Jagadhatri Serial Today October 29th: జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లిని సుహాసిని ఫోటో చూడకుండా వైజయంతి అడ్డుకుందా! కేథార్ మళ్లీ అరెస్ట్!
Jagadhatri Serial Today Episode October 29th శ్రీవల్లి సుహాసిని ఫోటో చూడకూడదు అని వైజయంతి కీర్తి పాపని అడ్డుపెట్టుకొని శ్రీవల్లి కంట్లో కారం నీరు చల్లేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి, కేథార్ శ్రీవల్లికి సుహాసిని ఫొటో చూపిస్తానని అనుకుంటారు. ఆ విషయం తెలుసుకున్న వైజయంతి శ్రీవల్లిని ఎలా అయినా ఆపాలి అని శ్రీవల్లితో నువ్వు నా కూతురు కాదు అని తేల్చుకునే వరకు నువ్వు ఎక్కడికీ వెళ్లకూడదు ఎవరితో మాట్లాడకూడదు అని చెప్తుంది.
నేను నీ కూతిరినే కదా అమ్మా ఎందుకు అలా మాట్లాడుతావ్ అంటే నువ్వు ఆగవే బొమ్మా నేను చెప్పింది చేయ్ అని అంటుంది. కేథార్ వైజయంతితో శ్రీవల్లికి ఓ ఫోటో చూపిస్తా తర్వాత నువ్వు చెప్పినట్లే చేస్తాం అని కేథార్, జగద్ధాత్రి ఫోటో తేవడానికి వెళ్తారు. కేథార్ జగద్ధాత్రితో ఫోటో చూపిస్తాను అనగానే పిన్ని అంత భయపడింది చూశావా ఇప్పుడే తేలిపోతుందిలే అని ఫోటో తీసుకొని వెళ్తారు. ఏం అవుతుందా అని వైజయంతి కంగారు పడుతుంది.
కేథార్ శ్రీవల్లికి ఫోటో చూడమని అంటాడు. కౌషికి కూడా వచ్చి ఏంటి ఫోటో అని అడుగుతుంది. శ్రీవల్లికి తల్లి పిన్ని ఏనా లేక ఇంకెవరా అని తెలుసుకోవడానికి ఇప్పుడే తేలబోతుందని కేథార్ అంటాడు. వైజయంతి చాలా కంగారు పడుతుంది. కేథార్ ఫోటో చూపించే టైంకి కీర్తి శ్రీవల్లి ముఖం మీద నీరు గన్‌తో విసురుతుంది. కళ్లు మంట అని శ్రీవల్లి అంటే కేథార్, జగద్ధాత్రి ముఖం కడగడానికి తీసుకెళ్తారు. ఇంతలో వైజయంతి ఫోటో దాచేస్తుంది. కౌషికి వైజయంతితో వాటర్ పడితే కళ్లు అంత మండటం ఏంటి.. అంత మంట పుట్టదు కదా అని కౌషికి అనుమానంతో ఆ గన్ ఓపెన్ చేసి చూస్తే కారం రంగు నీళ్లు ఉంటాయి. ఇదేంటి అని కౌషికి అనుకుంటుంది.
కేథార్ ఫోటో కోసం బయటకు వెళ్తాడు. ఇక కౌషికి వైజయంతికి గన్లో ఎందుకు కారం నీరు కలిపారు అని అడుగుతుంది. కిచెన్‌లో ఉంటే నీరు పోసేశా నాకు తెలీదు పొరపాటు జరిగింది కావాలని చేయలేదు అని తడబడుతూ వెళ్లిపోతుంది. ఫోటో చూపించే టైంకి పిన్ని ఇలా చేసింది ఏదో జరుగుతుంది అని కౌషికి అనుకుంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వైజయంతి ఎవరూ చూడకుండా కీర్తి గన్‌లో నీరు అయిపోవడంతో నేను ఇస్తా అని చెప్పి కిచెన్‌లోకి వెళ్లి కారం నీరు కలిపేస్తుంది. శ్రీవల్లి ఫోటో చూడకుండా చేశా మంచిదైంది అని అనుకుంటుంది.
