అన్వేషించండి

Jagadhatri Serial Today JULY 7th:కిడ్నాప్‌ గ్యాంగ్‌ వెనక ఉంది మీనన్‌ అని తెలుసుకున్న జేడీ...సిల్కీని చంపేసిన మీనన్‌

Jagadhatri Serial Today Episode July 7th:కిడ్నాప్‌ గ్యాంగ్‌ వెనక ఉంది మీనన్‌ అని తెలుసుకున్న జేడీ...సిల్కీని చంపేసిన మీనన్‌

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. యూత్‌ను కిడ్నాప్‌ చేస్తోంది ఎవరో తెలుసుకోవడానికి ఆధారమైన సిల్కీ కోసం జేడీ,కేడీ ఫాంహౌస్‌కు వెళ్లగా.....అక్కడికి వచ్చిన మీనన్‌ సిల్కీని చంపేసి వెళ్లిపోతాడు. దీంతో ఈ కిడ్నాప్‌ల వెనక ఉన్నది మీనన్‌ అని తెలిసిపోతుంది.మరోవైపు జగధాత్రిపై ఎలా కక్ష తీర్చుకోవాలా అన్నదానిపై వైజయంతి, నిషిక కుట్రలు పన్నుతుంటారు.
సిల్కీని గుర్తించిన జేడీ
                        విటుడి వేషంలో ఫాంహౌస్‌కు వెళ్లిన కేడీ...అక్కడ సిల్కీ కావాలంటూ అడుగుతాడు. ఎంత డబ్బులు అయినా ఇస్తానని చెబుతాడు.ఈరోజు సిల్కీ డ్యూటీలో లేదని చెప్పినా నాకు తనే కావాలని అడుగుతాడు. దీంతో అక్కడ రిసెప్షనిస్టు సిల్కీకి ఫోన్ చేసి చెప్పడంతో పంపించమని చెబుతుంది. దీంతో జేడీ ఆమె రూమ్‌లోకి వెళ్తాడు. అక్కడ పెన్‌ కెమెరాలో చూసి తనే సిల్కీ అని జేడీ నిర్థరించుకుంటుంది. అయితే ఇంతలోనే మీనన్ తన మనుషులతో అక్కడికి వచ్చి సిల్కీని చంపేయమని చెబుతాడు. మీనన్ పంపిన రౌడీలు లోపలికి వెళ్లడం చూసిన జేడీ...వెంటనే కేడీకి ఫోన్ చేసి రౌడీలు లోపలికి వస్తున్నారని చాలా జాగ్రత్తగా ఉండమని చెబుతుంది.
                          రౌడీలు రిసెప్షనిస్టు దగ్గరకు వెళ్లి తాము సిల్కీ దగ్గరకు వెళ్తున్నామని ఎవరినీ రానివ్వకుండా చూసుకోమని చెబుతారు. ఆల్రెడీ సిల్కీ దగ్గరకు ఒకరు వెళ్లారని చెప్పగా...ఇంతుకు ముందు అడిగితే ఎవరూలేరని...ఇవాళ తను దందా చేయడం లేదని చెప్పావు కదా అని అంటారు. నిజంగానే ఆమె దందా చేయడం లేదని...కాకపోతే ఒకరు వచ్చి ఎక్కువ డబ్బులు ఇస్తామని తనే కావాలని అడగడంతో సిల్కీ ఓకే చెప్పిందని చెబుతాడు.ఈ విషయం వాళ్లు మీనన్‌కు ఫోన్ చేసి చెబుతారు.సిల్కీ కోసం ఎవడో లోపలికి వెళ్లాడని చెప్పగా...వాడు పోలీసు అని మీనన్ చెబుతాడు. ఇంతలో జేడీ కూడా కేడీకి ఫోన్ చేసి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ విషయం సిల్కీకి తెలిసిపోవడంతో ఆమె పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తే వాళ్లు చంపేస్తారని...కాబట్టి నువ్వు మాకు సహకరించమని కేడీ అంటాడు.
సిల్కీని చంపేసిన మీనన్‌
                            ఇంతలో రౌడీలు లోపలికి రావడంతో కేడీ వాళ్లందరినీ ఇరగదీస్తాడు. ఫాంహౌస్‌కు బయట తాళాలు వేయడంతో జేడీ.రమ్యతో కలిసి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వస్తుంది. మిగిలిన రౌడీలను కొట్టి సిల్కీని కాపాడి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా....మీనన్ లోపలికి వచ్చేస్తాడు. సిల్కీని అడ్డుపెట్టుకుని తన మనుషులందరినీ బయటకు తీసుకెళ్తాడు. జేడీ,కేడీ కూడా తమ గన్‌లు పడేయడంతో....మీనన్‌ సిల్కీ గొంతుకోసి చంపి వెళ్లిపోతాడు. కిడ్నాప్‌ల వెనక ఉంది మనమేనని జేడీకి తెలిసిపోయిందని...ఇప్పటికే మనం ఎక్కడ ఉన్నామో కనిపెట్టడానికి మనుషులను పంపించి ఉంటుందని మీనన్ కోపంతో రగిలిపోతాడు. వెంటనే ఈ డెన్‌ను ఇక్కడ నుంచి మార్చివేయాలని రౌడీలకు చెబుతాడు. తీసుకొచ్చిన యువతీ, యువకులందరికీ మత్తు టాబ్లెట్‌లు ఇచ్చి వేసుకోమని హెచ్చరిస్తారు. డిప్యూటీ కలెక్టర్ కొడుకు కృష్ణ మాత్రం టాబ్లెట్‌ వేసుకున్నట్లు నటించి పక్కన పడేస్తాడు. మిగిలిన 12 మందిని కూడా త్వరగా తీసుకొచ్చి అవయవాలు తీసివేయాలని రౌడీలకు మీనన్ ఆదేశిస్తాడు.
నిషిక,వైజయంతి కుట్రలు
                               వైజయంతి వద్దకు వచ్చి నిషిక సారీ చెబుతుంది. ఆ జగధాత్రి మాటలు విని మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నానని అంటుంది. మనం చేసిన పనులన్నీ అందిరి ముందు చెప్పి ఇప్పుడు సారీ చెబితే సరిపోతుందా అని అలుగుతుంది. ఆ జగధాత్రి మత్తులో పడి తెలియక తప్పు చేశానని ఇకపై అలా జరగదని నిషిక అంటుంది. ముందు ఆ సోనీ పని చెబుదామని అనగా...ఆ సోనీని పెట్టించిన జగధాత్రిని వదిలేసి దాని గురించి ఎందుకని వైజయంతి అంటుంది. అయితే ఇంతకు ముందు కన్నా రెట్టింపు పగ తీర్చుకుందామని నిషిక  అంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 21th:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసిన చిట్టినేనని తెలుసుకున్న విక్కీ...నిలదీసిన విక్కీకి సుందరి ఏం చెప్పింది...?
Podarillu Serial Today August 21th:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
పొదరిల్లు:దుర్గాప్రసాద్‌ బారీ నుంచి తండ్రిని కాపాడుకున్న కొడుకులు...అన్నదమ్ములకు తెలిసిన నిజం ఏంటి..?
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget