అన్వేషించండి

Jagadhatri Serial Today October 4th: ‘జగధాత్రి’ సీరియల్‌: నిజం తెలుసుకోవడానికి  హాస్పిటల్‌  కు వెళ్లిన వైజయంతి – అబ్బులును గుర్తు  పట్టిన కౌషికి

Jagadhatri Today Episode:  కావ్య కేసులో ప్రధాన సాక్ష్యం అయిన అబ్బులును కౌషికి గుర్తు పట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode:  ఒక సేటు బంగారు నగలు  తీసుకొచ్చి వైజయంతికి   ఇస్తాడు. కౌషికి ఆర్డర్‌ చేసిందని చెప్తాడు. కౌషికి చాలా మంచిదని వైజయంతి పొగుడుతుంది. ఇంతలో బంగారు  రాఖీ తయారు చేయమని ఉంది ఏంటని నిషిక అడుగుతుంది. దీంతో రాఖీ పండుగ తర్వాత ఒక రోజు రాత్రి పూట  కౌషికి గారు ఫోన్‌ చేసి బంగారు  రాఖీ చేయమని ఆర్డర్‌ ఇచ్చారని చెప్తాడు. దీంతో వైజయంతి కోపంగా కౌషికిని తిడుతుంది. దీంతో అందరికీ అనుమానం వస్తుంది. కౌషికికి అబార్షన్‌ అయిందా? అని ఆలోచిస్తారు. అదేంటో తెలుసుకుందాం పదండి అని హాస్పిటల్‌ కు బయలుదేరుతారు. మరోవైపు హాస్పిటల్‌ లో కౌషికిని టెస్ట్ చేసిన డాక్టర్‌ మీరు  చాలా వీక్‌ గా ఉన్నారు ట్రెస్‌ పెట్టుకోవద్దని జాగ్రత్తలు  చెప్పి పంపిస్తుంది. ఇంతలో వైజయంతి, నిషిక, కాచి అక్కడకు వస్తారు.

ధాత్రి: వదిన మీరు  ఇక్కడే కూర్చోండి మేము వెళ్లి మెడిసిన్స్‌ తీసుకొస్తాము.

మరోవైపు

నిషిక: సిస్టర్‌..

సిస్టర్‌: చెప్పండి మేడం.

నిషిక: కౌషికి గారు  వచ్చారా?

సిస్టర్‌: ఇందాకే జగధాత్రి మేడం వాళ్లు తీసుకెళ్లిపోయారు.

కాచి: ఆవిడ ఎందుకు వచ్చింది ఎందుకు డాక్టర్‌ ను కలిసింది.

నిషిక: కౌషికి గారికి అసలు అబార్షన్‌ అయిందా?

వైజయంతి: ఏందమ్మీ ఈ అమ్మీ ఏమీ అడిగినా అట్టా కళ్లు అప్పగించుకుని చూస్తూ ఉన్నాది.

కాచి: నోరు తెరవాలంటే చేయి బరువెక్కాలి పెద్దమ్మ.

అని డబ్బులు తీసి ఇస్తుంది. కాచి డబ్బులు తీసుకున్న సిస్టర్‌ నాక్కూడా తెలియదని అక్కడి  నుంచి వెళ్లిపోతుంది. నిషిక ఇప్పుడెలా అత్తయ్యా అని అడగ్గానే మనకు నిజం తెలిసిపోయిందని డాక్టర్‌ దగ్గర నిజం రాబడదాము పదండి అని అందరూ డాక్టర్‌ చాంబర్‌ లోకి వెళ్తారు.  డాక్టర్‌ ను బెదిరించి నిజం తెలుసుకోవాలనుకుంటే డాక్టరే వాళ్లను బెదిరించి అక్కడి నుంచి పంపించి వేస్తుంది. బయట ఉన్న ధాత్రి వాళ్లను చూస్తుంది. తాను ఆడిన నాటకం గుర్తు చేసుకుంటుంది. లోపలికి వెళ్లి డాక్టర్‌ కు థాంక్స్‌ చెప్పి వెల్లిపోతుంది. మరోవైపు బయటకు వెళ్తున్న వైజయంతి వాళ్లకు కౌషికి ఎదురు వస్తుంది.

వైజయంతి: ఏందమ్మీ ఆగావు. ( పెనం మీద నుంచి పొయ్యిలో పడిపోయామే ఇక కౌషికి కోపానికి కాలిపోవాల్సిందేనా? అని మనసులో అనుకుంటుంది.)

ధాత్రి: అత్తయ్యగారు మీరందరూ హాస్పిటల్  కు ఎందుకు వచ్చారు.

