అన్వేషించండి

Jagadhatri Serial Today January 26th:కమలాకర్‌పై హత్యాయత్నం కేసులో కేదార్ అరెస్ట్‌...పోలీసుస్టేషన్‌లో మాస్‌ ఎంట్రీ ఇచ్చిన జగధాత్రి

Jagadhatri Serial Today Episode January 26th:కమలాకర్‌పై హత్యాయత్నం కేసులో కేదార్ అరెస్ట్‌...పోలీసుస్టేషన్‌లో మాస్‌ ఎంట్రీ ఇచ్చిన జగధాత్రి

Jagadhatri Serial Today Episode: కమలాకర్‌పై దాడి జరగడంతో కౌషికితోపాటు  సుధాకర్‌, యువరాజు అక్కడికి వస్తారు. అప్పుడే కేదార్ చేతిలో కత్తి ఉండటంతో అతనే ఈ దాడికి పాల్పడినట్లు అనుకుంటారు.  తాను ఏ తప్పు చేయలేదని చెప్పినా వారు వినిపించుకోరు. పోలీసులకు ఫోన్ చేస్తారు. మాబాబాయిను చంపడానికి నువ్వే ట్రై చేశావని తెలిస్తే...మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని కౌషికి కేదార్‌కు వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో ఆంబులెన్స్‌కు ఫోన్ చేయగా...వారు వచ్చి కమలాకర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తారు. బయటకు వచ్చిన తర్వాత కేదార్‌ వాళ్ల నాన్నతో మాట్లాడతాడు. నేను నీ రక్తం పంచుకునిపుట్టిన వాడినని ఎట్టి పరిస్థితుల్లోనూ  తప్పు చేయనని అంటాడు. దీంతో సుధాకర్‌ కేదార్ చెంపపై గట్టిగా కొడతాడు. నువ్వు నా కొడుకువి కాకుండా ఉంటే బాగుండని అనుకుంటున్నానని అంటాడు. 
               

కౌషికి, సుధాకర్‌ అక్కడి నుంచి  వెళ్లిపోగా...పోలీసులు వచ్చి కేదార్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లబోతుంటాడు. అప్పుడు జగధాత్రి అడ్డుపడి కేదార్ ఎలాంటి తప్పు చేయాలేదని అంటుంది. వెంటనే ఏసీపీ హరినాథ్‌కు ధాత్రిని చూడగానే ఎవరినో చూసినట్లు అనిపిస్తుంది.మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉందని అంటాడు. ఆధారాలు కలెక్ట్‌ చేసుకుని కేదార్‌ను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తాడు. అప్పుడే జగధాత్రికి హోంమినిష్టర్‌ తాయర్‌ నుంచి ఫోన్ వస్తుంది. ఎప్పుడూ గంభీరంగా ఉండే జగధాత్రి గొంతు ఎందుకు భేలగా ఉందంటూ ఉడికిస్తుంది. మీ ఆయన మర్డర్‌ కేసులో జైలుకెళ్లాడని తెలిసిందని...సానుభూతి తెలుపుదామని ఫోన్ చేసినట్లు తాయరు చెబుతుంది. నీ సానుభూతి నాకేం  అవసరం లేదని ధాత్రి గట్టిగా కౌంటర్‌ ఇస్తుంది.నేను ఇచ్చే షాక్‌కు నువ్వు జైలుకు వెళ్తే మళ్లీ ఆలోచించడానికి కూడా ఏం మిగలదని హెచ్చరించి ఫోన్ పెట్టేస్తుంది.
                       

కేదార్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లిన ఏసీపీ హరినాథ్‌ అతడిని ఇంటరాగేషన్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. కమలాకర్‌ను ఎందుకు చంపాలనుకున్నావని అంటాడు. నాకు ఏం తెలియదని చెప్పానుకదా అని కేదార్ అంటాడు.ఇంతలో జగధాత్రి అక్కడికి వస్తుంది. కేదార్‌ను చూడాలని గొడవ చేస్తుంది. ఆ మాటలకు ఏసీపీ మళ్లీ బయటకు వచ్చి జగధాత్రిని కింద నుంచి పైకి చూస్తూ ఆలోచనలో పడతాడు.మీకు బెజవాడ కలెక్టర్‌ తెలుసా అని ఆరా తీస్తాడు.మీకు అక్కా,చెల్లెల్లు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఎవరు లేరని జగధాత్రి సమాధానమిస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉందని మళ్లీ అంటాడు.

తాను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదని జగధాత్రి అంటుంది. కేదార్‌ను కలవాలని చెప్పగా....కుదరదని చెబుతాడు.ఇది నాస్టేషన్‌ ఇక్కడ నేనే చెప్పిందే రూల్‌ అని పొగరుగా అంటాడు. కేదార్ ఈ హత్య చేయలేదని చెప్పగా....ఆ విషయం నాకు తెలుసని, కాకపోతే హత్య ఎవరు చేసినా...కేదార్‌ను ఈ కేసులో ఇరికించడానికే నేను ఇక్కడికి వచ్చానని అంటాడు.అందుకే సస్పెన్షన్‌లో ఉన్న నాకు పోస్టింగ్ ఇచ్చి మరీ ఇక్కడికి పంపారని చెబుతాడు. దీంతో జగధాత్రికి అన్ని విషయాలు అర్థమవుతాయి. ఓకే అని చెప్పి బయటకు వెళ్లిపోతుంది.
                         

కేదార్‌కు బెయిల్ తీసుకుని లాయర్‌ ఏసీపీ వద్దకు వస్తాడు. హత్యానేరం కేసులో ఇంత త్వరగా బెయిల్ వచ్చిందంటే...నీ వెనక చాలా పెద్దమనుషులే ఉన్నారని ఏసీపీ అంటాడు. నువ్వు బెయిల్ తెచ్చినా నేను కేదార్‌ను వదిలిపెట్టనని అంటాడు.అసలు నువ్వు నాకు బెయిల్‌ పేపర్లే ఇవ్వలేదని...నువ్వు ఎవరికి చెప్పుకుంటావో వెళ్లి చెప్పుకో అంటూ బెయిల్‌ పేపర్లు చించివేయబోతాడు.అప్పుడే అక్కడికి రమ్య ఓ లెటర్ తీసుకుని వస్తుంది. ఏసీపీ ఆ లెటర్ చూసి షాక్‌కు గురవుతాడు. ఏంటి కేదార్ కేసు జేడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారా అంటాడు.

ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు జేడీకి అప్పగించి నేను తప్పుకోవాలా అంటాడు. అప్పుడు జేడీ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడగానే లేచి సెల్యూట్ కొట్టి తన కుర్చీలో కూర్చోమని చెబుతాడు ఏసీపీ హరినాథ్‌...అక్కడే ఉన్న లాయర్‌ను చూసి ఇతను ఎవరు ఎందుకు వచ్చాడని అంటుంది.వేరే కేసు విషయం మాట్లాడటానికి వచ్చాడని ఏసీపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు.దీంతో జేడీకి మండిపోయి ఉద్యోగం చేయమంటే...పోలీసుస్టేషన్‌లో దందాలు చేస్తున్నావా  అని నిలదీస్తుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
Illu Illalu Pillalu Serial Today July 31st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీమా కలిసిపోయారా! ఇంటి గుమ్మం దగ్గరే ఊహించని షాక్‌! చివరి సీన్‌ అదుర్స్!
Nuvvu leka Neanu Lenu Serial Today July 31th:రాధ గుడికి వెళ్దామంటే కుదరదన్న విక్కీ...చిట్టిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లడంతో రాధ ఏంచేసింది..?
నువ్వులేక నేను లేను: రాధ గుడికి వెళ్దామంటే కుదరదన్న విక్కీ...చిట్టిని తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లడంతో రాధ ఏంచేసింది..?
Gundeninda Gudigantalu July31th Episode:రోహిణి,మాణిక్యం ఒకే పెళ్లిలోఉన్నారని తెలుసుకున్న విద్య...ఫ్రెండ్‌ను కాపాడేందుకు పాట్లు
గుండెనిండా గుడిగంటలు: రోహిణి,మాణిక్యం ఒకే పెళ్లిలోఉన్నారని తెలుసుకున్న విద్య...ఫ్రెండ్‌ను కాపాడేందుకు పాట్లు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Embed widget