కేథార్, జగద్ధాత్రి ఫోటో కోసం వెతుకుతారు. వైజయంతి వచ్చి ఎక్కడో పడేసుంటావు చూసుకో అని అంటుంది. ఇక్కడే ఉండేది అని కేథార్ అంటే ఇందాక ఎవరో అడ్రస్ కోసం వచ్చారు.. వాడే తీసుకెళ్లిపోయింటాడు బయటకు వెళ్లి చూడండి అని అంటుంది. కేథార్ కీర్తికి ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని అడుగుతుంది. లేదని కీర్తి చెప్తుంది. పిన్ని ఎందుకు అలా చెప్పిందని కేథార్ అంటాడు. జగద్ధాత్రి కేథార్‌తో అత్తయ్యగారే ఫోటో తీశారని కీర్తిని కూడా వాడుకొని శ్రీవల్లిని ఆపారని అర్థమవుతుంది. ఇవన్నీ చేస్తున్నారు.. అంటే శ్రీవల్లి జన్మ రహస్యం అత్తయ్యగారికి తెలుసు అని జగద్ధాత్రి అంటుంది.
కౌషికి వచ్చి పిన్నికి ఏదో తెలుసు అందుకే ఇలా చేస్తున్నారు. ఎన్నో రోజులు నిజం దాచలేరులే అని అనుకుంటారు. ఇక జగద్ధాత్రి చేతికి ఉన్న దెబ్బని కౌషికి చూసి జేడీకి దెబ్బ తగలడం గుర్తు చేసుకుంటుంది. జగద్ధాత్రి కవర్ చేయడానికి స్కూల్‌లో దెబ్బ తగిలింది అని చెప్తుంది. నాకు తెలిసిన వాళ్లకి కూడా ఇలాగే జరిగింది ఇద్దరికీ ఒకే సారి ఒకేలా దెబ్బ తగలడం సాధ్యం అవుతుందా అని కౌషికి అంటే కొన్ని సార్లు అలా అవుతుంది వదినా అని జగద్ధాత్రి అంటుంది. కేథార్ జగద్ధాత్రితో అక్కకి నువ్వే జేడీ అని డౌట్ వచ్చిందని అంటాడు.
యువరాజ్‌కి ఇచ్చిన బెయిల్ గడువు అయిపోయిందని అరెస్ట్ చేయాలని పోలీసులు ఇంటికి వస్తారు. కౌషికి యువరాజ్‌ని పిలుస్తుంది. అందరూ హాల్‌లోకి వస్తారు. బెయిల్ గడువు సాయంత్రం వరకు ఉంది.. సాయంత్రంలోపు యువరాజ్ తప్పు చేయలేదని నిరూపిస్తామని జగద్ధాత్రి అంటుంది. సాయంత్రం వచ్చి అరెస్ట్ చేయండి టైం ఉంది కాబట్టి మీరు మాకు కోపరేట్ చేయండి అని సుధాకర్ అంటాడు. అలా కుదరదు మా ప్రొసీజర్ మాకు ఉంది అని పోలీసులు యువరాజ్‌ని తీసుకెళ్తారు. నిషి, వైజయంతి ఏడుస్తారు. జేడీ, కేడీ కాపాడుతారని కౌషికి అంటుంది. నాకు తెలిసిన మినిస్టర్‌కి కూడా చెప్తా మీరేం బాధ పడొద్దని కౌషికి అంటుంది. కౌషికి సుధాకర్‌తో జేడీ, కేడీలు మనల్ని ఈ సమస్య నుంచి కాపాడతారు నాకు ఆ నమ్మకం ఉందని అంటుంది. జగద్ధాత్రి, కేథార్ బయటకు వెళ్తారు. కౌషికికి జేడీ, జగద్ధాత్రి ఒకరే అని అనుమానం రావడం వల్ల ఇద్దరినీ ఫాలో అవ్వాలి అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.




