కేదార్‌: అలా చూస్తున్నావేంటి  నిషి చెప్పండి. ఎందుకు హాస్పిటల్‌ కు వచ్చారు.

కౌషికి: ఏమైంది పిన్ని ఎందుకు ఎవరూ మట్లాడటం లేదు.

ధాత్రి: మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో భయపడుతున్నట్లు..ఏదో దాస్తు్న్నట్లు.. కంగారుపడుతున్నట్లు ఉంది అత్తయ్యగారు.

వైజయంతి: నేనేం దాస్తున్నాను అమ్మీ ఏం లేదు.

ధాత్రి: మరి హాస్పిటల్‌ కు ఎందుకు వచ్చినట్టు..

నిషిక: హాస్పిటల్‌ కు ఎవరైనా ఎందుకు వస్తారే..

కౌషికి: ఏమైంది పిన్ని ఎవరికైనా హెల్త్‌ బాగాలేదా? డాక్టర్‌ గారు  ఉన్నారు పదండి వెళ్దాం.

కాచి: వద్దక్కా డాక్టర్‌ గారి దగ్గరకు మాత్రం వద్దు.

ధాత్రి: అదేంటి కాచి ఎవరైనా హాస్పిటల్‌కు ఎందుకు వస్తారు. డాక్టర్‌కు చూపించుకోవడానికే కదా?

నిషిక: ఏంటో ఇందాక నుంచి చూస్తున్నాను.మేమేదో తప్పు చేసి వచ్చిన వాళ్ల లాగా అన్ని ప్రశ్నలు అడుగుతున్నావు.

అని నిషిక కోప్పడుతుంటే వైజయంతి భయపడి కౌషికిని కూల్‌ చేయడానికి నిన్ను చూడ్డానికే వచ్చామని చెప్తుంది. అలాగే కాచికి కొంచెం పంటి నొప్పి అంటే  చూపిద్దామని వచ్చాం అంటుంది. దీంతో పదండి డాక్టర్‌ దగ్గరకు అనగానే  ఏమీ వద్దని నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అనగానే సరే అని ధాత్రి, కేదార్‌, కౌషికి అక్కడి నుంచి వెళ్లిపోతారు.  

    కారు దగ్గరకు వచ్చిన కేదార్‌, ధాత్రి డ్రైవర్‌ గురించి ఆలోచిస్తారు. ఇంతలో కౌషికి వచ్చి వెళ్దాం పదండి అనగానే అందరూ వెళ్లిపోతారు. ఇంతలో ఒక వ్యక్తి కారుకు అడ్డు రాగానే ఆయన్ని చూసిన కౌషికి నాన్న చనిపోయిన రోజు నాన్నని తీసుకెళ్లిన డ్రైవర్‌ అబ్బులు అంటూ గుర్తు పడుతుంది. ఇంతలో కేదార్‌ ఆయన్ని ఫోటో తీస్తాడు. కౌషికి కంగారుపడుతుంటే మేము చూసుకంటాము మీరు కూల్‌గా ఉండండి అని చెప్తుంది. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 16th: 'గోదావరి' సీరియల్: మురళీ కాలు కాల్చేసిన నందు! సొంత తల్లి, వదినల మీద విరుచుకుపడ్డ శాంతి!
'గోదావరి' సీరియల్: మురళీ కాలు కాల్చేసిన నందు! సొంత తల్లి, వదినల మీద విరుచుకుపడ్డ శాంతి!
Prabhakar Podakandla: దూరదర్శన్‌తో కెరీర్ స్టార్ట్.. బుల్లితెర మెగాస్టార్ స్థాయికి.. యాక్టర్, ప్రొడ్యూసర్ ప్రభాకర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
దూరదర్శన్‌తో కెరీర్ స్టార్ట్.. బుల్లితెర మెగాస్టార్ స్థాయికి.. యాక్టర్, ప్రొడ్యూసర్ ప్రభాకర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today July 16th: నిండు మనసులు: గుడిలో ఇందిర కుట్ర! ఢీ అంటే ఢీ అనుకున్న రెండు ఫ్యామిలీలు!
నిండు మనసులు: గుడిలో ఇందిర కుట్ర! ఢీ అంటే ఢీ అనుకున్న రెండు ఫ్యామిలీలు!
Karthika Deepam 2 Serial Today July 16th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌తో బేరాలాడిన మాలిని! సూరజ్‌ మాటలకు ఫిదా అయిపోయిన పెద్దాయన!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌తో బేరాలాడిన మాలిని! సూరజ్‌ మాటలకు ఫిదా అయిపోయిన పెద్దాయన!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget