Jagadhatri Serial Today JULY 29th: శ్రీవల్లిని బలవంతంగా లాక్కెళ్లిన పాపారాయుడు...చంపేయమంటూ రౌడీలకు అప్పగింత
Jagadhatri Serial Today Episode July 29th:శ్రీవల్లిని బలవంతంగా లాక్కెళ్లిన పాపారాయుడు...చంపేయమంటూ రౌడీలకు అప్పగింత

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. జగధాత్రి,కేదార్ ఇంట్లో లేని సమయంలో చూసి పాపారాయుడు శ్రీవల్లిని బలవంతంగా లాక్కుని వెళ్తాడు. అనుమానం వచ్చిన జగధాత్రి ఇంటికి వచ్చి అడగ్గా...పాపారాయుడుకి ఇచ్చి ఊరికి పంపించామని వైజయంతి చెబుతుంది.దీంతో పాపారాయుడు లొకేషన్ ట్రేస్ చేసుకుని జగధాత్రి వెతకడానికి బయలుదేరుతుంది. పాపారాయుడు శ్రీవల్లిని రౌడీలకు అప్పగించి తనను కొట్టి తీసుకెళ్లారంటూ నాటకం ఆడతాడు. జేడీ రాయుడు దగ్గరకు వచ్చి అతని ఫోన్ తీసుకుని రౌడీల నెంబర్ నోట్ చేసుకుని శ్రీవల్లి ముంబయి హైవేలో వెళ్తుందని తెలుసుకుని కాపాడటానికి బయలుదేరుతుంది. ఇంతలో పాపారాయుడు రౌడీలకు ఫోన్ చేసి శ్రీవల్లిని చంపేయమని చెబుతాడు.
శ్రీవల్లిని లాక్కెళ్లిన పాపారాయుడు
గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్న శ్రీవల్లిని పాపారాయుడు బలవంతంగా తలుపు పగులగొట్టి లాక్కుని వచ్చి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోతాడు. మనం లేని సమయంలో శ్రీవల్లికి నిషిక వాళ్లు ఏదైనా అపాయం తలపెట్టవచ్చని జగధాత్రికి అనుమానం వస్తుంది. శ్రీవల్లికి ఫోన్ చేస్తుంటే నిషిక స్విచ్ఛాప్ చేస్తుంది.దీంతో జగధాత్రి నిషికకు ఫోన్ చేసి అడిగితే...శ్రీవల్లి సంగతి నాకు తెలియదని అబద్ధం చెబుతుంది. దీంతో జగధాత్రి కేదార్‌ను ఆదిలక్ష్మీ పిన్నిని ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పి కారు దిగిపోతుంది.ఆటోలో ఇంటికి చేరుకుని శ్రీవల్లి ఎక్కడ అని నిషికను నిలదీస్తుంది. మా అన్నయ్య వచ్చి ఆ అమ్మిని తీసుకెళ్లిపోయాడని వైజయంతి చెబుతుంది.మాకు తెలియకుండా ఎందుకు పంపించారని జగధాత్రి అడగ్గా...ఆ అమ్మాయి మా ఇంటి అమ్మాయి అని...నీకు చెప్పి నీ పర్మిషన్ తీసుకుని పంపించాల్సి అవసరం లేదని చెప్పి వాళ్లు వెళ్లిపోతారు.
పాపారాయుడు వెంటపడిన జేడీ
వెంటనే జగధాత్రి రమ్యకు ఫోన్ చేసి పాపారాయుడు కారును ట్రేస్ చేయమని చెబుతుంది. జగధాత్రి ఇంట్లో నుంచి వెళ్లగా...ఇది మామయ్యను కనిపెట్టేలోగా వాళ్లు ఎప్పుడో ఊరుదాటి వెళ్లిపోతారని యువరాజు అంటాడు. రమ్య ఫోన్ చేసి పాపారాయుడు ఏ రూట్‌లో వెళ్తున్నాడో చెబుతుంది.దీంతో జగధాత్రి కూడా అటు వెళ్తుంది. మధ్యలో కేదార్‌కు జరిగిన విషయం మొత్తం చెప్పి తన దగ్గరకు రమ్మని చెబుతుంది. ఇంతలో దివ్యాంక కారు చెడిపోవడంతో రోడ్డుపై నిల్చుంటుంది.అప్పుడే పాపారాయుడు కారు దిగి రౌడీలకు ఫోన్ చేస్తుంటాడు. అనుమానం వచ్చిన దివ్యాంక శ్రీవల్లిని ఎక్కడో చూసినట్లు ఉందనుకుని....కౌషికి ఇంట్లో ఉన్న అమ్మాయి కదా అనుకుంటుంది.అప్పుడే పాపారాయుడు ఫోన్‌లో రౌడీలను అరుస్తుంటాడు.త్వరగా వచ్చి నన్ను కొట్టి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లమని ఈరోజుతో మాబావకు పుట్టిన కూతురు శని విరగడైపోతుందని అంటాడు.అంటే ఈ అమ్మాయి సుధాకర్ అక్రమ సంతానం అన్నమాట అని దివ్యాంక అనుకుంటుంది. ఈ వీడియో అడ్డం పెట్టుకుని నిషికను ఆడుకుంటానని అంటుంది.
రౌడీల చేతుల్లోకి వెళ్లిన శ్రీవల్లి
పాపారాయుడు మనుషులు వచ్చి పాపారాయుడు తలపై ఒ దెబ్బ వేసి శ్రీవల్లిని లాక్కుని వెళ్లిపోతారు. ఇప్పుడు నేను ఇంట్లో వాళ్లను నమ్మించాలంటే తలకు ఇంకాస్త పెద్ద దెబ్బ తగిలించుకోవాలని పాపారాయుడు స్తంభానికి తల బాదుకుని రక్తం తెచ్చుకుంటాడు.అప్పుడే అక్కడి వచ్చిన జేడీ...శ్రీవల్లి ఎక్కడ అని అడుగుతాడు. మీకు శ్రీవల్లి ఏం తెలుసని అనగా...జగధాత్రి ఫోన్ చేసి చెప్పిందని అంటారు.ఇప్పుడే రౌడీలు తనను కొట్టి ఆ అమ్మాయిని లాక్కుని వెళ్లిపోయారని పాపారాయుడు అబద్ధం చెబుతాడు. శ్రీవల్లిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని కేదార్ ధాత్రిని అడగ్గా....పాపారాయుడు బాబాయి నాటకం ఆడుతున్నాడని చెబుతుంది. మా ఫోన్ సిగ్నల్స్ లేవని చెప్పి పాపారాయుడు ఫోన్ తీసుకుని అందులో రౌడీలకు చేసిన నెంబర్ నోట్ చేసుకుంటారు. ఆ నెంబర్ రమ్యకు పంపించి ట్రేస్ చేయమని చెబుతారు. రమ్య ఆ కారు ముంబయి హైవేలో వెళ్తుందని చెప్పడంతో జగధాత్రి, కేదార్ వెంటపడతారు. వెంటనే పాపారాయుడు రౌడీలకు ఫోన్ చేసి ఆ జేడీ,కేడీ వస్తున్నారని వెంటనే శ్రీవల్లిని చంపేయమని చెబుతాడు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
ట్రెండింగ్ వార్తలు





















