అన్వేషించండి

Jagadhatri December 26 Episode - 'జగద్ధాత్రి' సీరియల్: యువరాజ్ 'ట్రాప్'లో ఇరుక్కున్న కేదార్, కౌషికిని నిలదీసిన కుటుంబం!

Jagadhatri Today Episode: కేదార్ మీద పడిన నింద నిజం కాదని నిరూపించుకోడానికి మూడు రోజులు సమయం ఇస్తుంది కౌషికి. దాంతో ధాత్రి నిజాన్ని ఎలా నిరూపిస్తుందో అనే క్యూరియాసిటీ కథలో ఏర్పడుతుంది.

Jagadhatri Telugu Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో దీనంతటికి కారణం జగద్ధాత్రి. తనే మధ్యలో రాకుండా ఉండి ఉంటే ఈపాటికి ఇంట్లో పెద్ద రచ్చ జరిగి ఉండేది అంటుంది నిషిక.

నిషిక తల్లి : ఇక మీదట ఏం చేయబోతున్నావు అని కూతుర్ని అడుగుతుంది.

నిషిక : ఏముంది ఆఫీసులో ఈరోజు అడుగు పెడుతున్నాను రేపు ఆఫీస్ ని ఆక్రమించుకుంటాను అంటుంది.

నిషిక తల్లి : ముందు ఇంట గెలిచి తరువాత రచ్చ గెలువు. జగద్ధాత్రి ఇంట్లో ఉన్నంతకాలం నీ ఆటలు సాగవు అందుకే ముందు వాళ్ళని ఇంట్లోంచి బయటికి గెంటేయ్.

అది సాధ్యం కాదు అంటుంది నిషిక. ఎందుకు సాధ్యం కాదు అంటూ యువరాజ్ గదిలోకి వస్తాడు. వాళ్ళిద్దర్నీ ఇంట్లోంచి బయటికి పంపించడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పి తన ప్లాన్ నిషిక వాళ్లకి చెప్తాడు.

నిషిక తల్లి: ఈ ప్లాన్ ఎవరు అమలు పరుస్తారు.

యువరాజ్: మా అమ్మ అయితే ఎవరికి అనుమానం రాదు అంటాడు.

తర్వాత ఒక ఫైల్ వైజయంతికి ఇచ్చి ఇది కేదార్ కి ఇచ్చి నాన్నకి ఇమ్మని చెప్పు అని పురమాయిస్తాడు యువరాజ్.

వైజయంతి: ఫైల్ తో పాటు కప్పుతో కాఫీ కూడా తీసుకొని వెళ్తుంది. కేదార్ ని మాటల్లో పెట్టి నీకు ఎవరైనాకాఫీ ఇచ్చారో లేదో అని తీసుకుని వచ్చాను అని ప్రేమగా మాట్లాడుతుంది. నువ్వు తాగుతూ ఉండు ఈ ఫైల్ ఆయనకి ఇచ్చి వస్తాను అని వెనక్కి తిరుగుతుంది. అప్పుడే కాలి నరం పట్టేసినట్లుగా నటిస్తూ నాకు ఒక సాయం చేసి పెట్టు ఈ ఫైల్ కొంచెం ఆయనకి ఇచ్చి రా అని చెప్తుంది.

కేదార్ ఫైల్ ఇవ్వటానికి ఒప్పుకుంటాడా అని క్యూరియాసితో చూస్తూ ఉంటారు యువరాజ్ దంపతులు. అప్పుడే ధాత్రి వచ్చి ఏంటి ఈ ఫైల్ ఏం జరిగిందని అడుగుతుంది. జరిగిందంతా చెప్తాడు కేదార్

ధాత్రి: ఈ ఫైల్ లో ఏముందో చూద్దాం.

వైజయంతి: అలా చూస్తే కౌషికి వాళ్ళు కోప్పడతారు అని ఫైల్ మూసేసి కేదార్ చేతిలో పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

ధాత్రి : ఏదో తేడాగా ఉంది, ఆ ఫైల్ నేను తీసుకుని వెళ్లి ఇస్తాను అంటుంది.

