కౌషికిని చూసి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతారు.
కౌషికి : బాబాయ్ కి డిన్నర్ తీసుకొని వచ్చాను. (అంటూ జరిగిందంతా చెప్తుంది.)
ధాత్రి : మేం కూడా మావయ్య గారికి డిన్నర్ తీసుకొని వచ్చాము. మీరు ఈ క్యారియర్ పట్టుకోండి మేము ఇప్పుడే వస్తాము (అని లోపలికి వెళ్తారు.)
ఎస్సై లోపలికి వచ్చింది ఎవరో గమనించే లోపు అతనిని ముసుగువేసి చితక్కొడతారు. తర్వాత కామ్ గా బయటికి వెళ్లిపోతారు.
ముసుగు తొలగించిన ఎస్ఐ కానిస్టేబుల్స్ ని పిలిచి నన్ను ఎవరో కొట్టారు, అది ఎవరో మీరు చూశారా అని అడుగుతాడు.
కానిస్టేబుల్స్ చూడలేదు అని చెప్తారు. మేం చూసాము అంటూ ధాత్రి, కేదార్ వాళ్ళు లోపలికి వస్తారు.కానీ వాళ్ళ మొహాలు చూడలేకపోయాం అంటూ వెటకారంగా మాట్లాడుతుంది ధాత్రి.
ఎస్సై : కానిస్టేబుల్స్ తో సిసి ఫుటేజ్ ఆన్ చేయండి, వాళ్ళు ఎవరో నేను చూడాలి.
కానిస్టేబుల్స్: మీరే కదా సీసీ కెమెరాలు ఆపివేయమన్నారు.
ధాత్రి : మేము మా మామయ్య గారి కోసం భోజనం తీసుకువచ్చాము స్వయంగా మీరే తినిపిస్తారంట కదా తినిపిస్తారా.
ఎస్సై : మీరే తినిపించండి.
కౌషికి, కేదార్ సుధాకర్ సెల్ లోకి వెళ్లి అతనికి డిన్నర్ పెడతారు.
ధాత్రి : ఎస్సైతో మాట్లాడుతూ ఒక పోలీస్ కి అవార్డులు రివార్డులు కాదు అసలైన గెలుపు, ధైర్యంగా ఒక మనిషి మీ గుమ్మంలోకి రావడం గెలుపు. మీ లైఫ్ లో ఒక్కసారైనా గెలవాలని కోరుకుంటున్నాను (అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.)
సుధాకర్: నేను ఆలోచన లేకుండా చేసిన పనికి మీరందరూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసి వస్తుంది. నేను అరెస్టు అయిన విషయం కూడా బయట ప్రపంచానికి తెలియకూడదు. (తర్వాత కేదార్ కి థాంక్స్ చెప్తాడు.)
బయటికి వచ్చిన తర్వాత తండ్రి చూపించిన ప్రేమకి ఆనందపడిపోతాడు కేదార్. అదే విషయాన్ని ధాత్రితో షేర్ చేసుకుంటాడు.
మరుసటి రోజు పొద్దున్న ఆలోచనలో ఉన్న కౌషికి దగ్గరికి ధాత్రి వాళ్లతో పాటు నిషిక వస్తుంది.
నిషిక : మావయ్య గారి గురించి తన చానల్లో వేయొద్దు అని దివ్యాంకని రిక్వెస్ట్ చేశాను అందుకు ఆమె ఒప్పుకుంది.
కేదార్(వెటకారంగా): బదులుగా ఆమె ఏదైనా అడిగి ఉంటుందే.
నిషిక: కౌషికి వదిన దివ్యాంకకి సారీ చెప్తే సరిపోతుంది. ఆ మాటలకి ధాత్రి వాళ్లు షాక్ అవుతారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: గుడ్‌న్యూస్ చెప్పిన మెగా కోడలు - క్లింకార ట్విన్ సిస్టర్స్‌ని పరిచయం చేసిన ఉపాసన!