అన్వేషించండి

jagadhatri Serial Today September 5th: ‘జగధాత్రి’ సీరియల్‌: ధాత్రికి సపోర్టుగా నిలిచిన కౌషికి – మీనన్ కు స్పాట్ పెట్టిన జేడీ

Jagadhatri Today Episode: తన తల్లి సంవత్సరీకం చేస్తానని ధాత్రిని వైజయంతి, నిషిక అవమానించడంతో జగధాత్రి సీరియల్ లోని ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode:  వైజయంతి పూజ చేసి వచ్చి యువరాజ్‌ కు హారతి ఇచ్చి కేదార్‌ ను నమ్మొద్దని చెప్తుంది. దీంతో కౌషికి ఎందుకు పిన్ని అలా చెప్తున్నావు అంటూ కేదార్‌ ను వెనకేసుకొస్తుంది. ఇంతలో సత్యప్రసాద్‌ వచ్చి మాధురి ఎంగేజ్‌మెంట్‌ ఎప్పుడు పెట్టుకుందామని అడుగుతాడు. ఈ మూహూర్తాల్లోనే పెట్టుకుందామని సుధాకర్‌ చెప్తాడు.

    మరోవైపు ధాత్రి వాళ్ల అమ్మ ఫోటో తీసుకుని చూస్తూ ఎమోషనల్‌ అవుతుంది. సంవత్సరీకం ఎప్పుడూ చేయలేదని.. ఈసారి అయినా చేద్దామని అనుకుంటున్నట్లు కేదార్‌ కు చెప్తుంది. అందుకే క్యాటరింగ్‌ వాళ్లకు చెప్పాను అంటుంది. మరోవైపు కింద అందరూ ఎంగేజ్‌మెంట్ గురించి మాట్లాడుతుంటే క్యాటరింగ్‌ అతను వస్తాడు. మేము ఎంగేజ్‌ మెంట్‌ గురించి ఇప్పుడే మాట్లాడుతున్నాం. అప్పుడే నీకు ఎవరు చెప్పారని అడుగుతారు. ఇంతలో పైనుంచి కేదార్‌, ధాత్రి వస్తారు.

ధాత్రి: నేనే చెప్పాను..

నిషిక: ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు మా ఇంట్లో పెళ్లికి మీరు క్యాటరింగ్‌ వాళ్లను పిలవడమేంటి?

ధాత్రి: నిషిక నీకు ఆవేశపడటం తప్పా ఒక్క నిమిషం ఆలోచించడం తెలియదా? నేను క్యాటరింగ్‌ అతన్ని పిలిచింది మాధురి ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌ కోసం కాదు. వచ్చే వారం మా అమ్మ సంవత్సరీకం. అందుకే ఒక వంద మందికైనా అన్నదానం చేయాలనుకుంటున్నాను. దానికోసమే వివరాలు కనుక్కోవడం కోసం ఇతన్ని పిలిపించాను.

   అని ధాత్రి చెప్పగానే సత్యప్రసాద్‌ నవ్వుతూ మంచి వాళ్లు పోతేనే అన్నదానం చేస్తారో లేదో కానీ ఒక క్రిమినల్‌ పేరు మీద అన్నదానం జరిపిస్తామంటే నవ్వొస్తుంది నాకు అంటాడు. దీంతో ధాత్రి కోపంగా సత్యప్రసాద్‌ను తిడుతుంది. దీంతో ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. వైజయంతి, నిషిక, కమలాకర్‌, యువరాజ్‌ అందరూ కలసి ధాత్రిని తిడతారు. నువ్వు ఓపెన్‌ గా అన్నదానం చేస్తే ఒక క్రిమినల్‌ కూతురుకు మా ఇంటికి రిలేషన్‌ ఉందని తెలిస్తే ఈ ఇంటి పరువు పోతుంది అందుకే నువ్వు చేయోద్దని చెప్తాడు. దీంతో కౌషికి అడ్డు పడుతుంది. వాళ్ల సంవత్సరీకం జరుపుకుంటే మనకేంటి నష్టం అంటుంది. ఇంతలో ధాత్రి కోపంగా మా అమ్మ నిజాయితీ నిరూపిస్తాను మా అమ్మపై నేరం మోపిన వాళ్ల లెక్కలన్నీ బయటకు తీస్తానని ఛాలెంజ్‌ చేస్తుంది.  దీంతో అందరూ షాక్ అవుతారు.

వైజయంతి: చూశారా? పెద్దంతరం.. చిన్నంతరం లేకుండా.. ఎంత మాట్లాడి పోయిందో..

కౌషికి: పిన్ని తల్లిని అవమానిస్తే జగధాత్రికి ఏంటి? ఎవరైనా అలాగే స్పందిస్తారు. అయినా వాళ్లు అమ్మను అనాల్సిన అవసరం ఏంటి? వాళ్ల అమ్మా ఏ నేరం చేసిందో మనం ఏమైనా చూశామా?

 (అంటూ కోపంగా కౌషికి వెళ్లిపోతుంది. దీంతో సత్యప్రసాద్‌ కూడా వెళ్లిపోతాడు.)

సుధాకర్‌: మీరు మారరా? వాడు మనకు కాబోయే వియ్యంకుడు. ఇకనైనా నోటి దురుసు తగ్గించుకోండి.

నిషిక: అత్తయ్య మనం అనకూడని మాటేమైనా అన్నామా? మామయ్య ఏంటి అంత సీరియస్‌గా వెళ్లిపోతున్నారు.

    అనగానే వైజయంతి ఆయన అంతేలే అమ్మా అంటుంది. మరోవైపు ఇంట్లో వాల్లు తన తల్లిని అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది ధాత్రి. తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అవుతుంది. కౌషికి, కేదార్‌ వచ్చి ధాత్రిని ఓదారుస్తారు. తర్వాత ఒక జిమ్‌ కు వెళ్లిన ధాత్రి, కేదార్‌ కుమార్‌ అనే వ్యక్తిని కలిసి మీనన్‌ లా మిమిక్రీ చేయాలని అడుగుతారు. సినిమా డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ లా అనుకుని మిమిక్రీ చేయబోతే మీనన్‌ అంటే ఆయన కాదని మాఫియా డాన్‌ మీనన్‌ లాగా చేయాలని చెప్తారు. సరే చేస్తానని చెప్తాడు కుమార్‌. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: పూజలో గత జన్మ గుర్తు చేసుకున్న గౌరి, శంకర్ – శ్రావణి, సంధ్యలకు ప్రపోజ్ చేసిన పెద్దొడు, చిన్నోడు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
Embed widget