తమ ప్లాన్ ఫెయిల్ అయిపోతుందని భయపడతారు యువరాజ్ వాళ్ళు.

కేదార్: వద్దులే నేనే తీసుకొని వెళ్లి ఇస్తాను మొదటిసారి పిన్ని నాతో ప్రేమగా మాట్లాడి నాకు పని చెప్పింది అని చెప్పి ధాత్రి పిలుస్తున్నా వినిపించుకోకుండా సుధాకర్ దగ్గరికి వెళ్తాడు. నాన్న.. పిన్ని ఈ ఫైల్ మీద సంతకం పెట్టమంది అంటాడు.

సుధాకర్ : అలా పిలవద్దని చెప్పాను కదా అని కోప్పడతాడు, తర్వాత కేదార్ దగ్గర ఫైల్ తీసుకుని సంతకం పెడుతూ ఉంటే యువరాజ్ వచ్చి మా నాన్నని మోసం చేయాలనుకుంటావా, నువ్వు ఫైల్ మధ్యలో పేపర్స్ పెట్టడం నేను చూశాను అని ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు.

ఏం జరిగింది అంటూ అందరూ అక్కడికి వస్తారు. జరిగిందంతా చెప్తాడు యువరాజ్.

కేదార్: నేను ఏ డాక్యుమెంట్స్ అందులో పెట్టలేదు అంటాడు.

నిషిక : పెట్టాడో లేదో చూస్తే తెలుస్తుంది కదా అంటుంది.

అప్పుడు యువరాజ్ ఫైల్ తీసుకొని అందులో ఉన్న డాక్యుమెంట్స్ ని చదవమని వాళ్ళ బాబాయ్ కి ఇస్తాడు. ఆస్తి అంతా తన పేరు మీద రాయించుకుంటున్నట్లుగా ఆ డాక్యుమెంట్స్ లో ఉంటుంది.

సుధాకర్: నన్నే మోసం చేయాలని అనుకుంటున్నావా అంటూ కేదార్ చెంప పగలగొడతాడు.

కేదార్: ఆస్తి కావాలంటే ఎలా తీసుకోవాలో నాకు తెలుసు కానీ నేను ఇక్కడికి వచ్చింది ఆస్తి కోసం కాదు.

ధాత్రి : అసలు మేము ఈ ఇంట్లో ఉండటమే ఇష్టంలేని మీరు ఆయనకి ఫైలు ఇవ్వమని ఎందుకు ఇచ్చారు అని లాజిక్ గా వైజయంతిని అడుగుతుంది.

నరం పట్టేసింది అందుకే ఇచ్చాను అంటుంది వైజయంతి. లిఫ్ట్ ఉంది కదా అంటుంది ధాత్రి.

కౌషికి : అది నిజమే కదా పిన్ని లిఫ్టు ఉంది కదా అంటుంది.

మీరేంటి మమ్మల్ని నమ్మకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అని కౌషికిని అందరూ తప్పు పడతారు.

కేదార్ ని ఇంట్లోంచి బయటికి పొమ్మని యువరాజ్, అక్క నాకు మాట ఇచ్చింది గడువు పూర్తయ్యేంత వరకు నేను ఇంట్లోంచి కదిలేది లేదు అంటూ కేదార్ ఇద్దరు చొక్కాలు పట్టుకుంటారు.

ధాత్రి: నాకు రెండు రోజులు టైం ఇవ్వండి తప్పు ఎవరు చేశారో నేను నిరూపిస్తాను అంటుంది.

కౌషికి : రెండు రోజులు కాదు కావాలంటే మూడు రోజులు తీసుకో కానీ నిజం నిరూపించు లేకపోతే ఇద్దరు ఇంట్లోంచి బయటికి పోవాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read: నల్లగా ఉన్నాడు వీడు హీరో ఏంటని అన్నారు - ట్రోల్స్ పై రోషన్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు, ఎమోషనల్ అయిన సుమ!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 7th: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget